KBC 13: చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌.. అమితాబ్‌ సాయం | Amitabh Bachchan Decides to Donate Money to Procure Injection for Ailing Child Ayaansh | Sakshi
Sakshi News home page

చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్‌.. సాయానికి ముందుకొచ్చిన బిగ్‌ బీ అమితాబ్‌

Published Sun, Sep 12 2021 12:40 PM | Last Updated on Sun, Sep 12 2021 3:53 PM

Amitabh Bachchan Decides to Donate Money to Procure Injection for Ailing Child Ayaansh - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌, బిగ్‌ బీ అమితాబచ్చన్‌కి ఉన్న గొప్ప మనసు గురించి తెలిసిందే. ఆయన ఎంతోమందికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఓ చిన్నారికి సైతం ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. వివరాలు ఇలా.. కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోకి బిగ్‌ బీ హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్‌ నడుస్తోంది. ఈ షోకి అతిథులుగా సెలబ్రీటీలను పిలవడం పరిపాటి.

ఎవరు వచ్చినా గెలుచుకున్న ప్రైజ్‌మనీని ఏదో ఒక మంచి పనికి ఉపయోగిస్తుంటారు. తాజాగా ఈ షోకి కొరియోగ్రాఫర్‌, దర్మకురాలు ఫరాఖాన్‌, హీరోయిన్‌ దిపికా పదుకొనే అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌కి చెందిన కొత్త ప్రోమోని సోనీటీవీ సోషల్‌ మీడియాలో పో​స్ట్‌ చేసింది. అందరిలాగే తాము గెలుచుకున్న మొత్తాన్ని స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న 17 నెలల చిన్నారి అయాన్ష్‌ సహాయార్థం ఇస్తామని ఫరాఖాన్‌ తెలిపింది. ఆ బాలుడికి రెండో ఏటా వేయాల్సిన ఒక ఇంజక్షన్‌ ఖరీదు 16 కోట్లని, అందుకే చికిత్స కోసం సాయం చేయాలనుకుంటున్నట్లు  తెలిపి ఎమోషనల్‌ అయింది.

అమితాబ్‌ మాట్లాడుతూ.. ‘విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అయాన్ష్‌ కోసం ఫరా ఈ షోలో పాల్గొంటోంది. నాకు ఇక్కడ చెప్పాలో లేదో తెలియట్లేదు కానీ ఆ చిన్నారికి నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను’అని తెలిపాడు. కానీ ఎంత మొత్తం చేసేది మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా దీపికా తన ఫౌండేషన్‌ ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ గురించి షోలో మాట్లాడింది. 2014లో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఆ సమయంలో చనిపోవాలని కూడా అనుకున్నానని భావోద్వేగానికి లోనైంది. అందుకే మానసికంగా బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు ఫౌండేషన్‌ నెలకొల్పినట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement