నరైన్‌కు లైన్ క్లియర్
బౌలింగ్‌కు అనుమతి ఇచ్చిన ఐసీసీ
దుబాయ్: ఐపీఎల్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊరట లభించింది. వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో బౌలింగ్ చేసేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. సందేహాస్పద శైలి కారణంగా బౌలింగ్‌కు దూరమైన నరైన్... తన యాక్షన్‌ను సరి చేసుకుని గత నెల 28న బయో మెకానికల్ పరీక్షకు హాజరయ్యాడు.
చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో జరిగిన ఈ పరీక్షలో స్పిన్నర్ మోచేతిని 15 డిగ్రీల కంటే తక్కువగానే వంచుతున్నాడని తేలింది. దీంతో నరైన్‌పై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. అయితే భవిష్యత్‌లో స్పిన్నర్ బౌలింగ్‌పై అనుమానాలు ఉంటే అంపైర్లు ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించింది.