మంచు పండగలో బిజీగా గడుపుతున్నారు సాయి పల్లవి. మంచు పండగ ఏంటీ అంటే.. జపాన్‌లోని సపోరోప్రాంతంలో ఈ పండగ జరుగుతుంటుంది. ఇప్పుడు అక్కడే ఉన్నారు సాయి పల్లవి. ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా వెళ్లారు. ఈ ఇద్దరూ జంటగా ఓ హిందీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ సపోరోలో జరుగుతోంది. అక్కడ జరుగుతున్న మంచు పండగలో షూట్ చేస్తున్నారు.
ఈ సెట్స్‌లోని వర్కింగ్ స్టిల్స్ కొన్ని వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటివరకూ సపోరోలో ఏ సినిమా చిత్రీకరణ జరగలేదు. తొలిసారి ఈ చిత్రానికి అనుమతి తెచ్చుకున్నారు. సునిల్ పాండే దర్శకత్వంలో సొంత ప్రోడక్షన్‌లో ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... ‘మహరాజ్’ అనే చిత్రం ద్వారా జునైద్ ఖాన్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం సాయి పల్లవి కాంబినేషన్‌లో చేస్తున్నది జునైద్‌కి రెండో సినిమా. ఇక సాయి పల్లవికి హిందీలో ఇది తొలి చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment