కోహ్లిపై పాక్‌ మాజీ పేసర్‌ ట్రోలింగ్‌.. మండిపడుతున్న ఫ్యాన్స్‌! | Pakistan Pacer Another Dig At Kohli After Flop Show Against MI In IPL 2024 | Sakshi
Sakshi News home page

Virat Kohli: కోహ్లిని మరోసారి దారుణంగా ట్రోల్‌ చేసిన పాక్‌ మాజీ పేసర్‌!

Published Fri, Apr 12 2024 6:16 PM | Last Updated on Fri, Apr 12 2024 7:05 PM

Pakistan Pacer Abother Dig At Kohli After Flop Show Against MI IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఐదో పరాజయాన్ని నమోదు చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. వాంఖడే మ్యాచ్‌లో తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు.

ముంబై పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో ముంబైతో మ్యాచ్‌లో కోహ్లి వైఫల్యాన్ని ఉద్దేశించి పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ జునైద్‌ ఖాన్‌ దారుణంగా ట్రోల్‌ చేశాడు. 

ఎక్స్‌ వేదికగా.. ‘‘స్ట్రైక్‌రేటు 33.33’’ అంటూ కోహ్లి బ్యాటింగ్‌పై జునైద్‌ ఖాన్‌ విమర్శలు సంధించాడు. కాగా జునైద్‌ కోహ్లిపై సెటైర్లు వేడయం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రాజస్తాన్‌ రాయల్స్‌తో విరాట్‌ కోహ్లి సెంచరీ చేసినపుడు కూడా ఇలాగే కామెంట్‌ చేశాడు.

‘‘ఐపీఎల్‌ చరిత్రలో స్లోయెస్ట్‌ 100 సాధించినందుకు శుభాభినందనలు’’ అంటూ జునైద్‌ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. భారత గడ్డపై ఐపీఎల్‌లో శతకం చేసేందుకు అత్యధిక బంతులు తీసుకున్న బ్యాటర్‌ కోహ్లినే కావడం గమనార్హం.

ఓవరాల్‌గా మనీశ్‌ పాండే(2009- సెంచూరియన్‌)తో కలిసి ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జునైద్‌ ఖాన్‌ కోహ్లిని ఇలా విమర్శించాడు. కాగా జునైద్‌ ఖాన్‌ ట్వీట్‌పై కోహ్లి ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ప్రతి ఒక్క మ్యాచ్‌లో ఏ ఆటగాడూ రాణించలేడని.. అటెన్షన్‌ కోసమే కోహ్లి పేరు వాడుకుంటున్నాడంటూ ఫైర్‌ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. కోహ్లి శతకం సాధించిన రాజస్తాన్‌తో మ్యాచ్‌లో.. తాజాగా అతడు విఫలమైన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయింది. ఇక పదిహేడో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 319 పరుగులు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement