దారుణం: కేన్సర్‌ బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌ | Cancer patient gang-raped, seeks help from commuter who rapes her again | Sakshi
Sakshi News home page

దారుణం: కేన్సర్‌ బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌

Published Mon, Dec 11 2017 3:15 AM | Last Updated on Mon, Dec 11 2017 8:16 AM

Cancer patient gang-raped, seeks help from commuter who rapes her again - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మృగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఓ మైనర్‌ బాలికపై శనివారం ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితురాలు సాయం కోసం అర్థించడంతో అటుగా వచ్చిన మరో వ్యక్తి మానవత్వం మరిచి ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. చివరికి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని సరోజినీనగర్‌లో ఉంటున్న బాధితురాలు(15) రక్తకేన్సర్‌తో బాధపడుతోంది.

యువతికి పరిచయస్తుడైన శుభమ్‌ అనే వ్యక్తి శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో నూడుల్స్‌ తినేందుకు ఆమెను ఆహ్వానించడంతో బైక్‌పై అతనితో బయలుదేరింది. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన శుభమ్, తన స్నేహితుడు సుమిత్‌తో కలిసి ఆమెను బంధించాడు. ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం యువతి సాయం కోసం అర్థించడంతో.. అటుగా వెళ్తున్న వీరేంద్ర యాదవ్‌ అనే వ్యక్తి ఆమెపై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వీరేంద్ర యాదవ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శుభమ్, సుమిత్‌ల కోసం గాలింపు చేపట్టామన్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులూ సరోజినీనగర్‌కు చెందిన వారేనన్నారు.  

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
హిస్సార్‌: హరియాణాలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. ఉక్లానాలోని ఆరేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారం చేసి ఆపై ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు. హిస్సార్‌ పోలీసుల కథనం ప్రకారం... ఫతేబాద్‌ జిల్లా తొహనా పట్టణానికి చెందిన దంపతులు  కూలీ పనులు చేస్తుంటారు. రైల్వే లైన్‌ పక్కనే నివసించే వీరికి ఇద్దరు సంతానం. అందులో ఆరేళ్ల చిన్నారి శుక్రవారం రాత్రి తన తల్లి, అక్కతో కలసి నిద్రిస్తుం డగా..గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement