Central group
-
స్వచ్ఛ సిద్దిపేటకు రాజముద్ర
సిద్దిపేటకు కేంద్ర బృందం రాక బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా గుర్తింపు శివమ్స్ గార్డెన్స్‌లో అభినందన సభ మంత్రి హరీశ్‌రావు చొరవతో లక్ష్యం సిద్దిపేట జోన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్- స్వచ్ఛ తెలంగాణ ప్రక్రియలో భాగంగా సిద్దిపేట మున్సిపాల్టీ మంగళవారం మరో మైలురాయి చేరుకోనుంది. రికార్డుల పరంపరను, విన్నూత ప్రయోగాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీని కేంద్ర ప్రభుత్వ దూతగా వస్తున్న స్వచ్ఛ భారత మిషన్ చీఫ్ రాహుల్ ప్రతాప్ సింగ్ స్వచ్ఛ సిద్దిపేట ధ్రువీకరణ పత్రం అందించనున్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర బృంద ప్రతినిధులు సిద్దిపేట బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా మారిన తీరును, చేపట్టిన సంస్కరణలను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది దరఖాస్తులను, స్వచ్ఛ అవార్డులను పరిశీలనకు వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ రాష్ర్టంలో గుర్తించిన ఐదు మున్సిపాలిటీల్ల సిద్దిపేటకు చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం కేంద్ర క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందంలో సభ్యునిగా ఉన్న స్వచ్ఛ భారత్ మిషన్ (ఓడీఎఫ్) చీఫ్ రాహుల్ ప్రతాప్‌సింగ్ ద్వారా ధువీకరణ పత్రం సిద్దిపేట పట్టణం అందుకోనుంది. స్థానిక శివమ్స్ గార్డెన్లో ఏర్పాటు చేసే అభినందన సభలో కేంద్ర బృందం సిద్దిపేట మున్సిపల్ పాలక వర్గానికి ధ్రువీకరణ పత్రాన్ని అందించనుంది. కేంద్రం 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకోని ప్రధాని చేతుల మీదుగా స్వచ్ఛ భారత్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అప్పట్లో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం చేయూతనివ్వాలని ఆ దిశగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో పథకాన్ని కొనసాగించేందుకు రాష్ర్ట ప్రభుత్వం పక్షాన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు వినతులు అందించారు. ఈ క్రమంలో కేంద్రం స్పందించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి వాటా నిధులను కేటాయించడంతో పట్టణంలో పథకం వేగవంతంగా ముందుకు సాగింది. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. నియోజకవర్గంలో లక్ష్యానికి అనుగుణంగా అనతి కాలంలోనే వందశాతం మరుగుదొడ్లను నిర్మించి 3 అక్టోబర్ 2015న శాసన సభ స్పీకర్ చేతుల మీదుగా దేశంలోనే తొలి బహిరంగ మల విసర్జన రహిత నియోజకవర్గంగా గుర్తింపును రాష్ర్ట ప్రభుత్వ పక్షాన సిద్దిపేటలో అధికారికంగా అందుకుంది. ఈ క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశంలోని కార్పోరేషన్లు, మున్సిపల్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వనించడం స్వచ్చ భారత్ అవార్డుకు సిద్దిపేట మున్సిపల్ పరిశీలనకు ప్రతిపాదనలను అందించారు. ఈ క్రమంలో తెలంగాణలో గుర్తించిన ఐదు మున్సిపాలిటీల్లో అచ్చంపేట, సూర్యాపేట, షాద్‌నగర్, హుజూర్‌నగర్‌తో పాటు సిద్దిపేటను కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డుకు ఎంపిక చేసింది. ముందుగా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ఛీప్ రాహుల్ ప్రతాప్‌సింగ్ ద్వారా సిద్దిపేట మున్సిపల్‌కు ధ్రవీకరణ పత్రాన్ని అందించడంతో బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా సిద్దిపేటకు నేడు రాజముద్ర పడనుంది. -
27న సిద్దిపేటకు కేంద్ర బృందం రాక
సిద్దిపేట జోన్: స్వచ్ఛ భారత్- స్వచ్ఛ తెలంగాణ కింద బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన స్వచ్ఛ సిద్దిపేట పనితీరును పరిశీలించేందుకు ఈ నెల27న కేంద్ర బృందం ప్రతినిధులు సిద్దిపేట పట్టణానికి రానున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమణాచారి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచనల మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం దేశంలోని 40 స్వచ్ఛ పట్టణాలను సందర్శించనున్నట్లు అందులో భాగంగానే ఈ నెల 27న సిద్దిపేటకు కేంద్ర బృందం రానుందన్నారు. ఉదయం 10 గంటలకు స్థానిక శివమ్స్ గార్డెన్లో బృందం సభ్యుల సమక్షంలో అభినందన సభ నిర్వహిస్తామన్నారు. -
సాయం కావాలి
కేంద్ర బృందానికి కరువు పరిస్థితులను చెప్పిన జిల్లా అధికారులు జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం కరువు నివేదిక సమర్పించిన జిల్లా కలెక్టర్ చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కరువు పరిస్థితులను గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. తొలుత రామానంద్, వదనాసింఘాల్, శ్రీవాత్సవతో కూడిన బృందం స్థానిక ఆర్అండ్బీ కార్యాలయంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన కరువుపై ఫొటోప్రదర్శనను తిలకించింది. కలెక్టర్‌తోపాటు వ్యవసాయ, హార్టికల్చర్, సిరికల్చర్, పశుసంవర్థక, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలోని కరువు పరిస్థితులను వివరించారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటాయని చెప్పారు. సాధారణ సాగులో సగం కూడా పంటలు సాగు కాలేదని వివరించారు. అరకొరగా వేసిన పంటలు నిలువునా ఎండిపోయాయన్నారు. సాగునీరుతోపాటు తాగునీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. పశువులకు తాగునీటితోపాటు గ్రాసం అందే పరిస్థితి లేదన్నారు. 2వేల గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పనులు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో సాయం అందేలా చూడాలని వారు కేంద్ర బృందాన్ని కోరారు. అనంతరం కరువు బృందం జిల్లాలోని పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ప్రాంతాల్లో పర్యటించి అడుగంటిన భూగర్భ జలాలు, ఒట్టిపోయిన బోరుబావులు, ఎండిపోయిన పంటలు, తాగునీటి ఇబ్బందులు పరిశీలించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి కరువు పరిస్థితులను తెలుసుకున్నారు. కరువు పరిస్థితిపై కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నివేదిక సమర్పించారు. కరువు నివేదిక ఇదే : తీవ్రవర్షాభావం: జిల్లాలో సాధారణ వర్షపాతం 933.9 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 640.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2014-15కు గాను జిల్లాలో 42 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. తగ్గిన పంటల సాగు: గత ఖరీఫ్‌లో జిల్లాలో 2,15,358 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సిఉండ గా, కరువు పుణ్యమా అని 1,91,629 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు అయ్యాయి. ఈ లెక్కన 23,729 హెక్టార్లు సాగుకు నోచుకోలేదు. రబీ సీజన్లో 50 శాతం విస్తీర్ణంలో కూడా పంటలు సాగు కాలేదు. తాగునీటి కష్టాలు: జిల్లాలో 18,776 చేతిపంపులు ఉండగా, 3,179 సీజనల్‌గా మారాయి. 8,441 పీడబ్ల్యూఎస్ పథకాలుండగా, 1483 సీజనల్‌గా మా రాయి. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. 90శాతం తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికే 2,061 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 318 గ్రామాలకు టైఅప్ బోర్ల ద్వారా ప్రభుత్వమే నీటిని సరఫరా చేస్తోంది. రాబోయే కాలంలో మరో 500 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి రావొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క నీటి సరఫరాకే నెలకు రూ.4 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక జిల్లాలోని దాదాపు 9లక్షల పశువులకు సైతం తాగునీటి సరఫరా చేయాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అటుగంటిన భూగర్భజలాలు: జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటాయి. రోజురోజుకూ మరింతగా తగ్గిపోతున్నాయి. కుప్పం, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ప్రాంతాల్లో పడమటి మండలాల్లో 1500 అడుగుల లోతుకు బోరుబావులు తవ్వినా నీళ్లుపడే పరిస్థితి లేదు. పెరిగిన వలసలు: వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు పొట్టచేతపట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తోంది. కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళుతున్నారు. కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో వలసలు పెరిగాయి. కేంద్ర సాయం అందించాలని కోరాం: సిద్ధార్థ్‌జైన్, కలెక్టర్ కరువు తీవ్రత నేపథ్యంలో జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రసాయం అందేలా చూడాలని కరువు బృందాన్ని కోరినట్లు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విలేకరులకు వివరించారు. గురువారం ఉదయం స్థానిక రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. ఖరీఫ్‌తో పాటు రబీలోనూ పంటల సాగు పూర్తిగా తగ్గిందని, 42 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని కరువు బృందానికి తెలిపినట్లు చెప్పారు. ఇప్పటికే 2వేల గ్రామాలకు తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందనే విషయాన్ని కరువు బృందానికి వివరించినట్లు తెలిపారు. నీటి సరఫరాకు సంబంధించిన ఓచర్స్ సైతం కరువు బృందానికి చూపామన్నారు. వర్షాభావంతో 50వేల ఎకరాల్లో పంటల సాగు తగ్గిన విషయాన్ని చెప్పామన్నారు. వేరుశెనగ పంట 50 శాతం దిగుబడి కూడా రాలేదన్నారు. జిల్లాలో పశువులకు సైతం తాగునీటితోపాటు గ్రాసం, దాణా అందిస్తున్నామన్నారు. కేంద్ర సాయం అందేలా చూడాలని కరువు బృందాన్ని కోరినట్లు కలెక్టర్ చెప్పారు. -
జిల్లాకు కేంద్ర బృందం
భువనగిరి : ఉపాధి హామీ పథకంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జిల్లాకు కేంద్ర బృందం వారం రోజుల్లో రానుంది. ఉపాధి హామీ పథకంలో ఉత్తమ ఫలితాలను సాధించి జాతీయస్థాయిలో ఎంపికైన 11 జిల్లాల్లో మన జిల్లా ఉంది. ఇటీవల కలెక్టర్ చిరంజీవులు ఢిల్లీ వెళ్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2013- 14 ఆర్థిక సంవత్సరానికి పనులు జరిగిన తీరు, రికార్డుల నిర్వహణ, కూలి చెల్లింపు, పనుల ద్వా రా జరిగిన అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మెరుగైన ఫలితాలను సాధించినట్లు అధికారులు నివేదికలు ఉండడంతో వాటిని అధ్యయనం చేయడానికి కేంద్రబృందం వచ్చే వారంలో రాబోతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించనుంది. ప్రధానంగా పండ్లతోటల పెంపకం, పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యా ర్డు, టేకు మొక్కల పెంపకం తదితర పనులు జరిగిన తీరును పరిశీలించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. భువ నగిరి మండలం రెడ్డినాయక్ తండాలో హార్టికల్చర్, బొమ్మలరామారం మం డలం జలాల్పూర్లో పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, ఆలేరు మండలం బహుద్దూర్పేటలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డులో జరిగిన పనులను పరిశీలించే అవకాశం ఉంది. ఇవేకాకుండా జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉంది. బహుద్దూర్పేటలో వందశాతం మరుగుదొడ్లు ఉపాధి హామీకింద ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీంతో ఇప్పటికే పలువురు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అర్ధంతరంగా నిలిపివేశారు. గ్రామ సర్పంచ్ జంపాల దశరథ గ్రామస్తులను ఒప్పించి ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.5 వేల చొప్పున రుణం తీసుకున్న గ్రామస్తులు మిగ తా డబ్బులు నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లు రాగానే డబ్బులు ఇస్తామన్న ఒప్పందంతో వాటిని పూర్తి చేసుకున్నారు. దీంతోపాటు గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. చెత్త సేకరణకు రిక్షాలను కొనుగోలు చేసి వాటి ద్వారా రోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ గ్రామానికి కేంద్ర అధికారుల బృందం రానుంది. పరిశీలనకు వచ్చే ఆవకాశం ఉంది : శ్యామల ఏపీడీ, భువనగిరి ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించడానికి కేంద్ర అధికారు ల బృందం వచ్చే సోమ లేదా మంగళవారాల్లో రానున్నదని సమాచారం. కేంద్ర అధికారులు ఇక్కడ ఉపాధి హామీలో చేపట్టిన పనులను చూడడానికి వస్తున్నారని సమాచారం ఉంది. ఆదర్శంగా ఉండాలనే : జంపాల దశరథ, సర్పంచ్, బహుద్దూర్ పేట మా గ్రామం అభివృద్ధితోపాటు, ఆదర్శంగా ఉండాలనే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు పనులను ఉపాధిహామీలో చేపట్టాం. ప్రధాన మంత్రి మోదీ చెప్పిన ‘స్వచ్ఛభారత్’ మా ఊర్లో రోజూ జరుగుతోంది.