బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, దంగల్, పీకే, గజిని, 3 ఇడియట్స్, రంగ్‌దే బసంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్ హిట్లు చాలానే ఉన్నాయి. తను చూడని విజయాలంటూ ఏమీ లేవు. ఆయన కుమారుడు జునైద్ ఖాన్ ఇటీవలే మహారాజ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
స్క్రీన్‌టెస్ట్‌కు పిలిచారు
ఎంతో అనుభవం ఉన్న ఆమిర్ ఈ మూవీ చూసి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. కానీ అవన్నీ తామసలు లెక్క చేయలేదంటున్నాడు జునైద్. 'డైరెక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఒకసారి స్క్రీన్‌టెస్ట్ చేయాలని రమ్మన్నాడు. అలా మహారాజ మూవీకి నన్ను తీసుకున్నారు. బహుశా దర్శకనిర్మాతలు నన్ను రొమాంటిక్ నటుడిగా చూడలేదేమో! అందుకే ఇలాంటి కాన్సెప్ట్‌కు ఎంచుకున్నారు.
నాన్నతో ఎక్కువగా చెప్పలేదు
ఎందుకో తెలీదు గానీ ఈ మూవీకి ముందు కొంత రాద్ధాంతం జరిగింది. అయితే ఈ చిత్రం ద్వారా మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు. మహారాజ గురించి మా నాన్నతో ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే ఆయన తన పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు. పైగా ఇది తన సినిమా కానే కాదు.
నాన్న సలహాలు
అంతా అయ్యాక సిద్దార్థ్ సర్, నిర్మాత ఆదిత్య చోప్రా సర్ నాన్నకు సినిమా చూపించారు. తనకు సినిమా నచ్చింది. అలాగే కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిలో కొన్ని సలహాలు తీసుకుని పాటించారు. మరికొన్ని లైట్ తీసుకున్నారు. ఆయన కూడా మా సినిమాలో మరీ అంత జోక్యం చేసుకోలేదు. కానీ మాకేదైనా డౌట్ ఉందంటే మాత్రం దాన్ని టక్కున తీర్చేవారు' అని జునైద్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ‘ఏం జరిగిందో మీకే తెలియాలి'.. తిరుమలలో నటి హేమ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment