ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన | AP Photo journalists condemn Mumbai gang rape | Sakshi
Sakshi News home page

ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన

Published Fri, Aug 23 2013 1:36 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన

ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన

విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ ఆవరణలో సామూహిక అత్యచారం జరగడాన్ని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు.. అందునా ముఖ్యంగా మహిళా పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఏపీపీజేఏ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఫొటో జర్నలిస్టులతో పాటు పలువురు పాత్రికేయులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, మరోవైపు ముంబైలో ఫొటో జర్నలిస్టుల సంఘాలు మౌన నిరసన తెలిపాయి. మహారాష్ట్ర వ్యాప్తంగాను, ముంబై మహానగరంలోను శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందని ఈ సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్లను కలిసి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement