shahruk khan
-
అద్భుతాలు సృష్టిస్తున్న జవాన్ సినిమా
-
షారుక్ ఖాన్ ఇంటికి ఫ్రీ ఫుడ్.. ఇది యాపారం!
కొన్నిసార్లు ఆసక్తికర సంఘటనలు జరుగుతుంటాయి. వాటి గురించి తెలియగానే ఫస్ట్ నవ్వొస్తుంది. కానీ దాని వెనకాల ఉన్న విషయం తెలిసిన తర్వాత మాత్రం అమ్మో పెద్ద స్కెచ్ వేశార్రోయ్ అనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి కూడా తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ ఏంటి సంగతి? గత కొన్నేళ్లుగా హిట్ లేక అల్లాడిపోయిన షారుక్ ఖాన్ కి 'పఠాన్' సక్సెస్ ఎక్కడలేని జోష్ ఇచ్చింది. ఇదే ఊపులో 'జవాన్', 'డుంకీ' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. షూటింగ్ లేని టైంలో నెటిజన్స్ తో ముచ్చటిస్తూ, సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నాడు. రీసెంట్ గా అలానే 'ఆస్క్ ఎస్ఆర్కే' పేరుతో ట్విట్టర్ లో చిన్న చాట్ సెషన్ నిర్వహించాడు. (ఇదీ చదవండి: ‘పఠాన్’ కోసం షారుఖ్ ప్రమాదకరమైన స్టంట్లు చేశాడు) ఇందులో భాగంగా ఓ అభిమాని.. షారుక్ ని 'భోజనం చేశావా భాయ్?' అని అడిగాడు. దీనికి రిప్లై ఇచ్చిన బాద్ షా.. 'ఎందుకు బ్రదర్.. నువ్వేమైనా స్విగ్గీ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తావా?' అని ఆటపట్టించాడు. దీంతో సీన్లోకి స్విగ్గీ ఎంటరైంది. వచ్చిందే ఛాన్స్ అన్నట్లు.. షారుక్ ఇంటికి ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేసేసింది. తమ డెలీవరీ బాయ్స్.. షారుక్ బంగ్లా 'మన్నత్' ముందు ఫుడ్ ఐటమ్స్ తో నిలబడి ఉన్న ఫొటోని షేర్ చేసింది. షారుక్ ఖాన్.. చాట్ సెషన్ లో సదరు డెలివరీ సంస్థ పేరు ఉపయోగించారు తప్పితే.. ఎక్కడా మెన్షన్ చేయలేదు. స్పేస్ లేకపోయినా సరే క్రియేట్ చేసుకోవాలి అని మాటల మాంత్రికుడు గతంలో చెప్పింది విన్నారో ఏమో కానీ.. షారుక్ కి ఫ్రీగా ఫుడ్ పంపి, తనకు తానే ప్రమోషన్ చేసుకుంది స్విగ్గీ. దీన్ని చూసిన నెటిజన్స్.. 'ఇది యాపారం' లాంటి ఫన్నీ మీమ్స్ పెడుతూ ఫన్ జనరేట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) hum swiggy wale hai aur hum dinner leke aagaye 🥰 https://t.co/iMFJcYjUVm pic.twitter.com/swKvsEZYhC — Swiggy (@Swiggy) June 12, 2023 -
షారుక్ వర్సెస్ జాన్
ఓ భారీ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించనున్నారు. ఇందులో దీపికా పదుకోన్ కథానాయిక. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. తన గత చిత్రం ‘వార్’లానే (హృతిక్ వర్సెస్ టైగర్ ష్రాఫ్) ఇద్దరు హీరోలతో ఈ యాక్షన్ చిత్రం ప్లాన్ చేసినట్టున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. షారుక్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో హీరో జాన్ అబ్రహాం విలన్ పాత్రలో నటించనున్నారట. జాన్ అబ్రహాంతో షారుక్ తలపడే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమాకు ‘పఠాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం ఇండియాలోనే జరగనుందని టాక్. -
ఆమె చివరికోరిక నెరవేర్చేందుకు..
ఆమె ఒక క్యాన్సర్ పేషంట్. ఆమె చివరికోరికను నెరవేర్చేందుకు ఇప్పుడు నెటిజన్లు నడుం బిగించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను కలువాలన్న ఆమె జీవితకాల ఆకాంక్షను సాకారం చేసేందుకు.. ఏకంగా ఎస్ఆర్కేమీట్స్అరుణ్ (#SRKMeetsAruna) యాష్‌ట్యాగ్‌ను ఇప్పుడు వైరల్‌గా మార్చారు. ఆమె ఫొటోతోపాటు షారుఖ్‌ను ఆమె కలిసినట్టు ఉన్న స్కెచ్‌ను కలిపి ట్వీట్చేస్తూ.. షారుఖ్ దృష్టికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అరుణ పీకే ప్రముఖ నెటిజన్ అని చెప్పాలి. భారత్‌లోని వివిధ రాష్ట్రాల ప్రజలకు తనకు ఎందుకు నచ్చుతారో పేర్కొంటూ ఆమె గత జూలైలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. అరుణ ధైర్యవంతురాలు. చాలా సానుకూల దృక్పథం కల వ్యక్తి. తన చుట్టు ఉన్న వారిలో నిత్యం ఉత్సాహం నింపే ఆమె ఈ మార్చి నాటికి క్యాన్సర్‌పై పోరాటంలో ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిపై పోరాడుతూ.. ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆమె.. ఈ సందర్భంగా వైద్యులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా తన అభిమాన నటుడు షారుఖ్‌ఖాన్ తనలో శక్తిని నింపుతున్నారని, ఈ విషయం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చునని ట్వీట్ చేశారు. 'షారుఖ్‌పై ఉన్న ప్రేమ కన్నా మరేది గొప్పది కాదు..ఒకవేళ నేను ఆయనను కలిస్తే.. నేను బాగుంటాను' అంటూ అరుణ పేర్కొన్నట్టు కామెంట్లు పెట్టి.. నెటిజన్లు ఈ పోస్టును వైరల్ చేశారు. త్వరగా షారుఖ్ ఆమెను కలువాలని కోరుకుంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. Dear @iamsrk please meet your biggest fan @Arunapk57 ji, that's her last wish.#SRKmeetsAruna pic.twitter.com/NOyRSInvbC — Scarface (@al_kameeno) 18 October 2017 #KingKhan's biggest fan and a #cancer patient with critical health condition @Arunapk57 has her ultimate wish to meet @iamsrk#SRKmeetsAruna pic.twitter.com/Uel6kOHpki — Parikshit Sachdeva (@sachdevaparik) 17 October 2017 "No love is greater than the love for #SRK @iamsrk If I would meet him I'll be just fine." - @Arunapk57#SRKmeetsAruna #cancerpatient pic.twitter.com/ZRJ3dlMiVW — Parikshit Sachdeva (@sachdevaparik) 17 October 2017 Dearest @iamsrk .. How many RTs to meet this larger than life woman with can-survive-no-matter-what spirit —> @Arunapk57? #SRKmeetsAruna — #SRKmeetsAruna (@Sai_ki_bitiya) 18 October 2017 If meeting someone means life to them, would you meet them @iamsrk? Your die hard fan @Arunapk57 needs to meet you once.#SRKmeetsAruna pic.twitter.com/6hW2OIeTlE — Parikshit Sachdeva (@sachdevaparik) 17 October 2017 I hope #SRKmeetsAruna. Such fans need to be treated as special ones by their fav star. Hey @iamsrk do meet her at least for 5 mins. — Hunting Tiger!!!!! (@_EternalSalman_) 18 October 2017 Please trend so Shahrukh Sir notices it.. please make this wish come true #SRKMeetsAruna — #SRKmeetsAruna (@Sai_ki_bitiya) 18 October 2017 -
మహేష్ క్రేజ్ చూసి షాకైన బాద్ షా
-
షారూక్‌కి స్పూర్తినిచ్చిన బాహుబలి
ముంబై: బాహుబలి సినిమా తనకు స్పూర్తినిచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రశంసించారు. బాహుబలి ఎంతో కష్టపడి తీసిన సినిమా అని షారుక్ ట్విట్టర్ లో కొనియాడారు. ఈ సినిమా తెరకెక్కించడంలో పని చేసిన ప్రతి ఒక్కరు తనకు ఆదర్శమని కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలితేనే ఆకాశన్నందుకోగలుగుతామని షారుక్ ట్వీట్ చేశారు. బాహుబలి చిత్ బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. Baahubali what a hard worked at film. 2 every1 involved thanx for the inspiration. U can only reach the sky if u r willing to take the leap! — Shah Rukh Khan (@iamsrk) August 2, 2015 -
దేవుడే దిగివచ్చినా!
బాలీవుడ్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే స్టార్లు ఖాన్ త్రయం... షారూఖ్, సల్మాన్, ఆమిర్. ఈ ముగ్గురు హీరోలూ... చాలా కాలం తరువాత ఈమధ్యే జరిగిన సల్మాన్ సిస్టర్ మ్యారేజ్‌లో ఒక్కటయ్యారు. అంతాబానే ఉంది గానీ... స్టార్ దర్శకురాలు ఫరాఖాన్ వీరిని తన కుకరీ షోకు రప్పిస్తుందనేది ఇప్పుడో సంచలన వార్తగా మారింది. కానీ అలాంటిదేమీ లేదని కూల్‌గా చెప్పింది ఫరా. ‘మీరు ప్రయత్నించలేదా’ అంటే... అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది. కాకపోతే... తన ‘ఓంశాంతి ఓం’ సినిమా కోసం ముగ్గుర్నీ ఒకే స్క్రీన్‌పైకి తీసుకు రావాలనుకున్నా వర్కవుట్ కాలేదని చెప్పింది! అసలు తానే కాదు... ఈ ఖాన్ త్రయాన్ని కలిపి ఒకే సినిమాలో చూపించడం ఆ దేవుడి వల్ల కూడా కాదనేసింది! మొత్తానికీ డైలాగ్... ప్రయత్నించి విసిగిపోయిన ఫ్రస్టేషన్లో వచ్చిందా... తనవల్ల కానిది ఇంకెవరివల్లా కాదన్న కాన్ఫిడెన్స్‌తో వచ్చిందా... లేక మళ్లీ ముగ్గురి మధ్య గ్యాప్ పెరిగిందన్న సంకేతం ఇస్తోందో... అన్నది అర్థం కావట్లేదు బీటౌన్ పీపుల్‌కు! -
సంగీతా బిజ్లానీ పనిమనిషిని రేప్ చేసిన షారుఖ్ డ్రైవర్
అతను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డ్రైవరు. ఆ మైనర్ బాలిక అలనాటి అందాల నటి సంగీతా బిజ్లానీ ఇంట్లో పని మనిషి. డ్రైవర్ ఆ పిల్లపై కన్నేశాడు. షారుఖ్ ఇంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించాడు. బాంద్రాలోని ఒక హోటల్ కు రమ్మన్నాడు. ఆ తరువాత ఆమెను రేప్ చేశాడు. అంతటితో ఆగకుండా బాజీగర్ లో షారుఖ్ ఖాన్ లా బెదిరించాడు. 'బయటకు చెబితే అంతే' అన్నాడు. అయితే ఆ బాలిక ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు రాజేంద్ర కుమార్ గౌతమ్ అలియాస్ పింటూ మిశ్ర అనే 34 ఏళ్ల డ్రైవర్ కటకటాలు లెక్కిస్తున్నారు. ఆ బాలిక అయిదు నెలల క్రితమే తన సొంతూరు అయిన లాతూరు నుంచి ముంబాయికి వచ్చింది. ఆమె కుంటుంబానికి ఆమె ఆదాయమే ఆధారం. రాగానే పింటూ మిశ్ర ఆమెపై కన్నేశాడు. అయితే తనకున్న అనేక కార్లలో ఒక కారుని పింటూ మిశ్ర నడుపుతాడు తప్ప అతనికీ తనకీ ఏ సంబంధమూ లేదని షారుఖ్ ఒక ప్రకటనలో చెప్పారు.