'Dinner leke aagaye': Swiggy Delivers Free Food To Shah Rukh Khan At Mannat - Sakshi
Sakshi News home page

Shahrukh Khan: షారుక్‌కి ఫ్రీ ఫుడ్ డెలివరీ.. జరిగింది ఇదే?

Published Tue, Jun 13 2023 5:02 PM | Last Updated on Tue, Jun 13 2023 5:47 PM

Swiggy Deliver Free Food To Shahrukh Khan Mannat - Sakshi

కొన్నిసార్లు ఆసక్తికర సంఘటనలు జరుగుతుంటాయి. వాటి గురించి తెలియగానే ఫస్ట్ నవ్వొస్తుంది. కానీ దాని వెనకాల ఉన్న విషయం తెలిసిన తర్వాత మాత్రం అమ్మో పెద్ద స్కెచ్ వేశార్రోయ్ అనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి కూడా తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ ఏంటి సంగతి?

గత కొన్నేళ్లుగా హిట్ లేక అల్లాడిపోయిన షారుక్ ఖాన్ కి 'పఠాన్' సక్సెస్ ఎక్కడలేని జోష్ ఇచ్చింది. ఇదే ఊపులో 'జవాన్', 'డుంకీ' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. షూటింగ్ లేని టైంలో నెటిజన్స్ తో ముచ్చటిస్తూ, సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నాడు. రీసెంట్ గా అలానే 'ఆస్క్ ఎస్ఆర్కే' పేరుతో ట్విట్టర్ లో చిన్న చాట్ సెషన్ నిర్వహించాడు.

(ఇదీ చదవండి: ‘ప‌ఠాన్‌’ కోసం షారుఖ్‌ ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్లు చేశాడు)

ఇందులో భాగంగా ఓ అభిమాని.. షారుక్ ని 'భోజనం చేశావా భాయ్?' అని అడిగాడు. దీనికి రిప్లై ఇచ్చిన బాద్ షా.. 'ఎందుకు బ‍్రదర్.. నువ్వేమైనా స్విగ్గీ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తావా?' అని ఆటపట్టించాడు. దీంతో సీన్లోకి స్విగ్గీ ఎంటరైంది. వచ్చిందే ఛాన్స్ అన్నట్లు.. షారుక్ ఇంటికి ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేసేసింది. తమ డెలీవరీ బాయ్స్.. షారుక్ బంగ్లా 'మన్నత్' ముందు ఫుడ్ ఐటమ్స్ తో నిలబడి ఉన్న ఫొటోని షేర్ చేసింది.

షారుక్ ఖాన్.. చాట్ సెషన్ లో సదరు డెలివరీ సంస్థ పేరు ఉపయోగించారు తప్పితే.. ఎక్కడా మెన్షన్ చేయలేదు. స్పేస్ లేకపోయినా సరే క్రియేట్ చేసుకోవాలి అని మాటల మాంత్రికుడు గతంలో చెప్పింది విన్నారో ఏమో కానీ.. షారుక్ కి ఫ్రీగా ఫుడ్ పంపి, తనకు తానే ప్రమోషన్ చేసుకుంది స్విగ్గీ. దీన్ని చూసిన నెటిజన్స్.. 'ఇది యాపారం' లాంటి ఫన్నీ మీమ్స్ పెడుతూ ఫన్ జనరేట్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement