ప్రముఖ బాలీవడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో టీమిండియా క్రికెటర్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. తాజాగా జరిగిన ఎడిసోడ్‌లో బెంగళూరుకు చెందిన ప్రియాంక పోర్వాల్ అనే కంటెస్టెంట్ 80,000 రూపాయలకు ఈ ప్రశ్నను ఎదుర్కొంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. చెన్నైలో పుట్టిన ఏ టీమిండియా క్రికెటర్ 'కుట్టి స్టోరీస్' అనే టాక్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తాడు..?
A cricket question in KBC. pic.twitter.com/X7hwjhNBVC
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2024
ఈ ప్రశ్నకు అమితాబ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మొదటిది దినేశ్ కార్తీక్ కాగా.. రెండోది రవిచంద్రన్ అశ్విన్.. మూడవది వాషింగ్టన్ సుందర్, నాలుగవది సంజూ శాంసన్. పై నాలుగింటిలో కంటెస్టెంట్ ప్రియాంక ఓ సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉండింది. అయితే సమాధానంపై సరైన అవగాహణ లేని ప్రియాంక ఆడియన్స్ పోల్‌కు వెళ్లి, ఆప్షన్-బి రవిచంద్రన్ అశ్విన్ అని చూస్ చేసుకుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కావడంతో ఆమె తదుపరి ప్రశ్నకు అర్హత సాధించింది. అయితే 1,60,000 ప్రశ్నకు ఆమె ఆన్సర్ చెప్పలేకపోవడంతో ఆమె 80,000తోనే గేమ్‌ను వదిలేసింది.
కాగా, కేబీసీలో ఇలా క్రికెట్‌కు, క్రికెటర్లకు సంబంధించిన ప్రశ్నలు రావడం ఇటీవలికాలంలో తరుచూ జరుగుతుంది. కంటెస్టెంట్లకు అన్ని అంశాల్లో అవగాహణ ఉందో లేదో తెలుసుకునేందుకు నిర్వహకులు ఇలాంటి ప్రశ్నలను సంధిస్తుంటారు.
ఇదిలా ఉంటే, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో లోకల్ క్రికెట్‌లో పాల్గొంటున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో అశ్విన్ టెస్ట్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అశ్విన్ 100 టెస్ట్‌లు ఆడి 516 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment