బాలీవుడ్‌లోకి ఆమిర్‌ కొడుకు ఎంట్రీ! | Aamir Khan Son Junaid Khan Debut FilmGoes On Floors | Sakshi
Sakshi News home page

ఆమిర్‌ తనయుడు మహారాజా

Published Tue, Feb 16 2021 9:02 AM | Last Updated on Tue, Feb 16 2021 10:37 AM

Aamir Khan Son Junaid Khan Debut FilmGoes On Floors - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జునైద్‌ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా చిత్రీకరణ సోమవారం ముంబైలో ప్రారంభం అయింది. ‘మహారాజా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ సంస్థ నిర్మిస్తోంది. సిద్ధార్థ్‌ పి. మల్హోత్ర దర్శకత్వం వహిస్తున్నారు. 1862లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జర్నలిస్ట్‌ పాత్రలో జునైద్‌ కనిపించనున్నారు. సినిమాల్లోకి రావడానికి ముందు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా నటనలో శిక్షణ తీసుకున్నారు జునైద్‌. 

కాగా ఇప్పటికే అమీర్ ఖాన్ కుమారుడు కొన్నేళ్లుగా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. జునైద్ మూడేళ్లుగా థియేటర్ ఆర్టిస్టుగా తన సత్తా చూపిస్తున్నాడు. కేవలం అమీర్ ఖాన్ బ్యాగ్రౌండ్‌తో కాకుండా నటుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చూస్తున్నాడు జునైద్. లాస్ ఏంజిల్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ పూర్వ విద్యార్థిగానూ అతడికి గుర్తింపు ఉంది. ఏ ఫార్మింగ్ స్టోరీ, ఏ ఫ్యూ గుడ్ గుడ్ మెన్, మెడియా, బోన్ ఆఫ్ కన్టెన్షన్ లాంటి ప్రఖ్యాత నాటకాల్లో జునైద్ నటించాడు. ఇంత శిక్షణ అనంతరం జునైద్ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇరా, జునైద్ ఖాన్ విషయానికొస్తే.. వీరిద్దరు ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త పిల్లలు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత కిరణ్ రావు‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికి ఆజాద్ రావు ఖాన్ అనే తనయుడు ఉన్నాడు.
చదవండి: ఫోన్‌ వాడేది లేదంటున్న అమీర్‌ ఖాన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement