భువనగిరి : ఉపాధి హామీ పథకంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జిల్లాకు కేంద్ర బృందం వారం రోజుల్లో రానుంది. ఉపాధి హామీ పథకంలో ఉత్తమ ఫలితాలను సాధించి జాతీయస్థాయిలో ఎంపికైన 11 జిల్లాల్లో మన జిల్లా ఉంది. ఇటీవల కలెక్టర్ చిరంజీవులు ఢిల్లీ వెళ్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2013- 14 ఆర్థిక సంవత్సరానికి పనులు జరిగిన తీరు, రికార్డుల నిర్వహణ, కూలి చెల్లింపు, పనుల ద్వా రా జరిగిన అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
ఇందులో మెరుగైన ఫలితాలను సాధించినట్లు అధికారులు నివేదికలు ఉండడంతో వాటిని అధ్యయనం చేయడానికి కేంద్రబృందం వచ్చే వారంలో రాబోతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించనుంది. ప్రధానంగా పండ్లతోటల పెంపకం, పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యా ర్డు, టేకు మొక్కల పెంపకం తదితర పనులు జరిగిన తీరును పరిశీలించనున్నారు.
ఇందుకోసం జిల్లా అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. భువ నగిరి మండలం రెడ్డినాయక్ తండాలో హార్టికల్చర్, బొమ్మలరామారం మం డలం జలాల్‌పూర్‌లో పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, ఆలేరు మండలం బహుద్దూర్‌పేటలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డులో జరిగిన పనులను పరిశీలించే అవకాశం ఉంది. ఇవేకాకుండా జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉంది.
బహుద్దూర్‌పేటలో వందశాతం మరుగుదొడ్లు
ఉపాధి హామీకింద ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీంతో ఇప్పటికే పలువురు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అర్ధంతరంగా నిలిపివేశారు. గ్రామ సర్పంచ్ జంపాల దశరథ గ్రామస్తులను ఒప్పించి ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.5 వేల చొప్పున రుణం తీసుకున్న గ్రామస్తులు మిగ తా డబ్బులు నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లు రాగానే డబ్బులు ఇస్తామన్న ఒప్పందంతో వాటిని పూర్తి చేసుకున్నారు.
దీంతోపాటు గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. చెత్త సేకరణకు రిక్షాలను కొనుగోలు చేసి వాటి ద్వారా రోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ గ్రామానికి కేంద్ర అధికారుల బృందం రానుంది.
పరిశీలనకు వచ్చే ఆవకాశం ఉంది : శ్యామల ఏపీడీ, భువనగిరి
ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించడానికి కేంద్ర అధికారు ల బృందం వచ్చే సోమ లేదా మంగళవారాల్లో రానున్నదని సమాచారం. కేంద్ర అధికారులు ఇక్కడ ఉపాధి హామీలో చేపట్టిన పనులను చూడడానికి వస్తున్నారని సమాచారం ఉంది.
ఆదర్శంగా ఉండాలనే : జంపాల దశరథ, సర్పంచ్, బహుద్దూర్ పేట
మా గ్రామం అభివృద్ధితోపాటు, ఆదర్శంగా ఉండాలనే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు పనులను ఉపాధిహామీలో చేపట్టాం. ప్రధాన మంత్రి మోదీ చెప్పిన ‘స్వచ్ఛభారత్’ మా ఊర్లో రోజూ జరుగుతోంది.
జిల్లాకు కేంద్ర బృందం
Published Sun, Dec 14 2014 3:33 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement