
దేవుడే దిగివచ్చినా!
బాలీవుడ్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే స్టార్లు ఖాన్ త్రయం... షారూఖ్, సల్మాన్, ఆమిర్. ఈ ముగ్గురు హీరోలూ... చాలా కాలం తరువాత ఈమధ్యే జరిగిన సల్మాన్ సిస్టర్ మ్యారేజ్‌లో ఒక్కటయ్యారు. అంతాబానే ఉంది గానీ... స్టార్ దర్శకురాలు ఫరాఖాన్ వీరిని తన కుకరీ షోకు రప్పిస్తుందనేది ఇప్పుడో సంచలన వార్తగా మారింది. కానీ అలాంటిదేమీ లేదని కూల్‌గా చెప్పింది ఫరా.
‘మీరు ప్రయత్నించలేదా’ అంటే... అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది. కాకపోతే... తన ‘ఓంశాంతి ఓం’ సినిమా కోసం ముగ్గుర్నీ ఒకే స్క్రీన్‌పైకి తీసుకు రావాలనుకున్నా వర్కవుట్ కాలేదని చెప్పింది! అసలు తానే కాదు... ఈ ఖాన్ త్రయాన్ని కలిపి ఒకే సినిమాలో చూపించడం ఆ దేవుడి వల్ల కూడా కాదనేసింది! మొత్తానికీ డైలాగ్... ప్రయత్నించి విసిగిపోయిన ఫ్రస్టేషన్‌లో వచ్చిందా... తనవల్ల కానిది ఇంకెవరివల్లా కాదన్న కాన్ఫిడెన్స్‌తో వచ్చిందా... లేక మళ్లీ ముగ్గురి మధ్య గ్యాప్ పెరిగిందన్న సంకేతం ఇస్తోందో... అన్నది అర్థం కావట్లేదు బీటౌన్ పీపుల్‌కు!