27న సిద్దిపేటకు కేంద్ర బృందం రాక | cetral group came to siddipet on 27th | Sakshi
Sakshi News home page

27న సిద్దిపేటకు కేంద్ర బృందం రాక

Published Sat, Sep 24 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

cetral group came to siddipet on 27th

సిద్దిపేట జోన్‌: స్వచ్ఛ భారత్‌- స్వచ్ఛ తెలంగాణ కింద బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన స్వచ్ఛ సిద్దిపేట పనితీరును పరిశీలించేందుకు ఈ నెల27న  కేంద్ర బృందం ప్రతినిధులు  సిద్దిపేట పట్టణానికి రానున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచనల మేరకు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌  ఇండియా బృందం దేశంలోని 40 స్వచ్ఛ పట్టణాలను సందర్శించనున్నట్లు  అందులో భాగంగానే ఈ నెల 27న సిద్దిపేటకు కేంద్ర బృందం రానుందన్నారు. ఉదయం 10 గంటలకు స్థానిక శివమ్స్‌ గార్డెన్‌లో బృందం సభ్యుల సమక్షంలో అభినందన సభ నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement