కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 50 లక్షల ప్రశ్న | Cricket Question In KBC For 50 Lakhs | Sakshi
Sakshi News home page

కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 50 లక్షల ప్రశ్న

Published Fri, Sep 27 2024 7:16 PM | Last Updated on Fri, Sep 27 2024 7:44 PM

Cricket Question In KBC For 50 Lakhs

కౌన్‌ బనేగా కరోడ్‌పతి తాజా ఎపిసోడ్‌లో (సెప్టెంబర్‌ 26) క్రికెట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 50 లక్షల రూపాయల విలువైన ఈ ప్రశ్నను అభిషేక్‌ సంధు అనే కంటెస్టెంట్‌ ఎదుర్కొన్నాడు. క్లిష్టమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సంధు గేమ్‌ను మధ్యలోనే వదిలేశాడు.

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌ ఎవరు..? ఈ ప్రశ్నకు కంప్యూటర్‌ మహాశయ్‌ నాలుగు ఆప్షన్స్‌ ఇచ్చాడు. అవేంటంటే.. ఏ- ఆర్థర్‌ ష్రూస్‌బరీ, బి- డబ్ల్యూజీ గ్రేస్‌,  సి- డౌగ్‌ ఇన్సోల్‌, డి- టామ్‌ మార్స్‌డెన్‌. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లైతే కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

కాగా, ఇటీవలికాలంలో కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు తరుచూ ఎదురవుతున్నాయి. కంటెస్టెంట్లు క్రికెట్‌ పరిజ్ఞానం కలిగిన వారైతే ఆ ప్రశ్నలకు ఈజీగా సమాధానాలు చెప్పగలుగుతున్నారు. తాజాగా ఎదురైన క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైతే ఎంతటి లోతైన క్రికెట్‌ పరిజ్ఞానమున్నా జవాబుల చెప్పడం​ కష్టం. ఇంతకీ పైన అడిన ప్రశ్నకు సమాధానం ఏంటని అనుకుంటున్నారా..? ఆప్షన్‌-డి. టామ్‌ మార్స్‌డెన్‌

టామ్‌ మార్స్‌డెన్‌ 1826లో తన డెబ్యూ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు. ఆ ఏడాది జులై 26న మార్స్‌డెన్‌ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో షెఫీల్డ్‌ అండ్‌ లీసెస్టర్‌కు ప్రాతినిథ్యం వహించిన మార్స్‌డెన్‌.. నాటింగ్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగులు చేశాడు. 

చదవండి: బ్రాడ్‌మన్‌ రికార్డు సమం చేసిన కమిందు మెండిస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement