భారత క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరంటే మనకు టక్కున గుర్తు వచ్చేది లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రస్తుత తరంలో అయితే చాలా మంది విరాట్ కోహ్లి పేరు చెబుతారు. ఎందుకంటే సచిన్ సాధించిన ఆల్‌టైమ్ రికార్డులను ఒక్కొక్కటిగా విరాట్ బ్రేక్ చేస్తాడు. ఇటీవలే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టెండూల్కర్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.
వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ కొనసాగుతుంటే.. టీ20ల్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కోహ్లి ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా పాకిస్తాన్ వెటరన్ పేసర్ జునైద్ ఖాన్‌కు ఓ ఇంటర్వ్యూలో సచిన్, కోహ్లిలలో గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా అతడు సచిన్,కోహ్లిలను కాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు.
"విరాట కోహ్లి గొప్ప ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు వరల్డ్ క్రికెట్‌లోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరంలో సచిన్ ఆడివుంటే 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ నా వరకు అయితే గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ అంటే వీరిద్దరు కాకుండా రోహిత్ శర్మ పేరునే చెబుతాను.
రోహిత్ అన్ని రకాల షాట్‌లు ఆడగలడు. రోహిత్ శర్మను అందరూ ది హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. అతడు వన్డేల్లో సాధించిన 264 పరుగుల రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు. వన్డేల్లో అతడు మూడు సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఒక క్రికెటర్ వైట్‌బాల్ ఫార్మాట్‌లో ఇన్ని డబుల్ సెంచరీలు సాధించడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. అందుకే రోహిత్‌ను అత్యుత్తమ భారత క్రికెటర్‌గా ఎంచుకున్నాను" అని నాదిర్ అలీ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జునైద్ ఖాన్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: 'టీమిండియాకు మరో ఫినిషర్ దొరికేశాడు.. భయం లేకుండా దుమ్మురేపుతున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment