బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య | Malaika Arora Father Anil Arora Passed Away | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య

Sep 11 2024 12:44 PM | Updated on Sep 11 2024 1:43 PM

Malaika Arora Father Anil Arora Passed Away

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. కొంత సమయం క్రితం ఆమె తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఆరో అంతస్తు నుంచి దూకారు. అయితే, ఆయన ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియలేదు.  సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలుపుతున్నారు. కానీ, మలైకా తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

 ఇదీ చదవండి: ఉచితంగానే త్రిప్తి డిమ్రీ 'బ్యాడ్ న్యూజ్' చూసేయండి

గత కొంతకాలంగా మలైకా తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోనే ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బిల్డింగ్‌ మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మలైకాకు ఒక సోదరి కూడా ఉంది. అయితే, విడాకుల అనంతరం వారిద్దరూ తన తల్లి సోదరి అమృత వద్దే పెరిగారు.  కానీ, ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత తండ్రితో కూడా కనిపించేది. తండ్రి అనిల్ అరోరా మర్చంట్ నావీలో పనిచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement