స్టార్ సింగర్, పద్మశ్రీ గ్రహీత అద్నాం సమీ బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. పాప్ ఆల్బమ్స్‌తో సంగీతప్రియులను హుషారెత్తించాడు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అద్నాం సమీ సోదరుడు జునైద్ ఖాన్ సింగర్‌పై సంచనల వ్యాఖ్యలు చేశాడు. 'నా పెద్దన్న అద్నాన్ సమీ నిజస్వరూపం బయటపెట్టాల్సిన సమయం వచ్చేసింది. నేను ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ భయపడను. ఇలా చేయడం నాకు నచ్చడం లేదు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే! అతడిలా నేను అబద్ధాలు చెప్పను' అంటూ కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు.
► అద్నాన్ సమీ 1969 ఆగస్టు 15న రావల్ పిండి ఆస్పత్రిలో జన్మించాడు. నేను కూడా అదే ఆస్పత్రిలో 1973లో పుట్టాను. అద్నాన్ చెప్పినట్లుగా అతడు ఇంగ్లాండ్‌లోనో, మరెక్కడోనో పుట్టలేదు.
► నాకు టాలెంట్ ఉంది, నేను పాడగలనని అద్నాన్‌ను తెలుసు. తనకంటే నా గొంతు బాగుందని చాలామంది అన్నారు. కావాలనుకుంటే ఆయన నాకు సాయం చేయొచ్చు. కానీ తను స్వార్థంగా ఆలోచించాడు. నన్ను ఇండియన్ ఇండస్ట్రీలో లాంచ్ చేయలేదు. ఒకవేళ నేను తనకన్నా పేరు తెచ్చుకుంటానని భయపడ్డాడేమో! ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఇందుకు అతడే కారణం.
► అద్నాన్ సమీ ఇంగ్లాండ్‌లోని రగ్బీ స్కూల్‌లో చదువుకున్నాడు. కానీ తనకు చదువు అబ్బలేదు. అందుకే ఫేక్ డిగ్రీలు సంపాదించాడు. లాహోర్ యూనివర్సిటీలో బీఏ చదివాడు. కానీ ఫేస్‌బుక్‌లో మాత్రం యూకేలో లా చదివానని చెప్తాడు.
► అన్నిటికంటే కూడా మమ్మల్ని బాగా బాధపెట్టిన విషయం. 1997లో అతడు తన మూడేళ్ల కొడుకు అజాన్‌ను తీసుకుని దుబాయ్, కెనడా, అమెరికా వెళ్లాడు. ఏడేళ్లు వచ్చేదాకా పిల్లవాడు తల్లితో ఉండాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. కానీ అద్నాన్ అదేమీ పట్టించుకోలేదు.
► ఇది మరీ దారుణ విషయం. నా గర్ల్‌ఫ్రెండ్‌తో కూడా నేనలా ప్రవర్తించలేదు. 2007/2008లో అద్నాన్ సమీ తన రెండో భార్య సబా గలదేరీ పోర్న్ వీడియోలు తీశాడు. భార్యాభర్తల మధ్య ఏదైనా గుట్టుగా ఉండాలి. కానీ ఆ వీడియోలను అతడు కోర్టుకు సమర్పించాడు. తానసలు ఆ వీడియోలు తీయలేదని, సబా ప్రియుడే వాటిని తీసి ఉండవచ్చని ఆమెపై నిందలు వేశాడు.
► ఇండియాలో అయితే బాగా డబ్బులు వస్తాయనే తను పాకిస్తాన్ పౌరసత్వం వదులుకుని ఇక్కడ సెటిలయ్యాడు. అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో జునైద్ సదరు పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా పాకిస్తానీ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అర్షద్ సమీ ఖాన్ తనయులే అద్నాన్, జునైద్. అద్నాన్ సమీ మొదట పాకిస్తానీ సినిమాలకు సంగీతం అందించాడు. ఆశా భోంస్లేతో చేసిన 'కభీ తో నజర్ మిలావో' ఆల్బమ్ హిట్ కావడంతో ఆయనకు భారత్‌లోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అలా ఆయన ఇండియన్ సినిమాలకు సైతం పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment