Aamir Khan's Son Junaid Khan And Sridevi's Younger Daughter Khushi Kapoor To Star In Love Today Remake - Sakshi
Sakshi News home page

లవ్‌ టుడే హిందీ రీమేక్‌, ప్రధాన పాత్రల్లో నటించేది వీళ్లేనా?

Published Thu, May 25 2023 4:28 AM | Last Updated on Thu, May 25 2023 11:37 AM

Junaid Khan-Khushi Kapoor in Love Today remake - Sakshi

ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ ప్రేమికులు కానున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... దర్శక–నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ నటించి, స్వీయదర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్‌ టుడే’ హిందీ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటించనున్నారు.

రూ. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులను ఫ్యాంటమ్‌ స్టూడియోస్‌ దక్కించుకుంది. అప్పట్నుంచి ‘లవ్‌ టుడే’ హిందీ రీమేక్‌లో నటించనున్నారంటూ పలువురు హిందీ యువ హీరో హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా జునైద్‌ ఖాన్, ఖుషీ కపూర్‌ ఈ ప్రాజెక్ట్‌కి సైన్‌ చేశారని లేటెస్ట్‌ టాక్‌. దర్శకుడు అద్వైత్‌ చందన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement