కేన్సర్ బాధితురాలికి కేబీసీలో 7 కోట్ల ప్రైజ్మనీ | cancer patient woman wins 7 crores in kbc 8 series | Sakshi
Sakshi News home page

కేన్సర్ బాధితురాలికి కేబీసీలో 7 కోట్ల ప్రైజ్మనీ

Published Wed, Oct 15 2014 2:32 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

కేన్సర్ బాధితురాలికి కేబీసీలో 7 కోట్ల ప్రైజ్మనీ

కేన్సర్ బాధితురాలికి కేబీసీలో 7 కోట్ల ప్రైజ్మనీ

బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా మహా కరోడ్పతి గేమ్ షో టీవీ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతోంది. ఈ సీజన్లో ఇప్పటికే ఇద్దరు సోదరులు కలిసి 7 కోట్ల రూపాయలు గెలుచుకోగా, తొలిసారి ఓ మహిళ.. ఈ అత్యంత భారీ ప్రైజ్మనీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కేబీసీలో మహిళలు ఇంత పెద్ద మొత్తాలు గెలుచుకోవడం ఎప్పుడూ లేదు.

వాసాయ్ ప్రాంతానికి చెందిన మేఘా పాటిల్ ఓ సాధారణ గృహిణి. ఆమె ఇంట్లోనే ట్యూషన్లు చెప్పుకొంటూ ఉంటారు. ఆమె ఈ సీజన్లో 7 కోట్ల రూపాయల బహుమతి సొంతం చేసుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె కేన్సర్తో బాధపడుతున్నారు. కేవలం మరికొన్ని నెలలు మాత్రమే బతుకుతారు. అయినా పట్టుదలతో కేబీసీకి వచ్చి, ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ కూడా దాటి హాట్ సీటు వరకు వచ్చి, అక్కడ కూడా మొత్తం 14 ప్రశ్నలకూ సరైన సమాధానాలు ఇచ్చి ఏడు కోట్ల రూపాయలను తన సొంతం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఇది చాలా గర్వకారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement