
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేసి సుమారు మూడేళ్లు కావొస్తుంది. ఆయన మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ 'పఠాన్' మూవీతో వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Shahrukh Khan Pathan OTT Rights Sold Worth 200 Crores: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేసి సుమారు మూడేళ్లు కావొస్తుంది. ఆయన మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ 'పఠాన్' మూవీతో వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. షారుక్‌తోపాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొణె నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఈ మూవీ భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్ కొనుగోలైంది.
ఈ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నుంచి ఫ్యాన్సీ అమౌంట్ అందుకుందని సమాచారం. 'పఠాన్' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా 'పఠాన్' చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడని టాక్. 'జీరో' సినిమా తర్వాత షారుక్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన 'జీరో' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో 'పఠాన్'పై షారుక్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
చదవండి: ఆఖరికి పోలీసులు కూడా వదల్లేదు: షారుక్ ఖాన్ జిరాక్స్