పోలవరం నిధులపై ముందడుగు | A step forward on Polavaram funds | Sakshi
Sakshi News home page

పోలవరం నిధులపై ముందడుగు

Published Fri, May 26 2023 3:52 AM | Last Updated on Fri, May 26 2023 1:01 PM

A step forward on Polavaram funds - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రాజెక్టు తొలిదశ పూర్తికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.16,952.07 కోట్లతో పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను మదింపు చేసి.. త్వరితగతిన నివేదిక ఇవ్వాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఆదేశించారు.

ఆ నివేదిక ఆధారంగా కేంద్ర మంత్రిమండలికి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను పంపుతామన్నారు. దానిపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుందని చెప్పారు. నిధుల సమస్యను పరిష్కరించడం ద్వారా పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యాలయంలో పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుస్విందర్‌సింగ్‌ వోరా, సీడబ్ల్యూసీ వాటర్‌ ప్లానింగ్, ప్రాజెక్టŠస్‌ విభాగం సభ్యులు నవీన్‌కుమార్‌ తదితరులతో ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

షెడ్యూలు ప్రకారం పనులు.. 
తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌ వివరించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తిచేసి.. గోదావరి ప్రవాహాన్ని 2021, జూన్‌ 11న స్పిల్‌ వే మీదుగా ఏపీ ప్రభుత్వం మళ్లించిందన్నారు.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి ఇసుక తిన్నెలు కో తకు గురై ఏర్పడిన అగాధాలను పూడ్చివేసి, యథాస్థితికి తెచ్చే పనులు ప్రారంభమయ్యాయని.. వరదలు వచ్చేలోగా ఆ పనులు పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టారని వివరించారు.

ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించే పనులు ప్రారంభిస్తారని.. వాటికి సమాంతరంగా గ్యాప్‌–­1­లో ప్రధా న డ్యామ్‌ పనులు చేపడతారని చెప్పారు. షె డ్యూలు ప్రకారం ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందన్నారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిం చే ప నులను కూడా వేగవంతం చేసిందన్నారు. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టు పనులు జరుగుతుండటంపై పంకజ్‌కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 

సమగ్రంగా పరిశీలించి నివేదిక.. 
పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను  కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌  ఆదేశించారు. ప్రధానంగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాల సంఖ్యను పక్కాగా తేల్చి.. ఆ గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పిం చడం, భూసేకరణకు ఎంత నిధులు అవసరమో తేల్చాలని దిశానిర్దేశం చేశారు.

ప్రధాన డ్యామ్, కుడి, ఎడమ కాలువలు.. తొలిదశలో ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టాల్సిన డిస్ట్రిబ్యూటరీలకు ఎంత వ్యయం అవసరమో తేల్చాలని  సూచించారు. భూసేకరణ, నిర్వాసితులకు  పునరావాసం కల్పిం చడం.. ప్రధాన డ్యామ్, కాలువల పనులకు అయ్యే వ్యయాన్ని విడివిడిగా లెక్కించి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరా పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు స్పందిస్తూ.. సవరించిన అంచనా వ్యయాన్ని తేల్చి, నివేదిక ఇస్తామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement