ఆ స్పెషల్‌ వీడియో చూసి అమితాబ్‌ ఎమోషనల్‌! | Amitabh Bachchan Gets Emotional As Fans Celebrate His 81st Birthday - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: ఆ స్పెషల్‌ వీడియో చూసి భావోద్వేగంతో అమితాబ్‌ కంటతడి!

Published Tue, Oct 10 2023 5:15 PM | Last Updated on Tue, Oct 10 2023 6:15 PM

Amitabh Bachchan Gets Emotional As Fans Celebrate His 81st Birthday - Sakshi

ఎనిమిది పదుల వయసులోనూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న దిగ్గజ నటుడు ఆమితాబ్‌ బచ్చన్‌ . ఈ వయసులో కూడా దూకుడుగా సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు సవాల్‌ విసురుతున్నాడు. వెండితెరపై మాత్రామే కాకుండా బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్‌లో అమితాబ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. షో నిర్వాహకులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి భావోద్వేగంతో కంటతడి పెట్టాడు. 

అక్టోబర్‌ 11న అమితాబ్‌ బర్త్‌డే. ఈ నేపథ్యంలో ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షో నిర్వాహకులు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. భారతీయ చలన చిత్రపరిశ్రమలోని ప్రముఖ నటీనటులతో ఆయనకు శుభాకాంక్షలు  చెప్పించారు. చిరంజీవి, విద్యాబాలన్‌ తదితరులు బిగ్‌బీకి బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ఈ వీడియో చూసిన అబితాబ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ‘ఇంకా ఎంత ఏడిపిస్తారు. ఈ సెట్‌లో నా పుట్టినరోజు వేడుక నిర్వహించడం ఎంతో స్పెషల్‌’ అంటూ ఆనందంతో కంటతడి పెట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement