భారత క్రికెట్‌పై, క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్తాన్ క్రికెటర్లకు పరిపాటిగా మారింది. సందర్భం ఏదైనా సరే పాక్ ప్రస్తుత, మాజీలు భారత క్రికెట్‌పై నోరుపారేసుకుంటుంటారు. తాజాగా ఓ పాక్ మాజీ భారత క్రికెట్‌లో అంతర్బాగమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు.
34 ఏళ్ల పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ ఐపీఎల్‌ను, ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ఓర్వలేని కామెంట్లు చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను జునైద్ చులకన చేసే ప్రయత్నం చేశాడు.
In IPL batting is so easy on these flat pitches, Sunil Narine has scored a total of 155 in his international T20 career and today he has scored 85 as an opener.
— Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024
The team total is 272.#KKRvsDC #IPL2024
ఐపీఎల్‌లో (భారత్‌లో) ఫ్లాట్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం చాలా సులువని.. అంతర్జాతీయ కెరీర్ (టీ20ల్లో) మొత్తంలో 155 పరుగులు చేసిన నరైన్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 85 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనమని ట్విటర్ వేదికగా అర్దంపర్దం లేని కామెంట్లు చేశాడు.
It's sad to see leagues are being prioritised over the team that gave them all the respect. 11/12 senior players are not available for an international series.#PAKvNZ #pakistan https://t.co/MlPrSycxNb
— Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024
జునైద్ ఈ ట్వీట్ చేయకముందు న్యూజిలాండ్ క్రికటర్లను సైతం అవమానిస్తూ ఓ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్లకు జాతీయ జట్టు ప్రయోజనాల కంటే ఐపీఎలే ముఖ్యమైందని కామెంట్ చేశాడు. కివీస్ సీనియర్లు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్ ఆడేందుకు చెక్కేశారని అన్నాడు.
జునైద్ చేసిన ఈ కామెంట్స్‌పై భారత క్రికెట్ అభిమానులు స్పందించేందకు సైతం ఇష్టపడటం లేదు. పాక్ క్రికెటర్లకు భారత క్రికెట్‌ను ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు, తిండి సహించదని చురకలంటిచి వదిలేస్తున్నారు.
కాగా, పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న ప్రకటించారు. ఐపీఎల్ కారణంగా ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్ సిరీస్‌లో పాల్గొనడం లేదు.
ఈ కారణంగానే జునైద్ ఐపీఎల్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. పాక్ క్రికెటర్లకు ఐపీఎల్‌లో ప్రవేశం లేదన్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల జునైద్ 2011-19 మధ్యలో పాక్ తరఫున 22 టెస్ట్‌లు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఇందులో అతను 189 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment