ఆల్‌మోస్ట్‌ మీ డెలివరీ బాయ్‌ కథ ముగిసిపోయేదే: నటుడు | 'Almost Killed Your Rider': Ronit Roy Slams Swiggy | Sakshi
Sakshi News home page

మీ డెలివరీ బాయ్‌ చచ్చేవాడే! మీరసలు వాళ్ల ప్రాణాలు పట్టించుకుంటారా?

Published Mon, Feb 26 2024 2:17 PM | Last Updated on Mon, Feb 26 2024 2:58 PM

Almost Killed Your Rider: Ronit Roy slams Swiggy - Sakshi

బాలీవుడ్‌ నటుడు రోనిత్‌ రాయ్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీపై విరుచుకుపడ్డాడు. త్వరగా ఫుడ్‌ డెలివరీ చేయాలన్న ఆత్రమో, మరేంటో కానీ రాంగ్‌ రూట్‌లో వచ్చాడట. కొద్దిలో అతడిని ఢీ కొట్టి ప్రాణాలు తీసేవాడినే అంటూ ఎక్స్‌(ట్విటర్‌)లో మండిపడ్డాడు నటుడు. మీ డెలివరీ బాయ్స్‌కు రోడ్డుపై ఎలా నడుచుకోవాలో కాస్త ట్రైనింగ్‌ ఇస్తే బాగుంటుందని చురకలంటించాడు.

ట్రాఫిక్‌ ఏరియాలో రాంగ్‌ రూట్‌లో..
'చిన్నగా ఉండే ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ప్రయాణిస్తున్నంతమాత్రాన రోడ్డుపై ఇష్టారీతిన వెళ్లకూడదు కదా.. అది కూడా ట్రాఫిక్‌ ఏరియాలో ఇలా రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం కరెక్ట్‌ కాదు. మీరు వారి ప్రాణాలను పట్టించుకుంటారా? లేదంటే కేవలం వ్యాపారానికే పరిమితమవుతారా?' అని ఆక్రోశం వెళ్లగక్కాడు. దీనిపై స్విగ్గీ యాజమన్యం స్పందించింది.

తగిన చర్యలు తీసుకుంటాం!
మా డెలివరీ పార్ట్‌నర్లు ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తారనే అనుకుంటున్నాం. మీరు చెప్పిన అంశాన్ని నోట్‌ చేసుకున్నాం. మీకు ఇంకా ఏవైనా వివరాలు తెలిస్తే చెప్పండి. తగిన చర్యలు తీసుకుంటాం అని రిప్లై ఇచ్చింది. కాగా రోనిత్‌ ప్రస్తుతం బడే మియా చోటే మియా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈద్‌ పండగ సందర్భంగా రిలీజ్‌ కానుంది.

చదవండి:  వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు నాతో షేర్‌ చేసుకుంటాడు.. అలాంటిది..: చిరంజీవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement