పుణె: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు యథేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ. ముంబయిలో ఫోటో జర్నలిస్టులపై అత్యాచార ఘటనలు మరువకముందే తాజాగా మరో దారుణం పుణే ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ మహిళపై వార్డు బాయ్, సెక్యూరిటీ కలిసి అత్యాచారానికి ఒడగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెను వార్డు షిఫ్ట్ చేయాల్సి రావడంతో అప్పటికే కన్నేసిన కామాంధులు అవకాశం ఎదురుచూశారు. ఆమెను వార్డ మార్చే సమయంలో ఇద్దరు యువకులు కలిసి లిఫ్ట్ లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.