సునీల్ నరైన్
ఐపీఎల్–2018కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా కీలక ఆటగాడు క్రిస్ లిన్ దూరమైన ఆ జట్టుకు... ప్రధాన స్పిన్నర్ సునీల్ నరైన్ సేవలు కూడా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విండీస్ స్పిన్నర్ మూడోసారి వివాదాస్పద బౌలింగ్ శైలి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. షార్జా వేదికగా జరుగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 29 ఏళ్ల నరైన్ లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా బుధవారం లాహోర్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నరైన్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. నరైన్ విండీస్ తరఫున 6 టెస్టులు, 65 వన్డేలు, 48 టి20లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment