లాల్‌ సింగ్‌ చద్దా.. నన్ను ఆడిషన్‌ చేశారు.. కానీ!: ఆమిర్‌ తనయుడు | Junaid Khan: I Had Actually Auditioned for Laal Singh Chaddha | Sakshi
Sakshi News home page

నేను చేయాల్సిన మూవీ.. నాన్న చేతిలోకి వెళ్లింది: ఆమిర్‌ కుమారుడు

Published Wed, Jul 3 2024 10:58 AM | Last Updated on Wed, Jul 3 2024 11:06 AM

Junaid Khan: I Had Actually Auditioned for Laal Singh Chaddha

ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా. ఇందులో నాగచైతన్య ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఆమిర్‌ చేయాల్సిన పాత్ర కోసం ముందుగా తనను ఆడిషన్‌ చేశారని చెప్తున్నాడు ఆయన తనయుడు, నటుడు జునైద్‌ ఖాన్‌. జునైద్‌ ఇటీవలే మహారాజ్‌ అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నిజానికి లాల్‌ సింగ్‌ చద్దా కోసం నన్ను ఆడిషన్‌ చేశారు. ఈ మూవీ నేను చేస్తే బాగుండని నాన్న ఎంతగానో అనుకున్నారు. కానీ కుదరలేదు అని తెలిపాడు.

కుమారుడికి స్క్రీన్‌ టెస్ట్‌
ఈ విషయాన్ని ఆమిర్‌ గతంలోనూ వెల్లడించాడు. లాల్‌ సింగ్‌ చద్దా కోసం మొదటగా జునైద్‌కు స్క్రీన్‌ టెస్ట్‌ చేశారని తెలిపాడు. కాగా లాల్‌ సింగ్‌ చద్దాలో కరీనా కపూర్‌, మోనా సింగ్‌ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో వచ్చిన ఫారెస్ట్‌ గంప్‌ అనే హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

మహారాజ్‌ సినిమా..
మహారాజ్‌ మూవీ విషయానికి వస్తే.. 1862లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సిద్దార్థ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించగా యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌ నిర్మించింది. జైదీప్‌ అహ్లావత్‌, షాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్‌ హీరో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement