లాహోర్: ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ సీనియర్ పేసర్ జునైద్ ఖాన్ గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. సోమవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో జునైద్ విఫలమయ్యాడు.
జునైద్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. ప్రపంచ కప్లో ఆడనందుకు క్షమించాల్సిందిగా అభిమానులను కోరాడు. కాగా పాకిస్థాన్ ఇంతకుముందు స్పిన్నర్ సయీద్ అజ్మల్, పేసర్ ఉమర్ గుల్ సేవలను కోల్పోయింది. బౌలింగ్ శైలి సరిగాలేనందున అజ్మల్పై ఐసీసీ వేటువేయగా, గుల్ గాయకారణంగా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా జునైద్ వైదొలగడంతో పాక్ బౌలింగ్ విభాగం ప్రపంచ కప్ ముందే బలహీనపడినట్టయింది.
పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ
Published Mon, Feb 2 2015 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement
Advertisement