ఆమిర్ ఖాన్–రీనా దత్తాల తనయుడు జునైద్ ఖాన్, బోనీ కపూర్–శ్రీదేవిల రెండో కుమార్తె ఖుషీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కోసం ప్రేమలో పడ్డారు. ఈ ఇద్దరూ జంటగా రానున్న రొమాంటిక్ కామెడీ మూవీ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు. ‘లవ్‌యాపా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాంథమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది.
‘లవ్‌యాపా’ ప్రేమకథా చిత్రం కావడంతో ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) టార్గెట్‌గా ఈ సినిమా విడుదలను ప్లాన్ చేశారు. ఓ వారం రోజుల ముందే... అంటే ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. ప్రేమ... ఇష్టం... ఈ రెండింటి మధ్యలో ఉండే భావోద్వేగాల సమాహారంతో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఇదిలా ఉంటే జునైద్, ఖుషీ... ఈ ఇద్దరికీ ఇది రెండో చిత్రం. ‘మహారాజా’ చిత్రం ద్వారా జునైద్ ఈ ఏడాది పరిచయం కాగా... గత ఏడాది నటించిన ‘ది ఆర్చీస్’ చిత్రంతో ఖుషీ పరిచయం అయ్యారు. అయితే ఈ రెండు చిత్రాలూ ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment