అల్లరి మూక దాడి నుంచి ముస్లిం యువకుడిని కాపాడుతున్న పోలీసధికారి గంగాదీప్ సింగ్
రామ్ నగర్, ఉత్తరాఖండ్ : ప్రేమకు, మానవత్వం చాటుకోవడానికి మతం అడ్డురాదు. వాటికి తెలిసిందల్లా ప్రేమను పంచడం... సాయం చేయడమే. ఉత్తరాఖండ్‌లో ఈ రెండు సంఘటనలు ఏక కాలంలో జరిగాయి. తమ మతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడన్న కారణంగా ముస్లిం యువకుడిపై కొందరు హిందూ యువకులు దాడికి దిగారు. ఈ సంఘటన రామ్‌పూర్ గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగింది. ఈ గొడవ గురించి ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ గంగాదీప్ సింగ్‌కు సమాచారం అందించారు స్థానికులు.
సింగ్ ఆ ప్రదేశానికి చేరుకునే సరికి హిందూ యువకులు ముస్లిం యువకుడిని కొట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇది గమనించిన సింగ్ బాధిత యువకుడిని కాపాడటం కోసం ముందుకు వెళ్లి ఆ యువకుడికి అడ్డుగా ఉండి కాపాడాడు. ఈ తతంగాన్ని ఒకరు ఫోన్‌లో రికార్డు చేసి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా గంగాదీప్ సింగ్‌ను అభినందనలతో ముంచేత్తుతున్నారు. ‘పోలీస్ సాబ్ మానవత్వానికి మతంతో పని లేదని చాటారు...మీరు సూపర్ సార్’ సోషల్ మీడియాలో హీరోను చేస్తూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment