‘అర్జున్ రెడ్డి’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు షాలినీ పాండే. హిందీ ఆడియన్స్‌నూ పలకరించడానికి రెడీ అయ్యారామె. రణ్‌వీర్ సింగ్‌తో ‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాలో నటించారామె. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా రెండో హిందీ సినిమా కూడా అంగీకరించారని తెలిసింది. అది కూడా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన అని సమాచారం. జునైద్ హీరోగా పరిచయం కానున్న సినిమాకి రంగం సిద్ధమైంది. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో షాలినీ హీరోయిన్‌గా నటించనున్నారట. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమా నిర్మించనుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment