kaun banega crorepathi
-
పెళ్లి గురించి అడిగిన అమితాబ్.. స్టార్ హీరో కుమారుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో సినీ ప్రియులను అలరించాడు. ఈ చిత్రం అశ్వత్థామగా అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను మరింత ఇంట్రెస్టింగ్ మార్చేందుకు అప్పుడప్పుడు మధ్యలో సెలబ్రిటీలు కూడా దర్శనమిస్తుంటారు. తాజా ఎపిసోడ్లో అమిర్ ఖాన్‌తో పాటు ఆయన తనయుడు జునైద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు, తండ్రి, తనయుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పెళ్లి రోజున నర్వస్‌గా ఉన్నారా?..లేదా ఉత్సాహంగా ఉన్నారా? అంటూ అమితాబ్‌ను ప్రశ్నించాడు జునైద్ ఖాన్. ఈ ప్రశ్నకు అమితాబ్ నవ్వేశాడు. దీంతో వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అనంతరం జునైద్‌ను పెళ్లి గురించి ఆరా తీశారు అమితాబ్. మీరు లైఫ్‌లో త్వరలోనే ఎవరైనా వస్తున్నారా? అంటూ జునైద్‌ను అడిగాడు అమితాబ్. దీంతో అతను వెంటనే దీని గురించి మళ్లీ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు. ఈ విషయం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నాడు.. అమితాబ్ నవ్వుతూ. దీంతో పక్కనే ఉన్న తండ్రి అమిర్ ఖాన్.. అతని సమాధానంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. జునైద్ ఖాన్.. అమిర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు. అతని ఐరా ఖాన్ అనే సోదరి కూడా ఉంది. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ జన్మించారు. ఆ వీరు కూడా 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న
ప్రముఖ టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్మెన్ గేమ్‌కు సంబంధించింది ఎదురైంది. ఇంతకి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్ గవాస్కర్ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో 700కు పైగా పరుగులు స్కోర్ చేసింది ఎవరు..? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్‌లో మొదటిది విరాట్ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్, మూడోది శుభ్‌మన్ గిల్, నాలుగోది రోహిత్ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్‌కు వెళ్లాడు. ఆడియన్స్ పోల్‌లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్‌కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్‌లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.కాగా, 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కరే. ఈ సిరీస్‌లో గవాస్కర్ రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో గవాస్కర్ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 50 లక్షల ప్రశ్న
కౌన్ బనేగా కరోడ్‌పతి తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 26) క్రికెట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 50 లక్షల రూపాయల విలువైన ఈ ప్రశ్నను అభిషేక్ సంధు అనే కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. క్లిష్టమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సంధు గేమ్‌ను మధ్యలోనే వదిలేశాడు.ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ ఎవరు..? ఈ ప్రశ్నకు కంప్యూటర్ మహాశయ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. అవేంటంటే.. ఏ- ఆర్థర్ ష్రూస్‌బరీ, బి- డబ్ల్యూజీ గ్రేస్, సి- డౌగ్ ఇన్సోల్, డి- టామ్ మార్స్డెన్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.A cricket question in KBC for 50 Lakhs. pic.twitter.com/7bs0VkWsnK— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2024కాగా, ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు తరుచూ ఎదురవుతున్నాయి. కంటెస్టెంట్లు క్రికెట్ పరిజ్ఞానం కలిగిన వారైతే ఆ ప్రశ్నలకు ఈజీగా సమాధానాలు చెప్పగలుగుతున్నారు. తాజాగా ఎదురైన క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైతే ఎంతటి లోతైన క్రికెట్ పరిజ్ఞానమున్నా జవాబుల చెప్పడం కష్టం. ఇంతకీ పైన అడిన ప్రశ్నకు సమాధానం ఏంటని అనుకుంటున్నారా..? ఆప్షన్-డి. టామ్ మార్స్డెన్టామ్ మార్స్డెన్ 1826లో తన డెబ్యూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఆ ఏడాది జులై 26న మార్స్డెన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో షెఫీల్డ్ అండ్ లీసెస్టర్‌కు ప్రాతినిథ్యం వహించిన మార్స్డెన్.. నాటింగ్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగులు చేశాడు. చదవండి: బ్రాడ్‌మన్ రికార్డు సమం చేసిన కమిందు మెండిస్ -
క్యాన్సర్‌తో పోరాటం.. రూ.25 లక్షలు మిస్ చేసుకున్నాడు!
