ఇస్లామాబాద్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన విషయం తెలిసిందే. సోమవారం చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ మెగా టోర్నీకి పాక్ జట్టును ప్రకటించాడు. అంతగా ఆకట్టుకోలేకపోయిన పేస్ ఆల్‌రౌండర్ ఫహీమ్ ఆష్రఫ్, పేసర్ జునైద్ ఖాన్‌తో పాటు అబిద్ అలీకి సెలక్షన్ కమిటీ ఉద్వాసన పలికింది.
వరల్డ్‌కప్ జట్టు నుంచి తప్పించడంతో పాక్ బౌలర్ జునైద్ ఖాన్ సెలక్టర్లపై వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రస్తుతం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అని ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు. ట్వీట్‌తో పాటు నోటికి నల్లప్లాస్టర్ వేసుకున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 18వ తేదీన పాక్ ప్రకటించిన వరల్డ్‌కప్ జట్టులో జునైద్ చోటు దక్కించుకోగా, ఇంగ్లండ్‌పై పేలవ ప‍్రదర్శన అనంతరం మూడు మార్పులు చేసింది పాక్ సెలక్షన్ కమిటీ.
(ఇక్కడ చదవండి: పాక్ జట్టులో మూడు మార్పులు)
Comments
Please login to add a commentAdd a comment