Siddharth Anand
-
దీపికా పదుకొణ్ మసాలా సాంగ్‌ను తొలగించిన 'ఫైటర్' టీమ్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ జోడీగా నటించిన ఫైటర్ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. సినిమా బాగుందని మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. కాగా, ఈ చిత్రం నుంచి ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్‌ను తొలగించేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లోకి వచ్చిన రోజు నుంచి దీపికా అందాలకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికే యూట్యూబ్‌లో సాంగ్‌ను చూసినవారు థియేటర్లో కూడా చూడొచ్చు అనుకుంటే ఫైటర్ మేకర్స్ షాక్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్‌పై ఈ సాంగ్ కనిపించకపోయేసరికి వారిలో కొంతమేరకు నిరాశ కలిగింది. ఈ సాంగ్‌లో హీరోయిన్ దీపికా పదుకొణ్ విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. కానీ సినిమాలో ఆమె పాత్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కీలకమైన పదవిలో ఉంటూ ఇలాంటి అసభ్యకరమైన సాంగ్‌లో చూపించడం కరెక్ట్ కాదని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్‌గా ఆ సాంగ్‌ను దర్శక నిర్మాతలు సినిమా నుంచి తొలగించడం జరిగింది. గతంలో పఠాన్ సినిమాలో కూడా దీపికా పదుకొణ్ మితిమీరిన అందాల ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు ఆమె దుస్తుల మీద కూడా వివాదం చెలరేగింది. కానీ ఆ సమయంలో షారుక్ ఖాన్ వివరణ ఇవ్వడంతో ఆ సాంగ్ థియేటర్లో కూడా రన్ అయింది. ప్రస్తుతం ఫైటర్ సినిమా విషయంలో ఎయిర్ ఫోర్స్ అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ‘ఇష్క్ జైసా కుచ్’ సాంగ్‌ను తొలగించేశారు. యూట్యూబ్‌లో మాత్రం ఈ సాంగ్‌ను చూడవచ్చు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి దేశభక్తి సినిమాలో ఆ సాంగ్ లేకపోవడమే మంచిదని కూడా కామెంట్లు వస్తున్నాయి. -
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాపై పబ్లిక్ టాక్
బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం ఫైటర్.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. భారీ యాక్షన్ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఫైటర్ చిత్రంపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందని ఆయన తెలపారు. ఫైటర్ సినిమాను చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు. ఈ సినిమాను మిస్ చేసేకోవద్దని ఆయన చెప్పారు. సోషల్‌మీడియాలో ఫైటర్ సినిమాకు 4.5 రేటింగ్ ఇచ్చారు.సినిమాకు అంతగా బజ్ లేకపోడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవని ఆయన తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రం ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయని తెలిపారు. సినిమా కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు తరణ్ ఆదర్శ్. దీపికా పదుకోన్‌తో ఆయన కెమిస్ట్రీ సూపర్ అంటూ పేర్కొన్నారు. అనిల్ కపూర్ ఎప్పటిలా అద్భుతంగా నటించారని చెప్పారు. సెకండాఫ్ ఫైటర్ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. ఇందులో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ ఉన్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్ భారీ హిట్ కొట్టాడని మాస్ కా బాప్ అంటూ ఈ చిత్రంలోని బీజీఎమ్ సూపర్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. ఫైటర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అని ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ పనితీరు చాలా బాగుందని ఒక నెటిజన్ తెలిపాడు. దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు చూడలేదని ఒక నెటిజన్ తెలిపాడు. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్లో ఈ చిత్రం బెస్ట్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ఫైటర్ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్‌కు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా అని నెటిజన్లు తెలుపుతున్నారు. #OneWordReview...#Fighter: BRILLIANT. Rating: ⭐️⭐️⭐️⭐️½#War. #Pathaan. Now #Fighter. Director #SiddharthAnand scores a hat-trick… Aerial combat, drama, emotions and patriotism, #Fighter is a KING-SIZED ENTERTAINER, with #HrithikRoshan’s bravura act as the topping… JUST DON’T… pic.twitter.com/t9fmssfw2P — taran adarsh (@taran_adarsh) January 24, 2024 Baap Level Entry of #HrithikRoshan BGM + Greek God Screen Present is Totally Goosebumps, Goosebumps. MASS KA BAAP 🔥🔥🔥#FighterReview #Fighter #HrithikRoshan𓃵 pic.twitter.com/n92lKNlG1L — AMIR ANSARI (@amirans934) January 25, 2024 #FighterReview - ⭐⭐⭐⭐⭐ Lots of Action, VFX is Top Level, and Storytelling is Masterclass, best movie of #HrithikRoshan𓃵 Career. A MUST WATCH 🔥🔥🔥#HrithikRoshan #Fighter pic.twitter.com/Grl1RTPriE — FMOVIES 🎥 (@FMovie82325) January 24, 2024 EXCLUSIVE 🚨🚨🚨 #Fighter Public Review Action Sequences are never seen before Once in a lifetime experience for Everyone #SiddharthAnand #HrithikRoshan#FighterReview#FighterOn25thJan #FighterFirstDayFirstShowpic.twitter.com/txIAHM8tcM — The Unrealistic Guy (@Guy_Unrealistic) January 25, 2024 FIGHTER RECEIVED EXCELLENT RESPONSE IN AUSTRALIA AND NEW ZEALAND 🔥🔥 People Call it Dhamaka of Entertainment and Patriotism 🇮🇳🇮🇳#FighterFirstDayFirstShow #FighterReview #Fighter https://t.co/dFow4B2YG1 — Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) January 25, 2024 #Fighter is a MASTERPIECE and a MEGA BLOCKBUSTER Film filled with a lot of Action, Drama, emotions and full-on patriotism. From Hrithik performance to the direction Everything was so good about the movie. This will take the Box office by storm. Rating - 5/5 #FighterReview pic.twitter.com/RG1w74ZvN5 — Renjeev Chithranjan (@RenjeevC) January 25, 2024 #FighterReview 1st half done: It’s okay so far those who have seen top gun but built up is nice.#HrithikRoshan𓃵 entry will have whistles and that arrogance is just amazing Hrithik and #DeepikaPadukone has better chemistry on screen than promos. — MeerajRules (@meerajrules) January 25, 2024 -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'ఫైటర్' టీజర్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- దీపికా పదుకోన్ కాంబినేషన్లో ఫైటర్ చిత్రం రానుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో సాగే భారతీయ మొదటి ఏరియల్ యాక్షన్‌గా ఈ సినిమాను నిర్మించారు. 'ఫైటర్' టీజర్లో జెట్ ఫ్లైట్స్ విన్యాసాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజర్ ఎండ్ వరకు ఫైట్ జెట్స్తో వాళ్లు చేసే సాహసాలు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే ఏడాదిలో షారుక్ ఖాన్‌తో పఠాన్ లాంటి హిట్ కొట్టిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మళ్లీ ఫైటర్ చిత్రంతో అదే రేంజ్ విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ మేరకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్లో దీపికా పదుకోన్- హృతిక్ రోషన్ల మధ్య హాట్ రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ కానుంచి ఫైటర్. ఇదే ఏడాది అదే తేదీన పఠాన్ రిలీజ్ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. ఏకంగా షారుక్ ఖాన్‌కు కమ్‌బ్యాక్ చిత్రంగా అది నిలిచి రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసింది. -
‘పఠాన్’ కోసం షారుఖ్ ప్రమాదకరమైన స్టంట్లు చేశాడు
షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహాం నటించిన సినిమా పఠాన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం షారుఖ్ చాలా కష్టపడినట్లు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెలిపాడు. ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించడానికి బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ అంకితభావంతో పనిచేశారని, ఇలాంటి శారీరక సౌష్టవం పొందాలంటే, హద్దులు దాటిన ప్యాషన్ ఉండాలని, అది షారుఖ్ లో కనిపించదని అన్నారు దర్శకుడు. `పఠాన్‌లో షారుఖ్ చూపించిన ఫిజిక్ కోసం ఆయన అత్యంత కృషి చేశారు. ఆయన కష్టానికి ఫలితం దక్కింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను తొలిసారి షారుఖ్‌ని కలిసినప్పుడు జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. శారీరకంగా ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడాలో మాట్లాడుకున్నాం. ఆయన ప్రతి పదాన్ని గుర్తుంచుకున్నారు. ఆచరణలో పెట్టారు. ఇవాళ దాని ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చేశారు షారుఖ్. ప్రమాదకరమైన ప్రదేశాల్లో, ప్రమాదకరమైన వాతావరణంలో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ కి థియేటర్లలో మరో రేంజ్ అప్లాజ్ దక్కి తీరుతుంది. ఇంత కష్టమైన స్టంట్స్ కోసం ఆయన శారీరకంగా అంతే గొప్పగా సిద్ధమయ్యారు. మన దేశంలోనే అత్యంత భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది పఠాన్. షారుఖ్‌ని స్క్రీన్ మీద చూసిన ప్రతి ఒక్కరికీ ఆయన చేసిన కృషి అర్థమవుతుంది. మేం డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని నిజం చేయడానికి ఆయన తీసుకున్న శ్రమకు ఫిదా అయిపోయాం. షారుఖ్‌లాగా ఇంకెవరూ ఉండరు. సినిమాల పట్ల ఆయనకు ఉండే అంకితభావం, ప్రేమను అర్థం చేసుకోవాలంటే పఠాన్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే` అని సిద్దార్థ్ ఆనంద్ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళ్, తెలుగులో విడుదల కానుంది. -
వందల కోట్లకు షారుక్ ఖాన్ సినిమా డిజిటల్ రైట్స్..
Shahrukh Khan Pathan OTT Rights Sold Worth 200 Crores: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేసి సుమారు మూడేళ్లు కావొస్తుంది. ఆయన మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ 'పఠాన్' మూవీతో వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. షారుక్‌తోపాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొణె నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఈ మూవీ భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్ కొనుగోలైంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నుంచి ఫ్యాన్సీ అమౌంట్ అందుకుందని సమాచారం. 'పఠాన్' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా 'పఠాన్' చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడని టాక్. 'జీరో' సినిమా తర్వాత షారుక్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో వచ్చిన 'జీరో' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో 'పఠాన్'పై షారుక్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. చదవండి: ఆఖరికి పోలీసులు కూడా వదల్లేదు: షారుక్ ఖాన్ జిరాక్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రా ఏజెంట్‌గా ప్రభాస్..హాలీవుడ్ స్టయిల్లో ఉంటుందట!
‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్ జోరు పెంచారు.. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలను అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమా దాదాపు పూర్తి కాగా ‘ఆదిపురుష్, సలార్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. ఇవి కాకుండా హిందీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారన్నది తాజా టాక్. ఈ క్యారెక్టర్ హాలీవుడ్ స్టయిల్లో ఉంటుందని సమాచారం. -
షారుఖ్ 'పఠాన్' సెట్స్‌లో కొట్టుకున్నారా?
ముంబై: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పఠాన్' సినిమా సెట్స్‌లో ఘర్షణ జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ అసిస్టెంట్ డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగడమే కాకుండా చాచి కొట్టాడని పుకార్లు వ్యాపించాయి. దీనిపై అదే సెట్స్‌లో ఉన్న ఓ వ్యక్తి స్పందిస్తూ ఈ వార్తలన్నీ నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. అందులో ఇసుమంత నిజం కూడా లేదని స్పష్టం చేశారు. సిద్దార్థ్ తన టీమ్‌తో అన్యోన్యంగా మెదులుతారని, వాళ్లు కూడా ఇతడిని బాస్‌లా కాకుండా సొంత అన్నలా భావిస్తారని చెప్పుకొచ్చారు. నిజానికి సెట్స్‌లో అసలు ఏం జరిగిందనేది పూస గుచ్చినట్లుగా వెల్లడించారు. చదవండి: ఆ హీరోయిన్ నాలుక కోసేయండి : పొలిటీషియన్) "లైన్మెన్ తన పని తాను చేస్తున్న సమయంలో స్వల్పంగా గాయపడ్డాడు. అదృష్టం బాగుండి అదేమంత పెద్ద గాయం కాదు. కానీ అక్కడే ఉన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో దాన్ని వీడియో తీయడం మొదలు పెట్టాడు. అలా చేయకూడదని సిద్ధార్థ్ హెచ్చరించాడు. అయినా సరే అతడు సీక్రెట్‌గా వీడియో తీస్తూనే ఉన్నాడు. ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు కావడంతో సిద్ వెంటనే అతడి ఫోన్‌ను ఇచ్చి సెట్స్ నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. తప్పు చేసిందే కాక ఆ జూనియర్ ఆర్టిస్ట్ తిరగబడ్డాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెంటనే అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. ఇదీ అక్కడ జరిగింది. అంతే కానీ ఎవరూ దెబ్బలాడుకోలేదు. చెంపదెబ్బలు చరుచుకునేంతగా కొట్టుకోలేదు" అని చెప్పుకొచ్చారు. పఠాన్‌లో దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (చదవండి: విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను: నటి) -
ఫైటర్ పైలట్
‘బ్యాంగ్ బ్యాంగ్, వార్’ చిత్రాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, హీరో హృతిక్ రోషన్ మూడో సినిమా కోసం కలిశారు. ఆదివారం హృతిక్ రోషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజా చిత్రాన్ని ప్రకటించారు. ‘ఫైటర్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తారు. ఇందులో పైలట్‌గా కనిపించనున్నారు హృతిక్. ‘సిడ్’ (సిద్ధార్థ్)తో మూడోసారి, దీపికతో తొలిసారి కలసి పని చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మీ అందరికీ ఓ సూపర్ రైడ్‌ను అందిస్తాం’’ అన్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాది చివర్లో ‘ఫైటర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. 2022 సెప్టెంబర్ 30న సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
జోడీ కుదిరిందా?
బాలీవుడ్ సూపర్‌స్టార్ దీపికా పదుకోన్ హిందీలో దాదాపు అందరు స్టార్స్‌తో యాక్ట్ చేశారు. అయితే ఇప్పటివరకూ హృతిక్ రోషన్‌కి జోడీగా నటించలేదీ బ్యూటీ. ఈ ఇద్దరూ కలసి యాక్ట్ చేయాలని ఎప్పటినుంచో ఈ ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలోనే కలసి యాక్ట్ చేయనున్నారని టాక్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా కమిట్ అయ్యారట హృతిక్. ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక నటిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కాంబినేషన్ రిపీట్?
షారుక్ ఖాన్ – కాజోల్ అప్పట్లో బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మైనేమ్ ఈజ్ ఖాన్’ వంటి బాక్సాఫీస్ హిట్స్‌లో ఈ ఇద్దరూ నటించారు. ఇప్పుడు షారుక్ ఖాన్ – దీపికా పదుకోన్ అలాంటి జోడీలా మారింది. ఈ ఇద్దరూ ఆల్రెడీ ‘ఓంశాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాల్లో కనిపించారు. తాజాగా షారుక్ ఖాన్ చేయబోతున్న రెండు సినిమాల్లోనూ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటిస్తారని టాక్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో చేయబోతున్న ‘పఠాన్’, తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న ‘సంకీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లోనూ కథానాయికగా దీపిక పేరునే పరిశీలిస్తున్నారట. మరి ఈ ఇద్దరూ మళ్లీ జంటగా నటిస్తే... ముందు సినిమాల మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? వేచి చూడాలి. -
షారుక్ వర్సెస్ జాన్
ఓ భారీ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించనున్నారు. ఇందులో దీపికా పదుకోన్ కథానాయిక. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. తన గత చిత్రం ‘వార్’లానే (హృతిక్ వర్సెస్ టైగర్ ష్రాఫ్) ఇద్దరు హీరోలతో ఈ యాక్షన్ చిత్రం ప్లాన్ చేసినట్టున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. షారుక్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో హీరో జాన్ అబ్రహాం విలన్ పాత్రలో నటించనున్నారట. జాన్ అబ్రహాంతో షారుక్ తలపడే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమాకు ‘పఠాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం ఇండియాలోనే జరగనుందని టాక్. -
గన్‌దరగోళం
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ను ఢీ కొట్టడానికి టైగర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ మెషీన్‌గన్ ‘గాట్లింగ్’తో వాడబోతున్నారని తెలిసింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్ చోప్రా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ చిత్రాల ప్రేమికులకు కనువిందులా ఉండేందుకు అద్భుతమైన లొకేషన్స్‌లో యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఈ మెషీన్గన్తో సిటీని ధ్వంసం చేస్తూ గన్‌దరగోళం సృష్టిస్తారట టైగర్. ఈ సీన్స్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తాయట. వాణీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
200 కోట్ల బడ్జెట్.. పది దేశాల్లో షూటింగ్..!
భారతీయ చిత్రాలు విదేశాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో మన దర్శక నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పద్మావత్, తగ్స్ ఆఫ్ హిందుస్తాన్, టైగర్ జిందాహై లాంటి చిత్రాలకు 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.. చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో భారీ చిత్రం చేరనుంది. బాలీవుడ్ యాక్షన్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల కాంబినేషన్లో యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు 10 దేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ హీరోగా బ్యాంగ్ బ్యాంగ్ చిత్రాన్ని తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి ఫొటోనూ చిత్ర హీరోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
మున్నాభాయ్ ఈజ్ బ్యాక్!
సంజయ్‌దత్ జైలు నుంచి విడుదలై మూడు నెలలైంది. మరి... కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారు? అని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. చకచకా సినిమాలు చేసేయాలని సంజయ్ దత్ ఫిక్స్ అయిపోయారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో సంజయ్‌దత్‌కు మంచి ఫైట్లు ఉన్నాయట. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ కోసం సంజయ్‌దత్ ఎన్ఎస్జీ కమాండో తరహాలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈలోగా ఆయన ఓ యాడ్‌లో కనిపించే అవకాశం ఉంది. ముంబైలోని మధ్ దీవిలో జరుగుతున్న ఈ యాడ్ షూటింగ్ కోసం కెమెరా ముందుకు వచ్చారు సంజయ్. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారిపోయింది. అక్కడి స్థానికులు తమ ప్రాంతానికి సంజయ్‌దత్ వచ్చారని తెలిసి, ఆయన్ను చూడటానికి పోటీ పడ్డారు. సంజయ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, వాళ్లతో ఫొటోలు దిగి, ఆనందపరిచారట. కొంత విరామం తర్వాత సంజయ్ నటుడిగా మళ్లీ మేకప్ వేసుకోవడంతో ఆయన అభిమానులు ‘మున్నాభాయ్ ఈజ్ బ్యాక్’ అంటూ సంబరపడిపోతున్నారు. -
సినిమా రివ్యూ: బ్యాంగ్ బ్యాంగ్
నటీనటులు: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, డాని డెన్ జోంగ్ పా సినిమాటోగ్రఫి: వికాస్ శివరామన్, సునీల్ పటేల్ సంగీతం: విశాల్-శేఖర్ బ్యాగ్రౌండ్ స్కోర్: సలీం సులేమాన్ దర్శకుడు: సిద్ధార్థ్ ఆనంద్ బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకుందా అని తెలుసుకునే ముందు కథ ఎంటో తెలుసుకుందాం! కథ: లండన్ లోని కోహినూర్ వజ్రాన్నిరాజ్ వీర్ (హృతిక్ రోషన్) దొంగిలిస్తాడు. కోహినూర్ వజ్రాన్ని దక్కించుకునేందుకు రాజ్ వీర్ వెనుక అంతర్జాతీయ మాఫియా డాన్ ఓమర్ జాఫర్ (డాని), హమీద్ గుల్ (జావెద్ జాఫ్రీ) ల గ్యాంగ్ వెంటాడుతుంది. అయితే మాఫియా గ్యాంగ్ కు చిక్కకుండా ఓమర్ జాఫర్ ను ఎలాగైనా కలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఓమర్ జాఫర్ ను ఎందుకు కలుసుకోవాలనుకుంటాడు? మాఫియా ఛేజింగ్ లో రాజ్ వీర్ తో హర్లీన్ (కత్రినా కైఫ్) ఎందుకు కలిసింది? రాజ్ వీర్ కోహినూర్ ఎందుకు దొంగిలించాడు? చివరికి కోహినూర్ వజ్రం కథ ఏంటి అనే ప్రశ్నలకు తెరమీద సిద్ధార్థ్ ఆనంద్ ఆవిష్కరించిన దృశ్య రూపమే 'బ్యాంగ్ బ్యాంగ్'. ప్లస్ పాయింట్స్: హృతిక్, కత్రినాల కెమిస్ట్రీ యాక్షన్ సీన్లు ఫోటోగ్రఫి మ్యూజిక్ కథనం మైనస్ పాయింట్స్: కథ విలనిజం నటీనటుల ఫెర్ఫార్మెన్స్: రాజ్ వీర్ గా హృతిక్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా కనిపించాడు. 'సిక్స్ ప్యాక్' హృతిక్ యాక్షన్ సీన్లలో హాలీవుడ్ స్థాయి ఫెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించాడు. యాక్షన్ సీన్లతోపాటు కత్రినాతో హాట్ హాట్ గా రొమాన్స్ చేశాడు. యాక్షన్ హీరోగా హృతిక్ తన సత్తాను మరోసారి సినీ ప్రేక్షకులకు రుచి చూపించాడు. ధూమ్-3 చిత్రంలో గ్లామర్ తో అదరగట్టేసిన కత్రినా 'బ్యాంగ్ బ్యాంగ్' లో ప్రదర్శించిన అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. హృతిక్ తో లిప్ లాక్, యాక్షన్, రొమాంటిక్ సీన్లలోనూ కత్రినా విజృంభించింది. పెద్గగా యాక్టింగ్ కు స్కోప్ లేకపోవడం, గ్లామర్ తోనే కత్రినా సంతృప్తి పరిచింది. డానీ, జావేద్ జాఫ్రీల విలనిజం గురించి పెద్దగా చెప్పుకునేంతగా ఏమి లేదు. సాంకేతిక విభాగాల పనితీరు: విశాల్-శేఖర్ సంగీతం, సలీం సులేమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకు జీవం పోశాయి. తూ మేరి, మెహర్ బాన్, బ్యాంగ్ బ్యాంగ్, ఉఫ్ పాటలు యువతకు జోష్ తోపాటు కిక్కెంచే విధంగా ఉన్నాయి. విశాల్-శేఖర్ అందించిన బాణీలకు వికాస్ శివరామన్, సునీల్ పటేల్ ల సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సీన్లు, విదేశాల్లో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, ముఖ్యంగా జల విన్యాసాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని గురి చేస్తాయి. దర్శకత్వం: హాలీవుడ్ చిత్రం 'నైట్ అండ్ డే' చిత్ర ఆధారంగా సిద్దార్థ్ ఆనంద్ 'బ్యాంగ్ బ్యాంగ్' ను రూపొందించారు. యాక్షన్, రొమాన్స్ ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రంలోని కథపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రధాన లోపంగా మారింది. కేవలం స్క్రీన్ ప్లే ఆధారంగా ఓ ఛేజింగ్ లా సాగిన ఈ చిత్రం తొలి భాగంలో ట్రెడిషినల్ ఆడియన్స్ రోటిన్ గా అనిపించడమే కాకుండా, ప్రేక్షకులకు కొంత విసుగును తెప్పిస్తుంది. అయితే చిత్ర రెండవ భాగంలో ఓ ట్విస్ట్ తో బ్యాంగ్ బ్యాంగ్ అనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో కొంత సెంటిమెంట్ బ్యాంగ్ బ్యాంగ్ జోడించి ప్రేక్షకులతో ఓకే అనిపించుకోవడంలో సిద్దార్థ్ ఆనంద్ సఫలమయ్యారు. కేవలం యూత్ ను టార్గెట్ గా చేసుకుని నిర్మించిన ఈ చిత్ర విజయం కేవలం యాక్షన్, హృతిక్-కత్రినాల కెమిస్ట్రిపైనే ఆధారపడి ఉంటుంది. వంద కోట్ల క్లబ్ లో బ్యాంగ్ బ్యాంగ్ చేరడమనేది సాధారణ విషయమే.. అయితే యూత్, రెగ్యులర్ ఆడియెన్స్ ఆదరణ లభిస్తే 'బ్యాంగ్ బ్యాంగ్' భారీ కలెక్షన్లు కొల్లగొడుతుందనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు ముగింపు: కథ లేకుండా కేవలం హృతిక్ ఇమేజ్, కత్రినా గ్లామర్, యాక్షన్ సీన్లే ఈ చిత్రంలో కీలక అంశాలు. అంతకంటే అతిగా ఆశపడి థియేటర్ కెళ్లే ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. తెరపై హృతిక్ రోషన్ లో పరకాయ ప్రవేశం చేస్తే.. ప్రేక్షకుడికి బోలెడంత వినోదంతోపాటు ప్రేక్షకుడికి గిలిగింతలు కలగడం ఖాయం. -
హృతిక్, కత్రినాల కెమిస్ట్రీ కేక!
-
అమెరికా ప్రయాణం అందుకేనా?
‘క్రిష్-3’లో హృతిక్ రోషన్ చేసిన సాహసాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. హాలీవుడ్ హీరోలను తలపింపజేశారు హృతిక్. పాత్ర కోసం ఏ సాహసానికైనా వెనుకాడకపోవడం ఆయన ప్రత్యేకత. మెదడులో సమస్య తలెత్తడంతో ఆ మధ్య చిన్న సర్జరీ చేయించుకున్నారు హృతిక్. శస్త్ర చికిత్స తర్వాత కూడా నటుడిగా ఆయనలోని జోష్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనలోని వేగం ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. దానికి ‘క్రిష్-3’ సినిమానే ఓ నిదర్శనం. ఇదిలావుంటే... హృతిక్ గత కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శస్త్ర చికిత్స తర్వాత కూడా ఆయనకు తరచూ తలనొప్పి రావడం అనుమానాలకు దారి తీస్తున్న అంశం. వాటిని నివృత్తి చేసుకోవడానికి హృతిక్ త్వరలో అమెరికా వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘బాంగ్ బాంగ్’ చిత్రంలో నటిస్తున్నారు హృతిక్. కరన్ మల్హోత్ర దర్శకత్వంలో ఆయన నటించనున్న ‘శుద్ధీ’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హృతిక్ యూఎస్ వెళ్లనుండటం పలువురికి ఆందోళన గురి చేస్తున్న అంశం.