ఇటీవల కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించిన బిగ్‌బీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ -16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అక్షయ్ నారంగ్ అనే యువకుడికి రూ.25 లక్షల ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ ఊహించని విధంగా షో నుంచి తప్పుకున్నాడు. దీంతో కేవలం రూ.12.5 లక్షలు మాత్రమే సొంతం చేసుకున్నాడు. అతను అనుకున్న ఆన్సర్పై కాన్ఫిడెన్స్ లేకపోవడంతో షో నుంచి నిష్క్రమించాడు. అయితే ఢిల్లీకి చెందిన యువకుడు తన నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.(ఇది చదవండి: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య)అయితే అక్షయ్ నారంగ్ గతంలో క్యాన్సర్‌తో పోరాడినట్లు ఈ షోలో పంచుకున్నారు. 2018లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించాడు. ఆ తర్వాత ఓ కణితిని వైద్యులు తొలగించారని తెలిపాడు. దాదాపు రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాలేజీలో తన స్నేహితులు సరదాగా గడుపుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని అక్షయ్ తన బాధను అమితాబ్‌తో పంచుకున్నారు. నేను ఆరోగ్యంగా బయటకు వచ్చి కౌన్ బనేగా కరోడ్‌పతి షో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అమితాబ్‌తో అన్నారు. దీంతో అమితాబ్ అతనికి ధైర్యం చెప్పారు. -
'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో క్రికెటర్‌కు సంబంధించిన ప్రశ్న
ప్రముఖ బాలీవడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో టీమిండియా క్రికెటర్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. తాజాగా జరిగిన ఎడిసోడ్‌లో బెంగళూరుకు చెందిన ప్రియాంక పోర్వాల్ అనే కంటెస్టెంట్ 80,000 రూపాయలకు ఈ ప్రశ్నను ఎదుర్కొంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. చెన్నైలో పుట్టిన ఏ టీమిండియా క్రికెటర్ 'కుట్టి స్టోరీస్' అనే టాక్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తాడు..?A cricket question in KBC. pic.twitter.com/X7hwjhNBVC— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2024ఈ ప్రశ్నకు అమితాబ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మొదటిది దినేశ్ కార్తీక్ కాగా.. రెండోది రవిచంద్రన్ అశ్విన్.. మూడవది వాషింగ్టన్ సుందర్, నాలుగవది సంజూ శాంసన్. పై నాలుగింటిలో కంటెస్టెంట్ ప్రియాంక ఓ సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉండింది. అయితే సమాధానంపై సరైన అవగాహణ లేని ప్రియాంక ఆడియన్స్ పోల్‌కు వెళ్లి, ఆప్షన్-బి రవిచంద్రన్ అశ్విన్ అని చూస్ చేసుకుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కావడంతో ఆమె తదుపరి ప్రశ్నకు అర్హత సాధించింది. అయితే 1,60,000 ప్రశ్నకు ఆమె ఆన్సర్ చెప్పలేకపోవడంతో ఆమె 80,000తోనే గేమ్‌ను వదిలేసింది.కాగా, కేబీసీలో ఇలా క్రికెట్‌కు, క్రికెటర్లకు సంబంధించిన ప్రశ్నలు రావడం ఇటీవలికాలంలో తరుచూ జరుగుతుంది. కంటెస్టెంట్లకు అన్ని అంశాల్లో అవగాహణ ఉందో లేదో తెలుసుకునేందుకు నిర్వహకులు ఇలాంటి ప్రశ్నలను సంధిస్తుంటారు.ఇదిలా ఉంటే, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో లోకల్ క్రికెట్లో పాల్గొంటున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో అశ్విన్ టెస్ట్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అశ్విన్ 100 టెస్ట్‌లు ఆడి 516 వికెట్లు పడగొట్టాడు. -
ఆ స్పెషల్ వీడియో చూసి అమితాబ్ ఎమోషనల్!
ఎనిమిది పదుల వయసులోనూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న దిగ్గజ నటుడు ఆమితాబ్ బచ్చన్ . ఈ వయసులో కూడా దూకుడుగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. వెండితెరపై మాత్రామే కాకుండా బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్‌లో అమితాబ్ ఎమోషనల్ అయ్యాడు. షో నిర్వాహకులు ఇచ్చిన సర్ప్రైజ్ చూసి భావోద్వేగంతో కంటతడి పెట్టాడు. అక్టోబర్ 11న అమితాబ్ బర్త్‌డే. ఈ నేపథ్యంలో ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో నిర్వాహకులు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. భారతీయ చలన చిత్రపరిశ్రమలోని ప్రముఖ నటీనటులతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పించారు. చిరంజీవి, విద్యాబాలన్ తదితరులు బిగ్‌బీకి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఈ వీడియో చూసిన అబితాబ్ ఎమోషనల్ అయ్యాడు. ‘ఇంకా ఎంత ఏడిపిస్తారు. ఈ సెట్లో నా పుట్టినరోజు వేడుక నిర్వహించడం ఎంతో స్పెషల్’ అంటూ ఆనందంతో కంటతడి పెట్టాడు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
KBC 13: చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అమితాబ్ సాయం
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబచ్చన్‌కి ఉన్న గొప్ప మనసు గురించి తెలిసిందే. ఆయన ఎంతోమందికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఓ చిన్నారికి సైతం ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. వివరాలు ఇలా.. కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి బిగ్ బీ హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి అతిథులుగా సెలబ్రీటీలను పిలవడం పరిపాటి. ఎవరు వచ్చినా గెలుచుకున్న ప్రైజ్‌మనీని ఏదో ఒక మంచి పనికి ఉపయోగిస్తుంటారు. తాజాగా ఈ షోకి కొరియోగ్రాఫర్, దర్మకురాలు ఫరాఖాన్, హీరోయిన్ దిపికా పదుకొనే అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌కి చెందిన కొత్త ప్రోమోని సోనీటీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరిలాగే తాము గెలుచుకున్న మొత్తాన్ని స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న 17 నెలల చిన్నారి అయాన్ష్ సహాయార్థం ఇస్తామని ఫరాఖాన్ తెలిపింది. ఆ బాలుడికి రెండో ఏటా వేయాల్సిన ఒక ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లని, అందుకే చికిత్స కోసం సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపి ఎమోషనల్ అయింది. అమితాబ్ మాట్లాడుతూ.. ‘విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అయాన్ష్ కోసం ఫరా ఈ షోలో పాల్గొంటోంది. నాకు ఇక్కడ చెప్పాలో లేదో తెలియట్లేదు కానీ ఆ చిన్నారికి నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను’అని తెలిపాడు. కానీ ఎంత మొత్తం చేసేది మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా దీపికా తన ఫౌండేషన్ ‘లివ్ లవ్ లాఫ్’ గురించి షోలో మాట్లాడింది. 2014లో చాలా డిప్రెషన్లోకి వెళ్లానని, ఆ సమయంలో చనిపోవాలని కూడా అనుకున్నానని భావోద్వేగానికి లోనైంది. అందుకే మానసికంగా బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు ఫౌండేషన్ నెలకొల్పినట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
రూ. కోటి గెలిచిన మిడ్ డే మీల్ వర్కర్
టీవీల్లో వచ్చే కార్యక్రమాల్లో కొన్ని నిజంగానే సామాన్యులకు మేలు చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ). సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుస్తోన్న ఈ కార్యక్రమానికి జనాల్లో భారీ క్రేజ్ ఉంది. హిందీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికే 10 సీజన్లు విజయవతంగా పూర్తి చేసుకుని 11వ సీజన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించడం షో విజయవంతం కావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రస్తుతం ప్రసారమవుతోన్న 11వ సీజన్లో బిహార్‌కు చెందిన సనోజ్ రాజ్ తొలి కోటీశ్వరుడిగా గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా ఓ మహిళ రూ. కోటి గెలుచుకుని రికార్డు సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండే బబితా టేడ్ అనే మహిళ కేబీసీలో ఇప్పటికే రూ.కోటి గెల్చుకుని.. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నను ఎదుర్కొబోతున్నారు. ఈ క్రమంలో బబితా మాట్లాడుతూ.. ‘పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటం ద్వారా నేను నెలకు రూ.1500 మాత్రమే సంపాదించేదాన్ని. పాఠశాలలో పిల్లల కోసం కిచిడి వండేదాన్ని. ఇంత భారీ మొత్తాన్ని సంపాదిస్తానని కలలో కూడా ఊహించలేదు’ అని తెలిపారు. బిగ్ బీ మీరు ఇక్కడ గెలిచిన డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు అని బబితను ప్రశ్నించగా.. ‘ఓ ఫోన్ కొనుక్కుంటాను. ప్రస్తుతం మా ఇంట్లో అందరికి కలిపి ఒక్కటే ఫోన్ ఉంది’ అని తెలిపారు. దాంతో ఆశ్చర్యపోవడం బిగ్ బీ వంతయ్యింది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చే వారంతా షోలో ఎక్కువ మొత్తం గెలిచి.. ఇంటిని కొనుగోలు చేస్తామని.. అప్పులు తీరుస్తామని చెప్పేవారు. కానీ బబిత మాత్రం ఇందుకు విరుద్ధంగా ఫోన్ కొంటాననడంతో బిగ్ బీ షాక్‌కు గురయ్యారు. -
కాశ్మీరంలో కౌన్ బనేగా కరోడ్‌పతి!
కల్లోల కాశ్మీరంలో శాంతి పునరుద్ధరణకు కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకవైపు సీమాంతర ఉగ్రవాదంతో పాటు పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అణచేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే కశ్మీర్ ప్రజలు ముఖ్యంగా యువతను వినోద ప్రధాన కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా ప్రధాన జనజీవన స్రవంతిలోకి చేరేలా చేయాలని కేంద్ర సర్కార్‌కు ఆలోచన వచ్చింది. దీనిలో భాగంగా కశ్మీరీ భాషలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. దూరదర్శన్ సహకారంతో కశ్మీర్ ప్రజలకు చేరువయ్యేలా ‘కేబీసీ’ మొదలుపెట్టాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమంతో పాటు స్థానికుల్లోని ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు నృత్య,సంగీత, తదితర రంగాల్లో ‘ట్యాలెంట్ షో’లు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ‘దూరదర్శన్ కశ్మీర్’ ద్వారా ఈ కొత్త టీవీ షోల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం చురుకుగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. గేమ్, ట్యాలెంట్ షోలతో వినోదం... గేమ్,ట్యాలెంట్ షోల ద్వారా వినోదం పంచడంతో పాటు భారత్‌లోని విభిన్న సంస్కృతులను కశ్మీర్ వీక్షకులకు పరిచయం చేస్తారు. ఈ షోలలో భాగంగా దేశంలోని ›ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే, జాతీయ సమైక్యత, మత సామరస్యం, సెక్యులరిజం వల్ల ఒనగూడే ప్రయోజనాలు, దేశభక్తిని చాటే కార్యక్రమాలుంటాయి. ఇవన్నీ చూడాలంటే ముందు వీక్షకుల సంఖ్య పెంచుకోవాలి. అందుకోసం కొత్త కొత్త బాలీవుడ్ చిత్రాల ప్రసారాన్ని కశ్మీర్ డీడీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ సినిమాలకు ప్రజల్లో స్పందనతో పాటు డీడీ వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఈనేపథ్యంలో ప్రతిపాదిత టీవీ షోలను బుల్లితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు దూరదర్శన్ మొదలుపెట్టింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేన్సర్ బాధితురాలికి కేబీసీలో 7 కోట్ల ప్రైజ్‌మనీ
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా మహా కరోడ్‌పతి గేమ్ షో టీవీ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతోంది. ఈ సీజన్లో ఇప్పటికే ఇద్దరు సోదరులు కలిసి 7 కోట్ల రూపాయలు గెలుచుకోగా, తొలిసారి ఓ మహిళ.. ఈ అత్యంత భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కేబీసీలో మహిళలు ఇంత పెద్ద మొత్తాలు గెలుచుకోవడం ఎప్పుడూ లేదు. వాసాయ్ ప్రాంతానికి చెందిన మేఘా పాటిల్ ఓ సాధారణ గృహిణి. ఆమె ఇంట్లోనే ట్యూషన్లు చెప్పుకొంటూ ఉంటారు. ఆమె ఈ సీజన్లో 7 కోట్ల రూపాయల బహుమతి సొంతం చేసుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె కేన్సర్‌తో బాధపడుతున్నారు. కేవలం మరికొన్ని నెలలు మాత్రమే బతుకుతారు. అయినా పట్టుదలతో కేబీసీకి వచ్చి, ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ కూడా దాటి హాట్ సీటు వరకు వచ్చి, అక్కడ కూడా మొత్తం 14 ప్రశ్నలకూ సరైన సమాధానాలు ఇచ్చి ఏడు కోట్ల రూపాయలను తన సొంతం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఇది చాలా గర్వకారణం.