షారుక్‌ వర్సెస్‌ జాన్‌ | John Abraham to star in Shah Rukh Khan starrer Pathan | Sakshi
Sakshi News home page

షారుక్‌ వర్సెస్‌ జాన్‌

Published Sat, Aug 22 2020 1:44 AM | Last Updated on Sat, Aug 22 2020 1:44 AM

John Abraham to star in Shah Rukh Khan starrer Pathan - Sakshi

షారుక్‌ ఖాన్, జాన్‌ అబ్రహాం

ఓ భారీ యాక్షన్‌ మూవీ చేయడానికి రెడీ అయ్యారు షారుక్‌ ఖాన్‌. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారు. ఇందులో దీపికా పదుకోన్‌ కథానాయిక. యశ్‌ రాజ్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. తన గత చిత్రం ‘వార్‌’లానే (హృతిక్‌ వర్సెస్‌ టైగర్‌ ష్రాఫ్‌) ఇద్దరు హీరోలతో ఈ యాక్షన్‌ చిత్రం ప్లాన్‌ చేసినట్టున్నారు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌. షారుక్‌ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో హీరో జాన్‌ అబ్రహాం విలన్‌ పాత్రలో నటించనున్నారట. జాన్‌ అబ్రహాంతో షారుక్‌ తలపడే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమాకు ‘పఠాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం ఇండియాలోనే జరగనుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement