Junaid khan
-
ఈ హీరోయిన్ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్
ఆరంభం అదిరిపోతే ఆ కిక్కే వేరుంటుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) మహారాజ్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది విడుదలై ట్రెండింగ్‌లో నిలిచింది. తొలి సినిమానే సక్సెస్ సాధించాడని ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం జునైద్.. లవ్యాపా మూవీ (Loveyapa Movie) చేస్తున్నాడు. ఇందులో దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరూ వెండితెరపై కనిపించబోయే తొలి చిత్రం ఇదే కావడం విశేషం!సాంగ్ రిలీజ్ఖుషి గతంలో ద ఆర్చీస్ అనే సినిమా చేసింది. కానీ ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇకపోతే లవ్యాపా నుంచి ఇటీవలే లవ్యాపా హో గయా అనే పాట రిలీజ్ చేశారు. ఇది చూసిన జనాలు పాట బాగుంది, కానీ ఈ లవ్‌ట్రాక్ మాత్రం కాస్త విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే జునైద్ తండ్రి, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan).. పాట మాత్రమే కాదు సినిమా కూడా అదిరిపోయిందంటున్నాడు.శ్రీదేవిని చూసినట్లే ఉందితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. లవ్పాయా సినిమా రఫ్ కట్ చూశాను. మూవీ చాలా బాగుంది. వినోదాత్మకంగా ఉంది. నాకు నచ్చింది. సెల్ఫోన్ల వల్ల మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనేది చక్కగా చూపించారు. అందరూ బాగా నటించారు. సినిమాలో ఖుషిని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) ని చూసినట్లే ఉంది. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆవిడ ఎనర్జీ నాకు అక్కడ కనిపించింది అని చెప్పుకొచ్చాడు.(చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!)మరీ ఇంత అబద్ధమాడాలా?ఇది చూసిన నెటిజన్లు ఖుషిని గొప్ప నటి శ్రీదేవితో పోల్చవద్దని వేడుకుంటున్నారు. ప్లీజ్ యార్.. మరీ ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు, పిల్లలపై ప్రేమతో ఏదైనా అనేస్తావా?.. అని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లవ్యాపా విషయానికి వస్తే.. తమిళ హిట్ మూవీ లవ్ టుడేకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా ఫాంటమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కొత్త హీరోహీరోయిన్లను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!ఖుషి అక్క ఆల్రెడీ సత్తా చాటుతోంది!ఇప్పటికే ఖుషి అక్క జాన్వీ కపూర్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. సౌత్‌లో దేవర మూవీతో కుర్రాళ్ల మనసులో గిలిగింతలు పెట్టింది. రామ్చరణ్తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మల తల్లి శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.గొప్ప నటి శ్రీదేవితెలుగులో కార్తీకదీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలతో అలరించింది. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ అగ్రకథానాయికగా స్టార్డమ్ సంపాదించుకుంది. 2013లో శ్రీదేవిని భారతీయ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే 2018లో ఆమె ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్ -
ప్రేమికుల దినోత్సవానికి...
ఆమిర్ ఖాన్–రీనా దత్తాల తనయుడు జునైద్ ఖాన్, బోనీ కపూర్–శ్రీదేవిల రెండో కుమార్తె ఖుషీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కోసం ప్రేమలో పడ్డారు. ఈ ఇద్దరూ జంటగా రానున్న రొమాంటిక్ కామెడీ మూవీ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు. ‘లవ్యాపా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాంథమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది.‘లవ్యాపా’ ప్రేమకథా చిత్రం కావడంతో ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) టార్గెట్‌గా ఈ సినిమా విడుదలను ప్లాన్ చేశారు. ఓ వారం రోజుల ముందే... అంటే ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. ప్రేమ... ఇష్టం... ఈ రెండింటి మధ్యలో ఉండే భావోద్వేగాల సమాహారంతో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఇదిలా ఉంటే జునైద్, ఖుషీ... ఈ ఇద్దరికీ ఇది రెండో చిత్రం. ‘మహారాజా’ చిత్రం ద్వారా జునైద్ ఈ ఏడాది పరిచయం కాగా... గత ఏడాది నటించిన ‘ది ఆర్చీస్’ చిత్రంతో ఖుషీ పరిచయం అయ్యారు. అయితే ఈ రెండు చిత్రాలూ ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. -
పెళ్లి గురించి అడిగిన అమితాబ్.. స్టార్ హీరో కుమారుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో సినీ ప్రియులను అలరించాడు. ఈ చిత్రం అశ్వత్థామగా అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను మరింత ఇంట్రెస్టింగ్ మార్చేందుకు అప్పుడప్పుడు మధ్యలో సెలబ్రిటీలు కూడా దర్శనమిస్తుంటారు. తాజా ఎపిసోడ్లో అమిర్ ఖాన్‌తో పాటు ఆయన తనయుడు జునైద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు, తండ్రి, తనయుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పెళ్లి రోజున నర్వస్‌గా ఉన్నారా?..లేదా ఉత్సాహంగా ఉన్నారా? అంటూ అమితాబ్‌ను ప్రశ్నించాడు జునైద్ ఖాన్. ఈ ప్రశ్నకు అమితాబ్ నవ్వేశాడు. దీంతో వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అనంతరం జునైద్‌ను పెళ్లి గురించి ఆరా తీశారు అమితాబ్. మీరు లైఫ్‌లో త్వరలోనే ఎవరైనా వస్తున్నారా? అంటూ జునైద్‌ను అడిగాడు అమితాబ్. దీంతో అతను వెంటనే దీని గురించి మళ్లీ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు. ఈ విషయం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నాడు.. అమితాబ్ నవ్వుతూ. దీంతో పక్కనే ఉన్న తండ్రి అమిర్ ఖాన్.. అతని సమాధానంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. జునైద్ ఖాన్.. అమిర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు. అతని ఐరా ఖాన్ అనే సోదరి కూడా ఉంది. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ జన్మించారు. ఆ వీరు కూడా 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
అతడు లేకపోతే.. టీమిండియా బౌలింగ్ జీరో: పాక్ మాజీ క్రికెటర్
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2 తేడాతో టీమిండియా కోల్పోయింది. టీ20 సిరీస్‌లో సత్తాచాటిన భారత జట్టు.. వన్డేల్లో మాత్రం తేలిపోయింది. తొలి వన్డేను టై ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర ఓటమి చవిచూసింది.తద్వారా 1997 తర్వాత తొలిసారి శ్రీలంకపై భారత్ వన్డే సిరీస్ ఓడిపోయింది. కాగా ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా విఫలమయ్యారు. వికెట్ల తీయడంలో సిరాజ్, అర్ష్‌దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లు నిరాశపరిచారు.ఈ మొత్తం సిరీస్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. భారత్‌తో పొలిస్తే శ్రీలంక స్పిన్నర్లు మరింత మెరుగ్గా రాణించారు. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సంచలన పోస్ట్ చేశాడు. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ విభాగం శూన్యమని జునైద్ తన అక్కసను వెల్లగక్కాడు. "బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ జీరో. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని జునైద్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా పేస్ గుర్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. -
లాల్ సింగ్ చద్దా.. నన్ను ఆడిషన్ చేశారు.. కానీ!: ఆమిర్ తనయుడు
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఇందులో నాగచైతన్య ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఆమిర్ చేయాల్సిన పాత్ర కోసం ముందుగా తనను ఆడిషన్ చేశారని చెప్తున్నాడు ఆయన తనయుడు, నటుడు జునైద్ ఖాన్. జునైద్ ఇటీవలే మహారాజ్ అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నిజానికి లాల్ సింగ్ చద్దా కోసం నన్ను ఆడిషన్ చేశారు. ఈ మూవీ నేను చేస్తే బాగుండని నాన్న ఎంతగానో అనుకున్నారు. కానీ కుదరలేదు అని తెలిపాడు.కుమారుడికి స్క్రీన్ టెస్ట్ఈ విషయాన్ని ఆమిర్ గతంలోనూ వెల్లడించాడు. లాల్ సింగ్ చద్దా కోసం మొదటగా జునైద్‌కు స్క్రీన్ టెస్ట్ చేశారని తెలిపాడు. కాగా లాల్ సింగ్ చద్దాలో కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మహారాజ్ సినిమా..మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. 1862లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. జైదీప్ అహ్లావత్, షాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో! -
నాన్న సలహాలు లైట్ తీసుకున్నాం, ఇది తన మూవీ కాదు!: ఆమిర్ కుమారుడు
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, దంగల్, పీకే, గజిని, 3 ఇడియట్స్, రంగ్‌దే బసంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్లో భారీ బ్లాక్‌బస్టర్ హిట్లు చాలానే ఉన్నాయి. తను చూడని విజయాలంటూ ఏమీ లేవు. ఆయన కుమారుడు జునైద్ ఖాన్ ఇటీవలే మహారాజ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. స్క్రీన్‌టెస్ట్‌కు పిలిచారుఎంతో అనుభవం ఉన్న ఆమిర్ ఈ మూవీ చూసి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. కానీ అవన్నీ తామసలు లెక్క చేయలేదంటున్నాడు జునైద్. 'డైరెక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఒకసారి స్క్రీన్‌టెస్ట్ చేయాలని రమ్మన్నాడు. అలా మహారాజ మూవీకి నన్ను తీసుకున్నారు. బహుశా దర్శకనిర్మాతలు నన్ను రొమాంటిక్ నటుడిగా చూడలేదేమో! అందుకే ఇలాంటి కాన్సెప్ట్‌కు ఎంచుకున్నారు. నాన్నతో ఎక్కువగా చెప్పలేదుఎందుకో తెలీదు గానీ ఈ మూవీకి ముందు కొంత రాద్ధాంతం జరిగింది. అయితే ఈ చిత్రం ద్వారా మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు. మహారాజ గురించి మా నాన్నతో ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే ఆయన తన పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు. పైగా ఇది తన సినిమా కానే కాదు. నాన్న సలహాలుఅంతా అయ్యాక సిద్దార్థ్ సర్, నిర్మాత ఆదిత్య చోప్రా సర్ నాన్నకు సినిమా చూపించారు. తనకు సినిమా నచ్చింది. అలాగే కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిలో కొన్ని సలహాలు తీసుకుని పాటించారు. మరికొన్ని లైట్ తీసుకున్నారు. ఆయన కూడా మా సినిమాలో మరీ అంత జోక్యం చేసుకోలేదు. కానీ మాకేదైనా డౌట్ ఉందంటే మాత్రం దాన్ని టక్కున తీర్చేవారు' అని జునైద్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘ఏం జరిగిందో మీకే తెలియాలి'.. తిరుమలలో నటి హేమ వ్యాఖ్యలు -
కోహ్లిపై పాక్ మాజీ పేసర్ ట్రోలింగ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. వాంఖడే మ్యాచ్‌లో తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో ముంబైతో మ్యాచ్‌లో కోహ్లి వైఫల్యాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఎక్స్ వేదికగా.. ‘‘స్ట్రైక్‌రేటు 33.33’’ అంటూ కోహ్లి బ్యాటింగ్‌పై జునైద్ ఖాన్ విమర్శలు సంధించాడు. కాగా జునైద్ కోహ్లిపై సెటైర్లు వేడయం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రాజస్తాన్ రాయల్స్‌తో విరాట్ కోహ్లి సెంచరీ చేసినపుడు కూడా ఇలాగే కామెంట్ చేశాడు. ‘‘ఐపీఎల్ చరిత్రలో స్లోయెస్ట్ 100 సాధించినందుకు శుభాభినందనలు’’ అంటూ జునైద్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. భారత గడ్డపై ఐపీఎల్లో శతకం చేసేందుకు అత్యధిక బంతులు తీసుకున్న బ్యాటర్ కోహ్లినే కావడం గమనార్హం. ఓవరాల్‌గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జునైద్ ఖాన్ కోహ్లిని ఇలా విమర్శించాడు. కాగా జునైద్ ఖాన్ ట్వీట్‌పై కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతి ఒక్క మ్యాచ్‌లో ఏ ఆటగాడూ రాణించలేడని.. అటెన్షన్ కోసమే కోహ్లి పేరు వాడుకుంటున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి శతకం సాధించిన రాజస్తాన్‌తో మ్యాచ్‌లో.. తాజాగా అతడు విఫలమైన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయింది. ఇక పదిహేడో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 319 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండటం విశేషం. Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 Strike rate 33.33 😶#RCBvsMI — Junaid khan (@JunaidkhanREAL) April 11, 2024 -
IPL 2024: ఐపీఎల్‌పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్ మాజీ ఆటగాడు
భారత క్రికెట్‌పై, క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్తాన్ క్రికెటర్లకు పరిపాటిగా మారింది. సందర్భం ఏదైనా సరే పాక్ ప్రస్తుత, మాజీలు భారత క్రికెట్‌పై నోరుపారేసుకుంటుంటారు. తాజాగా ఓ పాక్ మాజీ భారత క్రికెట్లో అంతర్బాగమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. 34 ఏళ్ల పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ ఐపీఎల్‌ను, ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ఓర్వలేని కామెంట్లు చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను జునైద్ చులకన చేసే ప్రయత్నం చేశాడు. In IPL batting is so easy on these flat pitches, Sunil Narine has scored a total of 155 in his international T20 career and today he has scored 85 as an opener. The team total is 272.#KKRvsDC #IPL2024 — Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024 ఐపీఎల్లో (భారత్‌లో) ఫ్లాట్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం చాలా సులువని.. అంతర్జాతీయ కెరీర్ (టీ20ల్లో) మొత్తంలో 155 పరుగులు చేసిన నరైన్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 85 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనమని ట్విటర్ వేదికగా అర్దంపర్దం లేని కామెంట్లు చేశాడు. It's sad to see leagues are being prioritised over the team that gave them all the respect. 11/12 senior players are not available for an international series.#PAKvNZ #pakistan https://t.co/MlPrSycxNb — Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024 జునైద్ ఈ ట్వీట్ చేయకముందు న్యూజిలాండ్ క్రికటర్లను సైతం అవమానిస్తూ ఓ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్లకు జాతీయ జట్టు ప్రయోజనాల కంటే ఐపీఎలే ముఖ్యమైందని కామెంట్ చేశాడు. కివీస్ సీనియర్లు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్ ఆడేందుకు చెక్కేశారని అన్నాడు. జునైద్ చేసిన ఈ కామెంట్స్‌పై భారత క్రికెట్ అభిమానులు స్పందించేందకు సైతం ఇష్టపడటం లేదు. పాక్ క్రికెటర్లకు భారత క్రికెట్‌ను ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు, తిండి సహించదని చురకలంటిచి వదిలేస్తున్నారు. కాగా, పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న ప్రకటించారు. ఐపీఎల్ కారణంగా ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్ సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ కారణంగానే జునైద్ ఐపీఎల్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. పాక్ క్రికెటర్లకు ఐపీఎల్లో ప్రవేశం లేదన్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల జునైద్ 2011-19 మధ్యలో పాక్ తరఫున 22 టెస్ట్‌లు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఇందులో అతను 189 వికెట్లు పడగొట్టాడు. -
Sai Pallavi : మంచు పండగలో...
మంచు పండగలో బిజీగా గడుపుతున్నారు సాయి పల్లవి. మంచు పండగ ఏంటీ అంటే.. జపాన్‌లోని సపోరోప్రాంతంలో ఈ పండగ జరుగుతుంటుంది. ఇప్పుడు అక్కడే ఉన్నారు సాయి పల్లవి. ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా వెళ్లారు. ఈ ఇద్దరూ జంటగా ఓ హిందీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ సపోరోలో జరుగుతోంది. అక్కడ జరుగుతున్న మంచు పండగలో షూట్ చేస్తున్నారు. ఈ సెట్స్‌లోని వర్కింగ్ స్టిల్స్ కొన్ని వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటివరకూ సపోరోలో ఏ సినిమా చిత్రీకరణ జరగలేదు. తొలిసారి ఈ చిత్రానికి అనుమతి తెచ్చుకున్నారు. సునిల్ పాండే దర్శకత్వంలో సొంత ప్రోడక్షన్లో ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... ‘మహరాజ్’ అనే చిత్రం ద్వారా జునైద్ ఖాన్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం సాయి పల్లవి కాంబినేషన్లో చేస్తున్నది జునైద్‌కి రెండో సినిమా. ఇక సాయి పల్లవికి హిందీలో ఇది తొలి చిత్రం. -
'సచిన్, కోహ్లి కాదు.. అతడే గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్'
భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరంటే మనకు టక్కున గుర్తు వచ్చేది లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రస్తుత తరంలో అయితే చాలా మంది విరాట్ కోహ్లి పేరు చెబుతారు. ఎందుకంటే సచిన్ సాధించిన ఆల్‌టైమ్ రికార్డులను ఒక్కొక్కటిగా విరాట్ బ్రేక్ చేస్తాడు. ఇటీవలే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టెండూల్కర్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ కొనసాగుతుంటే.. టీ20ల్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కోహ్లి ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా పాకిస్తాన్ వెటరన్ పేసర్ జునైద్ ఖాన్‌కు ఓ ఇంటర్వ్యూలో సచిన్, కోహ్లిలలో గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా అతడు సచిన్,కోహ్లిలను కాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. "విరాట కోహ్లి గొప్ప ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు వరల్డ్ క్రికెట్లోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరంలో సచిన్ ఆడివుంటే 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ నా వరకు అయితే గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ అంటే వీరిద్దరు కాకుండా రోహిత్ శర్మ పేరునే చెబుతాను. రోహిత్ అన్ని రకాల షాట్లు ఆడగలడు. రోహిత్ శర్మను అందరూ ది హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. అతడు వన్డేల్లో సాధించిన 264 పరుగుల రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు. వన్డేల్లో అతడు మూడు సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఒక క్రికెటర్ వైట్‌బాల్ ఫార్మాట్లో ఇన్ని డబుల్ సెంచరీలు సాధించడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. అందుకే రోహిత్‌ను అత్యుత్తమ భారత క్రికెటర్‌గా ఎంచుకున్నాను" అని నాదిర్ అలీ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జునైద్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: 'టీమిండియాకు మరో ఫినిషర్ దొరికేశాడు.. భయం లేకుండా దుమ్మురేపుతున్నాడు' -
వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా: పాక్ మాజీ బౌలర్
#TB- Pakistan in India 2012-13: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. 2012-13 నాటి సిరీస్.. దాయాది టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. పాక్ లెఫ్టార్మ్ పేసర్ జునైద్ ఖాన్‌కు పునరాగమన సిరీస్ అది. నాటి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని మూడుసార్లూ అతడే అవుట్ చేశాడు. తొలి వన్డేలో కోహ్లిని డకౌట్ చేసిన జునైద్.. రెండో మ్యాచ్‌లో 6 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఇక ఆఖరిదైన ఢిల్లీ మ్యాచ్‌లో 7 పరుగుల వద్ద నిష్క్రమించేలా చేశాడు. ఎంత మంది వికెట్లు తీసినా కోహ్లి ప్రత్యేకం అప్పట్లో జరిగిన ఈ సిరీస్‌ను పాకిస్తాన్ 2-1తో కైవసం చేసుకుంది. తాజాగా నాదిర్ షా పాడ్‌కాస్ట్‌లో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జునైద్ ఖాన్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో ఎంతో మంది బ్యాటర్ల వికెట్లు తీసినప్పటికీ అందరికీ విరాట్ కోహ్లి వికెట్ మాత్రమే ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు. అలా కానివ్వనన్నాడు ‘‘అండర్-19 వరల్డ్‌కప్ ఆడినప్పటి నుంచే మాకు పరిచయం ఉంది. నాకు బాగా గుర్తు. టీమిండియాతో ఆడటం అదే మొదటిసారి. నా కమ్‌బ్యాక్ సిరీస్ కూడా! మొదటి మ్యాచ్‌లో కోహ్లి వికెట్ తీశాను. అప్పుడు అతడు నా దగ్గరకు వచ్చి మరోసారి ఇది పునరావృతం కాదని చెప్పాడు. అయితే, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలోనూ నేను మళ్లీ అతడి వికెట్ పడగొట్టాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పాను నిజానికి మూడో వన్డేకు ముందు బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర కోహ్లి కలిశాడు. అప్పుడు.. ‘విరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు’ అని చెప్పాను. అప్పుడు యూనిస్ ఖాన్ కూడా అక్కడే ఉన్నాడు. అన్నట్లుగానే నేను కోహ్లిని అవుట్ చేశాను. నా బౌలింగ్‌లో అతడు ఇచ్చిన క్యాచ్‌ను యూనిస్ భాయ్ పట్టాడు’’ అని జునైద్ ఖాన్ నాటి సిరీస్‌లో కోహ్లితో తనకున్న ‘వైరం’ గురించి చెప్పుకొచ్చాడు. కోహ్లి వరల్డ్‌క్లాస్ బ్యాటర్ అదే సమయంలో కోహ్లిపై ప్రశంసలు కురిపించిన జునైద్ ఖాన్.. ‘‘ప్రపంచంలోని టాప్-5 బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఎప్పటికీ నిలిచిపోతాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు అసాధారణ రికార్డులు సాధిస్తున్నాడు. ఇటీవలే సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును కూడా కోహ్లి బద్దలు కొట్టాడు. అతడు వరల్డ్‌క్లాస్ బ్యాటర్’’ అని కొనియాడాడు. అయితే, కోహ్లి- సచిన్‌ల కంటే తనకు రోహిత్ శర్మనే మెరుగైన బ్యాటర్ అనిపిస్తాడంటూ ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చాడు జునైద్ ఖాన్. అప్పుడు మొత్తం 3 పరుగులిచ్చి మూడుసార్లూ కాగా పాకిస్తాన్ తరఫున 22 టెస్టులు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడిన జునైద్ ఖాన్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 71, 110, 8 వికెట్లు తీశాడు. ఇక టీమిండియాతో 2012-13 వన్డే సిరీస్‌లో కోహ్లికి మొత్తంగా 24 బంతులు వేసిన జునైద్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడుసార్లు పెవిలియన్‌కు పంపాడు. చదవండి: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. తొలి భారత క్రికెటర్‌గా WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్.. -
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్!
దక్షిణాదిలోని అగ్రకథానాయికల్లో ఒకరిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు సాయిపల్లవి. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ కోవలోనే తాజాగా మరోసారి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ బీ టౌన్లో చర్చనీయాంశమైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇటీవల ఓ ప్రేమకథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఈ చిత్రంలోనే సాయిపల్లవి హీరోయిన్గా నటించనున్నారనే టాక్ హిందీ పరిశ్రమలో ప్రచారంలోకి వచ్చింది. ఆమిర్ సన్నిహితుల్లో ఒకరైన సునీల్ పాండే దర్శకత్వం వహిస్తారని, ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని భోగట్టా. ఇక ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తే, హిందీలో ఆమెకు తొలి చిత్రం అవుతుంది. మరి.. సాయిపల్లవిని బాలీవుడ్ భులాయా (పిలిచిందా?) లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
లవ్ టుడే హిందీ రీమేక్‌లో ఆమిర్ ఖాన్ కొడుకు, శ్రీదేవి కూతురు
ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ప్రేమికులు కానున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయదర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటించనున్నారు. రూ. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ఫ్యాంటమ్ స్టూడియోస్ దక్కించుకుంది. అప్పట్నుంచి ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో నటించనున్నారంటూ పలువురు హిందీ యువ హీరో హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారని లేటెస్ట్ టాక్. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాను తెరకెక్కిస్తారట. -
టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా..? నోరు పారేసుకున్న పాక్ ఫాస్ట్ బౌలర్
టీమిండియాపై పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశాడు. భద్రతా కారణాల కారణంగా పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్-2023లో ఆడేందుకు టీమిండియా నిరాకరించిన నేపథ్యంలో జునైద్ ఖాన్ అవాక్కులు చవాక్కులు పేలాడు. భారత క్రికెట్ జట్టుతో పాటు బీసీసీఐపై కూడా ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నోరు పారేసుకున్నాడు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండటానికి టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇతర దేశాల క్రికెటర్లకు (శ్రీలంక, బంగ్లాదేశ్) లేని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ టీమిండియాకే ఎందుకని ప్రశ్నించాడు. ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకుని టీమిండియాను పాక్‌లో పర్యటించేలా చేయాలని, పాకిస్తాన్ లేని క్రికెట్ ఊహించడానికి కూడా అసాధ్యమని అన్నాడు. ప్రస్తుతం పాక్‌లో పరిస్థితులు మునుపటికంటే చాలా మెరుగయ్యాయని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటించాయని గుర్తు చేశాడు. అగ్రశ్రేణి జట్లు పాక్‌లో పర్యటించినప్పుడు భారత్‌కు ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించాడు. పాక్ చిన్న జట్టేం కాదని, ఇటీవలే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు కూడా చేరిందని గొప్పలు పోయాడు. జునైద్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. వారి దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను (ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న హింసాకాండ) చూపిస్తూ జునైద్‌కు గట్టిగా కౌంటర్లిస్తున్నారు. 33 ఏళ్ల జునైద్.. పాక్ తరఫున 22 టెస్ట్‌లు, 76 వన్డేలు, 9 టీ20 ఆడాడు. టెస్ట్‌ల్లో 71, వన్డేల్లో 110, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. కాగా, టీమిండియా పాక్‌లో పర్యటించేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికగా యూఏఈని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీంతో సగం మ్యాచ్‌లు యూఏఈలో(భారత్ ఆడే మ్యాచ్‌లు), సగం మ్యాచ్‌లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అయిష్టంగా ఒప్పుకుంది. వేదిక విషయంలో ప్రధాన జట్లైన భారత్, పాక్ అంగీకారం తెలపడంతో టోర్నీ సజావుగా సాగుతుందని అంతా ఊహించారు. అయితే, తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు యూఏఈలో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సెప్టెంబర్ నెలలో యూఏఈలో ఎండలు భయానకంగా ఉంటాయని ఈ రెండు దేశాలు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటున్నట్లు సమాచారం. చదవండి: పాక్‌లో పర్యటిస్తున్న టీమిండియా సేఫ్.. వదంతులు నమ్మవద్దు -
భార్య ప్రైవేట్ వీడియోలు తీశాడు: సింగర్ నిజస్వరూపం బయటపెట్టిన తమ్ముడు
స్టార్ సింగర్, పద్మశ్రీ గ్రహీత అద్నాం సమీ బాలీవుడ్లో ఎన్నో సినిమాలకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. పాప్ ఆల్బమ్స్‌తో సంగీతప్రియులను హుషారెత్తించాడు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అద్నాం సమీ సోదరుడు జునైద్ ఖాన్ సింగర్‌పై సంచనల వ్యాఖ్యలు చేశాడు. 'నా పెద్దన్న అద్నాన్ సమీ నిజస్వరూపం బయటపెట్టాల్సిన సమయం వచ్చేసింది. నేను ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ భయపడను. ఇలా చేయడం నాకు నచ్చడం లేదు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే! అతడిలా నేను అబద్ధాలు చెప్పను' అంటూ కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు. ► అద్నాన్ సమీ 1969 ఆగస్టు 15న రావల్ పిండి ఆస్పత్రిలో జన్మించాడు. నేను కూడా అదే ఆస్పత్రిలో 1973లో పుట్టాను. అద్నాన్ చెప్పినట్లుగా అతడు ఇంగ్లాండ్‌లోనో, మరెక్కడోనో పుట్టలేదు. ► నాకు టాలెంట్ ఉంది, నేను పాడగలనని అద్నాన్‌ను తెలుసు. తనకంటే నా గొంతు బాగుందని చాలామంది అన్నారు. కావాలనుకుంటే ఆయన నాకు సాయం చేయొచ్చు. కానీ తను స్వార్థంగా ఆలోచించాడు. నన్ను ఇండియన్ ఇండస్ట్రీలో లాంచ్ చేయలేదు. ఒకవేళ నేను తనకన్నా పేరు తెచ్చుకుంటానని భయపడ్డాడేమో! ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఇందుకు అతడే కారణం. ► అద్నాన్ సమీ ఇంగ్లాండ్‌లోని రగ్బీ స్కూల్లో చదువుకున్నాడు. కానీ తనకు చదువు అబ్బలేదు. అందుకే ఫేక్ డిగ్రీలు సంపాదించాడు. లాహోర్ యూనివర్సిటీలో బీఏ చదివాడు. కానీ ఫేస్బుక్లో మాత్రం యూకేలో లా చదివానని చెప్తాడు. ► అన్నిటికంటే కూడా మమ్మల్ని బాగా బాధపెట్టిన విషయం. 1997లో అతడు తన మూడేళ్ల కొడుకు అజాన్‌ను తీసుకుని దుబాయ్, కెనడా, అమెరికా వెళ్లాడు. ఏడేళ్లు వచ్చేదాకా పిల్లవాడు తల్లితో ఉండాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. కానీ అద్నాన్ అదేమీ పట్టించుకోలేదు. ► ఇది మరీ దారుణ విషయం. నా గర్ల్‌ఫ్రెండ్‌తో కూడా నేనలా ప్రవర్తించలేదు. 2007/2008లో అద్నాన్ సమీ తన రెండో భార్య సబా గలదేరీ పోర్న్ వీడియోలు తీశాడు. భార్యాభర్తల మధ్య ఏదైనా గుట్టుగా ఉండాలి. కానీ ఆ వీడియోలను అతడు కోర్టుకు సమర్పించాడు. తానసలు ఆ వీడియోలు తీయలేదని, సబా ప్రియుడే వాటిని తీసి ఉండవచ్చని ఆమెపై నిందలు వేశాడు. ► ఇండియాలో అయితే బాగా డబ్బులు వస్తాయనే తను పాకిస్తాన్ పౌరసత్వం వదులుకుని ఇక్కడ సెటిలయ్యాడు. అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో జునైద్ సదరు పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా పాకిస్తానీ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అర్షద్ సమీ ఖాన్ తనయులే అద్నాన్, జునైద్. అద్నాన్ సమీ మొదట పాకిస్తానీ సినిమాలకు సంగీతం అందించాడు. ఆశా భోంస్లేతో చేసిన 'కభీ తో నజర్ మిలావో' ఆల్బమ్ హిట్ కావడంతో ఆయనకు భారత్‌లోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అలా ఆయన ఇండియన్ సినిమాలకు సైతం పనిచేశాడు. -
ఆమీర్ ఖాన్ తనయుడి ఎంట్రీ.. 'మహారాజా'గా..!
బాలీవుడ్లో టాప్ హీరోల వారసుల సిల్వర్‌స్క్రీన్ ఎంట్రీ ప్రతి ఏడాది ఉంటూనే ఉంటుంది. ఈ ఏడాది ఈ జాబితాలో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ పేరు చేరింది. జునైద్ ఖాన్ నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకుడు. ఈ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మంగళవారం ముంబైలో మొదలైంది. ఎనిమిది గంటలు మించకుండా టీవీ, సినిమాల షూటింగ్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ‘మహారాజా’ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. వ్యాక్సిన్ వేయించుకుని, నెగటివ్ కోవిడ్ రిపోర్టు ఉన్నవారినే సెట్స్‌లోకి అనుమతిస్తున్నారట. తొలిరోజు సీన్స్‌లో ప్రధాన తారాగణంతో పాటు 25 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారట. అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత చిత్రీకరణ ఆరంభించుకున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజా’యే అని బాలీవుడ్ టాక్. ఇక కథ విషయానికి వస్తే... ఈ చిత్రం 1862 నేపథ్యంలో సాగుతుందని, ఇందులో జునైద్ ఖాన్ జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారనీ టాక్. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే జునైద్‌కి జోడీగానా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి : ‘సీత’ మూవీ మేకర్స్‌కు కరీనా షరతులు.. మరీ అంత రెమ్యునరేషనా?! -
బాలీవుడ్‌లోకి ఆమిర్ కొడుకు ఎంట్రీ!
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జునైద్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా చిత్రీకరణ సోమవారం ముంబైలో ప్రారంభం అయింది. ‘మహారాజా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోంది. సిద్ధార్థ్ పి. మల్హోత్ర దర్శకత్వం వహిస్తున్నారు. 1862లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జర్నలిస్ట్ పాత్రలో జునైద్ కనిపించనున్నారు. సినిమాల్లోకి రావడానికి ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా నటనలో శిక్షణ తీసుకున్నారు జునైద్. కాగా ఇప్పటికే అమీర్ ఖాన్ కుమారుడు కొన్నేళ్లుగా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. జునైద్ మూడేళ్లుగా థియేటర్ ఆర్టిస్టుగా తన సత్తా చూపిస్తున్నాడు. కేవలం అమీర్ ఖాన్ బ్యాగ్రౌండ్‌తో కాకుండా నటుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చూస్తున్నాడు జునైద్. లాస్ ఏంజిల్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ పూర్వ విద్యార్థిగానూ అతడికి గుర్తింపు ఉంది. ఏ ఫార్మింగ్ స్టోరీ, ఏ ఫ్యూ గుడ్ గుడ్ మెన్, మెడియా, బోన్ ఆఫ్ కన్టెన్షన్ లాంటి ప్రఖ్యాత నాటకాల్లో జునైద్ నటించాడు. ఇంత శిక్షణ అనంతరం జునైద్ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇరా, జునైద్ ఖాన్ విషయానికొస్తే.. వీరిద్దరు ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త పిల్లలు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికి ఆజాద్ రావు ఖాన్ అనే తనయుడు ఉన్నాడు. చదవండి: ఫోన్ వాడేది లేదంటున్న అమీర్ ఖాన్! -
ఆమిర్ తనయుడితో జోడీ
‘అర్జున్ రెడ్డి’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు షాలినీ పాండే. హిందీ ఆడియన్స్‌నూ పలకరించడానికి రెడీ అయ్యారామె. రణ్వీర్ సింగ్‌తో ‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాలో నటించారామె. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా రెండో హిందీ సినిమా కూడా అంగీకరించారని తెలిసింది. అది కూడా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన అని సమాచారం. జునైద్ హీరోగా పరిచయం కానున్న సినిమాకి రంగం సిద్ధమైంది. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో షాలినీ హీరోయిన్గా నటించనున్నారట. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమా నిర్మించనుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభం కానుంది. -
కోహ్లిని మూడుసార్లు ఔట్ చేసేసరికి..
కరాచీ: ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పి తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని తక్కువ అంచనా వేశానని పాకిస్తాన్ వెటరన్ లెఫ్టార్మ్ పేసర్ జునైద్ ఖాన్ తెలిపాడు. 2012లో పాకిస్తాన్‌తో సిరీస్‌లో కోహ్లిని మూడుసార్లు ఔట్ చేయడంతో అతనిపై ఎటువంటి అంచనాలు లేవన్నాడు. భారత్‌లో జరిగిన ఆ సిరీస్‌లో కోహ్లి 13 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, ఆ సిరీస్‌లో జునైద్ 24 బంతుల్ని కోహ్లి సంధించగా మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. చెన్నై మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లి.. కోల్‌కతా, ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఆరు, ఏడు పరుగులు చేశాడు. దాంతో ఆ సిరీస్ కోహ్లికి నిరాశనే మిగిల్చగా, పాకిస్తాన్ 2-1తో సిరీస్ గెలుచుకుంది. (‘సురేశ్ రైనా కెరీర్ ముగిసినట్లే’) ఈ సిరీస్‌కు సంబంధించి క్రిక్‌ఇన్‌జిఫ్ యూట్యూబ్ చానల్లో జునైద్ మాట్లాడాడు. కాగా, ప్రత్యేకంగా కోహ్లిని ఔట్ చేయడంపై సదరు వ్యాఖ్యాత ప్రశ్నించగా జునైద్ దానికి బదులిచ్చాడు. ‘ నేను కోహ్లిని సాధారణ బ్యాట్స్‌మన్ అనుకున్నా. నేను కోహ్లికి వేసిన మొదటి బంతి వైడ్ అయ్యింది. ఆ తదుపరి బంతిని కోహ్లి ఆడలేకపోవడమే కాకుండా ఔటయ్యాడు. దాంతో అతన్ని మామూలు బ్యాట్స్‌మన్‌గానే భావించా. ఇక ఆ సిరీస్‌కు ముందు కోహ్లి నాతో చాలెంజ్ చేశాడు. ఇవి భారత్ పిచ్‌లు నువ్వు వేసే బంతులు వల్ల ఏమీ ఉపయోగం ఉండదని జోక్ చేశాడు. నేను కూడా చూద్దాం అని సరదాగా రిప్లై ఇచ్చా’ అని జునైద్పేర్కొన్నాడు. ఆ సమయంలో పాకిస్తాన్ జట్టులో రెగ్యులర్ ఆటగాడైన జునైద్.. అత్యుత్తమ ప్రదర్శనపైనే ఎక్కువ గురిపెట్టేవాడు. ప్రత్యేకంగా భారత్‌పై మరింత చెలరేగి బౌలింగ్ వేసేవాడు జునైద్. 2012 సిరీస్‌లో జునైద్ మొత్తం ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు సాధించిన జునైద్.. రెండో వన్డేలో మూడు వికెట్లు తీశాడు. గతేడాది మే నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో జునైద్ పాకిస్తాన్ తరఫున చివరిసారి కనిపించాడు.(ఐసీసీ వన్డే సూపర్ లీగ్ వచ్చేసింది..) -
పాక్ క్రికెటర్ వినూత్న నిరసన
ఇస్లామాబాద్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన విషయం తెలిసిందే. సోమవారం చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ మెగా టోర్నీకి పాక్ జట్టును ప్రకటించాడు. అంతగా ఆకట్టుకోలేకపోయిన పేస్ ఆల్‌రౌండర్ ఫహీమ్ ఆష్రఫ్, పేసర్ జునైద్ ఖాన్‌తో పాటు అబిద్ అలీకి సెలక్షన్ కమిటీ ఉద్వాసన పలికింది. వరల్డ్‌కప్ జట్టు నుంచి తప్పించడంతో పాక్ బౌలర్ జునైద్ ఖాన్ సెలక్టర్లపై వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రస్తుతం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అని ట్విటర్లో వ్యాఖ్యానించాడు. ట్వీట్‌తో పాటు నోటికి నల్లప్లాస్టర్ వేసుకున్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 18వ తేదీన పాక్ ప్రకటించిన వరల్డ్‌కప్ జట్టులో జునైద్ చోటు దక్కించుకోగా, ఇంగ్లండ్‌పై పేలవ ప్రదర్శన అనంతరం మూడు మార్పులు చేసింది పాక్ సెలక్షన్ కమిటీ. (ఇక్కడ చదవండి: పాక్ జట్టులో మూడు మార్పులు) -
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
బర్మింగ్‌హామ్: భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్త. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ జునైద్ ఖాన్ ఆడడం లేదు. కోహ్లిని సవాల్ చేసిన అతడు ఈరోజు మ్యాచ్‌లో ఉండుంటే పోటీ రసవత్తరంగా సాగేది. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అయినప్పటికీ తన దెబ్బకు నిలవలేడని టోర్నీ ప్రారంభానికి ముందు జునైద్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి-జునైద్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావించారు. వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలని అభిమానులు ఆశ పడ్డారు. అనూహ్యంగా జునైద్‌కు 12 మంది సభ్యుల పాక్ టీమ్‌లో చోటు దక్కలేదు. గతంలో నాలుగు మ్యాచుల్లో జునైద్ బౌలింగ్‌లో కోహ్లి మూడుసార్లు అవుటయ్యాడు. 22 బంతులను ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేకాదు వన్డేలో కోహ్లికి జునైద్ 21 డాట్ బంతులు సాధించాడు. జునైద్‌ను తప్పించడాన్ని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సమర్థించుకున్నాడు. ‘నాలుగేళ్ల క్రితం కోహ్లిని జునైద్ అవుట్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీనికి అనుగుణంగా జట్టును ఎంపిక చేశాం. ఇప్పున్న బౌలర్లు కూడా కోహ్లి వికెట్ తీయగలర’ని సర్ఫరాజ్ తెలిపాడు. -
'కోహ్లీ నా దెబ్బకు నిలబడలేడు'
కరాచీ: భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బౌలింగ్ ధాటికి నిలబడలేడని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ అన్నాడు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో జునైద్ పై విధంగా స్పందించాడు. కోహ్లీ తనను ఎదుర్కొన్న నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు ఔటైన విషయాన్ని ప్రస్తావించాడు. చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే రిపీట్ అవుతుందని చెప్పాడు. 'వాస్తవానికి కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మనే.. కానీ, నా వద్దకు వచ్చే సరికి అతని ఎత్తులు పారడం లేదు' అని అన్నాడు. కోహ్లీ కంటే తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. కాగా, కోహ్లీ, జునైద్‌ను ఎదుర్కొని నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఎడమ చేతి వాటం గల ఈ పేసర్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. -
పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ
లాహోర్: ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ సీనియర్ పేసర్ జునైద్ ఖాన్ గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. సోమవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో జునైద్ విఫలమయ్యాడు. జునైద్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. ప్రపంచ కప్‌లో ఆడనందుకు క్షమించాల్సిందిగా అభిమానులను కోరాడు. కాగా పాకిస్థాన్ ఇంతకుముందు స్పిన్నర్ సయీద్ అజ్మల్, పేసర్ ఉమర్ గుల్ సేవలను కోల్పోయింది. బౌలింగ్ శైలి సరిగాలేనందున అజ్మల్‌పై ఐసీసీ వేటువేయగా, గుల్ గాయకారణంగా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా జునైద్ వైదొలగడంతో పాక్ బౌలింగ్ విభాగం ప్రపంచ కప్ ముందే బలహీనపడినట్టయింది. -
అనంతరం: జూనియర్ ఫర్ఫెక్షనిస్ట్
కొడుక్కి తండ్రి పోలికలు రావడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ అచ్చు గుద్దినట్టుగా అతడి గుణగణాలు రావడం మాత్రం విశేషమే. అందుకే జునైద్‌ని చూస్తే ఆమిర్‌ని చూసినట్టే ఉంటుంది అంటారంతా. ఆ మాట విన్నప్పుడల్లా ఆ కొడుకు చిన్నగా నవ్వుతాడు. అతడి తండ్రి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. బంధానికి తండ్రీకొడుకులే అయినా, చూడ్డానికి అన్నదమ్ముల్లా కనిపించే ఆ తండ్రీకొడుకులు... ఆమిర్‌ఖాన్, జునైద్‌ఖాన్! ‘పీకే’ సినిమా షూటింగ్ జరుగుతోంది. నిండా పాతికేళ్లు కూడా లేని కుర్రాడు స్క్రిప్టు పేపర్లు పట్టుకుని అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నాడు. మధ్య మధ్యలో కెమెరామేన్ దగ్గరకు వెళ్లి సూచనలు ఇస్తున్నాడు. డెరైక్టర్ దగ్గరకు వెళ్లి డిస్కస్ చేస్తున్నాడు. నటీనటులతో ముచ్చటిస్తున్నాడు. కాస్త దూరంలో కూర్చుని ఉన్న ఓ నలభై ఎనిమిదేళ్ల వ్యక్తి ఆ కుర్రాడినే తదేకంగా చూస్తున్నాడు. కాసేపటి తర్వాత అతడి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వులో కాసింత గర్వం. అంతా తానై, అన్నింటా తానై మసలుతున్న ఆ కుర్రాడి పేరు జునైద్. అతడిని చూసి మురిసిపోతోంది... ఆమిర్‌ఖాన్, జునైద్ తండ్రి! బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ గురించి చెప్పమంటే ఎవరైనా మొదట చెప్పే మాట... పర్ఫెక్షన్కు నిలువెత్తు రూపం, క్రమశిక్షణకు మరో రూపం అని. అవే మాటలు ఇప్పుడు జునైద్‌ని చూసి అంటున్నారంతా. అందుకే కొడుకుని చూసి గర్వంతో పొంగిపోతుంటాడు ఆమిర్. తన మార్గంలో నడిచి హీరో కాకపోయినా, తనకిష్టమైన డెరైక్షన్ రంగంలో ఎదిగేందుకు కొడుకు పడుతోన్న తపనకు తోడుంటాడు. ప్లస్సులను మెచ్చుకుంటూ, మైనస్‌లను అధిగమించడం నేర్పుతూ... కొడుకుని గొప్పవాణ్ని చేసేందుకు ఆరాట పడుతుంటాడు. ఆ బంధం బలమైనది... ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ చిత్రం చేస్తున్నప్పుడు, నటి రీనా దత్తాతో ప్రేమలో పడిన ఆమిర్, తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి జునైద్, ఇరా పుట్టారు. పిల్లలంటే ప్రాణం ఆమిర్‌కి. కానీ భార్యతో బంధమే... ఎందుకో బలహీన పడింది. పదిహేనేళ్లు గడిచాక పూర్తిగా తెగిపోయింది. పిల్లలు తల్లి చెంత చేరారు. కానీ... తండ్రి గుండెల్లో వారి స్థానం వారిదే. భార్యతో విడిపోయినా, మరో స్త్రీతో ప్రేమలో పడినా... పిల్లల బాధ్యతను విస్మరించలేదు ఆమిర్. అందుకే జునైద్, ఇరాలకు తండ్రి మీద రెండో అభిప్రాయం లేదు. అమ్మానాన్నలు విడిపోయినా తమకు ఇద్దరూ ఉన్నారన్న భావనలోనే ఉంటారు. అసిస్టెంట్ డెరైక్టర్ అయిన కిరణ్‌రావుని తండ్రి పెళ్లి చేసుకుంటుంటే... వచ్చి విష్ చేయగలిగేంత మెచ్యూరిటీ, వారికి పుట్టిన బిడ్డని తమ్ముడిగా ప్రేమించేంత మంచి మనసుంది వారిలో. అది వారిని తండ్రికి మరింత దగ్గర చేసింది. తండ్రికి జిరాక్స్ కాపీ... జునైద్‌ని చూస్తే ఆమిర్‌ని చూడక్కర్లేదు అంటారు వారి గురించి తెలిసినవారంతా. చేయాలనుకున్నది చేయడం, వెళ్లే దారిలో ముళ్లను ఏరిపారేసి పూలను పరచుకుంటూ పోవడం, వేలెత్తి చూపనివ్వని క్రమశిక్షణ... ఇవన్నీ తండ్రి నుంచే అబ్బాయి జునైద్‌కి. నటుడు కావాలన్న కోరిక అతడికెప్పుడూ లేదు. ఒకరు క్రియేట్ చేసినదాన్ని ఇంప్రవైజ్ చేసే నటుడికన్నా, క్రియేట్ చేసినవాడే గొప్పవాడన్న నమ్మకం అతడిది. అందుకే మెగాఫోన్ పట్టేందుకే మొగ్గు చూపాడు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. విలువలకు కట్టుబడి సినిమా తీస్తాడు హిరానీ. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్ చిత్రాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆమిర్ కూడా విలువల గురించి ఆలోచిస్తాడు. అతడికి కొడుకుగా పుట్టిన జునైద్ కూడా వాటి గురించే ఆలోచించాడు. అందుకే తన గురువుగా హిరానీని ఎంచుకున్నాడు. ప్రస్తుతం తన తండ్రి ఆమిర్‌తో హిరానీ తీస్తోన్న ‘పీకే’కి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. నువ్వెప్పుడు దర్శకుడివవుతావు అంటే... ‘ముందు పని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి’ అంటాడు. ఆమిర్ కొడుకు కదా... పర్ఫెక్షన్ గురించి కాకుండా దేని గురించి మాట్లాడతాడు! - సమీర నేలపూడి