అమెరికా ప్రయాణం అందుకేనా? | hrithik roshan to go to the US for treatment? | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రయాణం అందుకేనా?

Published Sat, Nov 23 2013 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

అమెరికా ప్రయాణం అందుకేనా?

అమెరికా ప్రయాణం అందుకేనా?

 ‘క్రిష్-3’లో హృతిక్ రోషన్ చేసిన సాహసాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. హాలీవుడ్ హీరోలను తలపింపజేశారు హృతిక్. పాత్ర కోసం ఏ సాహసానికైనా వెనుకాడకపోవడం ఆయన ప్రత్యేకత. మెదడులో సమస్య తలెత్తడంతో ఆ మధ్య చిన్న సర్జరీ చేయించుకున్నారు హృతిక్. శస్త్ర చికిత్స తర్వాత కూడా నటుడిగా ఆయనలోని జోష్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనలోని వేగం ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. దానికి ‘క్రిష్-3’ సినిమానే ఓ నిదర్శనం.
 
 ఇదిలావుంటే... హృతిక్ గత కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శస్త్ర చికిత్స తర్వాత కూడా ఆయనకు తరచూ తలనొప్పి రావడం అనుమానాలకు దారి తీస్తున్న అంశం. వాటిని నివృత్తి చేసుకోవడానికి హృతిక్ త్వరలో అమెరికా వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘బాంగ్ బాంగ్’ చిత్రంలో నటిస్తున్నారు హృతిక్. కరన్ మల్హోత్ర దర్శకత్వంలో ఆయన నటించనున్న ‘శుద్ధీ’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హృతిక్ యూఎస్ వెళ్లనుండటం పలువురికి ఆందోళన గురి చేస్తున్న అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement