
‘బ్యాంగ్ బ్యాంగ్, వార్’ చిత్రాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, హీరో హృతిక్ రోషన్ మూడో సినిమా కోసం కలిశారు. ఆదివారం హృతిక్ రోషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజా చిత్రాన్ని ప్రకటించారు. ‘ఫైటర్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తారు. ఇందులో పైలట్‌గా కనిపించనున్నారు హృతిక్. ‘సిడ్’ (సిద్ధార్థ్)తో మూడోసారి, దీపికతో తొలిసారి కలసి పని చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మీ అందరికీ ఓ సూపర్ రైడ్‌ను అందిస్తాం’’ అన్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాది చివర్లో ‘ఫైటర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. 2022 సెప్టెంబర్ 30న సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment