
ఇటీవల కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించిన బిగ్‌బీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ -16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అక్షయ్ నారంగ్ అనే యువకుడికి రూ.25 లక్షల ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ ఊహించని విధంగా షో నుంచి తప్పుకున్నాడు. దీంతో కేవలం రూ.12.5 లక్షలు మాత్రమే సొంతం చేసుకున్నాడు. అతను అనుకున్న ఆన్సర్‌పై కాన్ఫిడెన్స్ లేకపోవడంతో షో నుంచి నిష్క్రమించాడు. అయితే ఢిల్లీకి చెందిన యువకుడు తన నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
(ఇది చదవండి: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య)
అయితే అక్షయ్ నారంగ్ గతంలో క్యాన్సర్‌తో పోరాడినట్లు ఈ షోలో పంచుకున్నారు. 2018లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించాడు. ఆ తర్వాత ఓ కణితిని వైద్యులు తొలగించారని తెలిపాడు. దాదాపు రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాలేజీలో తన స్నేహితులు సరదాగా గడుపుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని అక్షయ్ తన బాధను అమితాబ్‌తో పంచుకున్నారు. నేను ఆరోగ్యంగా బయటకు వచ్చి కౌన్ బనేగా కరోడ్‌పతి షో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అమితాబ్‌తో అన్నారు. దీంతో అమితాబ్ అతనికి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment