![Amitabh Bachchan asks Junaid khan about His Marriage Goes Viral](/styles/webp/s3/article_images/2024/10/9/amir.jpg.webp?itok=KXIErzen)
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో సినీ ప్రియులను అలరించాడు. ఈ చిత్రం అశ్వత్థామగా అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను మరింత ఇంట్రెస్టింగ్ మార్చేందుకు అప్పుడప్పుడు మధ్యలో సెలబ్రిటీలు కూడా దర్శనమిస్తుంటారు. తాజా ఎపిసోడ్‌లో అమిర్ ఖాన్‌తో పాటు ఆయన తనయుడు జునైద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు, తండ్రి, తనయుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పెళ్లి రోజున నర్వస్‌గా ఉన్నారా?..లేదా ఉత్సాహంగా ఉన్నారా? అంటూ అమితాబ్‌ను ప్రశ్నించాడు జునైద్ ఖాన్. ఈ ప్రశ్నకు అమితాబ్ నవ్వేశాడు. దీంతో వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అనంతరం జునైద్‌ను పెళ్లి గురించి ఆరా తీశారు అమితాబ్. మీరు లైఫ్‌లో త్వరలోనే ఎవరైనా వస్తున్నారా? అంటూ జునైద్‌ను అడిగాడు అమితాబ్. దీంతో అతను వెంటనే దీని గురించి మళ్లీ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు. ఈ విషయం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నాడు.. అమితాబ్ నవ్వుతూ. దీంతో పక్కనే ఉన్న తండ్రి అమిర్ ఖాన్.. అతని సమాధానంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. జునైద్ ఖాన్.. అమిర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు. అతని ఐరా ఖాన్ అనే సోదరి కూడా ఉంది. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ జన్మించారు. ఆ వీరు కూడా 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment