దుమారం రేపిన రాజ్ వ్యాఖ్యలు | Raj Thackeray'Controversial comments | Sakshi
Sakshi News home page

దుమారం రేపిన రాజ్ వ్యాఖ్యలు

Published Sat, Aug 24 2013 11:08 PM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

Raj Thackeray'Controversial comments

న్యూఢిల్లీ: ఎమ్మెన్నెస్ అధినేత రాజ్‌ఠాక్రే ఉత్తరాదినుంచి ముంబైకి వలస వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వలసవచ్చే వారి ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం వంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలు పార్టీలు తప్పుబట్టాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘ స్వలబ్ధికోసం రాజ్‌ఠాక్రే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. మీరు ఇలా ఎలా అంటారు.ముంబై పోలీసులు ఒక నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులను సైతం పట్టుకునే అవకాశముంది’ అని అన్నారు. 
 
 సమంజసం కాదు: నిరుపం
 అదే పార్టీకి చెందిన మరో నాయకుడు సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ముంబై నగరంలో ఇటువంటి సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎవరి హృదయాలను గాయపరచకూడదు. కొందరు నేరగాళ్ల దురాగతాల కారణంగా మొత్తం సమాజంపై నిందలు మోపలేం’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement