
‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్ జోరు పెంచారు.. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలను అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమా దాదాపు పూర్తి కాగా ‘ఆదిపురుష్, సలార్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. ఇవి కాకుండా హిందీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారన్నది తాజా టాక్. ఈ క్యారెక్టర్ హాలీవుడ్ స్టయిల్‌లో ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment