సంగీతా బిజ్లానీ పనిమనిషిని రేప్ చేసిన షారుఖ్ డ్రైవర్ | Shahrukh's driver rapes Bijlani's maid | Sakshi
Sakshi News home page

సంగీతా బిజ్లానీ పనిమనిషిని రేప్ చేసిన షారుఖ్ డ్రైవర్

Published Thu, Jun 26 2014 11:02 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

సంగీతా బిజ్లానీ పనిమనిషిని రేప్ చేసిన షారుఖ్ డ్రైవర్ - Sakshi

సంగీతా బిజ్లానీ పనిమనిషిని రేప్ చేసిన షారుఖ్ డ్రైవర్

అతను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డ్రైవరు. ఆ మైనర్ బాలిక అలనాటి అందాల నటి సంగీతా బిజ్లానీ ఇంట్లో పని మనిషి. డ్రైవర్ ఆ పిల్లపై కన్నేశాడు. షారుఖ్ ఇంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించాడు. బాంద్రాలోని ఒక హోటల్ కు రమ్మన్నాడు.

ఆ తరువాత ఆమెను రేప్ చేశాడు. అంతటితో ఆగకుండా బాజీగర్ లో షారుఖ్ ఖాన్ లా బెదిరించాడు. 'బయటకు చెబితే అంతే' అన్నాడు. అయితే ఆ బాలిక ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు రాజేంద్ర కుమార్ గౌతమ్ అలియాస్ పింటూ మిశ్ర అనే 34 ఏళ్ల డ్రైవర్ కటకటాలు లెక్కిస్తున్నారు.

ఆ బాలిక అయిదు నెలల క్రితమే తన సొంతూరు అయిన లాతూరు నుంచి ముంబాయికి వచ్చింది. ఆమె కుంటుంబానికి ఆమె ఆదాయమే ఆధారం. రాగానే పింటూ మిశ్ర ఆమెపై కన్నేశాడు.

అయితే తనకున్న అనేక కార్లలో ఒక కారుని పింటూ మిశ్ర నడుపుతాడు తప్ప అతనికీ తనకీ ఏ సంబంధమూ లేదని షారుఖ్ ఒక ప్రకటనలో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement