కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న | A Cricket Question For 6.4 Lakhs In KBC | Sakshi
Sakshi News home page

కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న

Published Thu, Oct 3 2024 6:12 PM | Last Updated on Thu, Oct 3 2024 6:28 PM

A Cricket Question For 6.4 Lakhs In KBC

ప్రముఖ టీవీ గేమ్‌ షో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్‌లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్‌మెన్‌ గేమ్‌కు సంబంధించింది ఎదురైంది. ఇంత​​కి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్‌ గవాస్కర్‌ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌లో 700కు పైగా పరుగులు స్కోర్‌ చేసింది ఎవరు..?  

ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్‌లో మొదటిది విరాట్‌ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్‌, మూడోది శుభ్‌మన్‌ గిల్‌, నాలుగోది రోహిత్‌ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్‌ ఆడియన్స్‌ పోల్‌ లైఫ్‌ లైన్‌కు వెళ్లాడు. ఆడియన్స్‌ పోల్‌లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్‌కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్‌లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

కాగా, 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌ సునీల్‌ గవాస్కరే. ఈ సిరీస్‌లో గవాస్కర్‌ రెండు డబుల్‌ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.

ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో గవాస్కర్‌ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్‌ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌ను భారత్‌ 4-1 తేడాతో గెలుచుకుంది.

చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్‌ శర్మను కొని.. కెప్టెన్‌ చేయాలి’

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement