11న ‘సాక్షి’ ఉద్యోగ మేళా | sakshi jobmela on 11th | Sakshi
Sakshi News home page

11న ‘సాక్షి’ ఉద్యోగ మేళా

Published Wed, Nov 9 2016 11:41 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

sakshi jobmela on 11th

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ప్రముఖ దినపత్రిక సాక్షిలో సేల్స్‌ ప్రమోటర్స్‌ ఉద్యోగాల కోసం ఈ నెల 11న శుక్రవారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ వెలుగు పీడీ బుధవారం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేళా గుత్తి వెలుగు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుందన్నారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు.

జీతం రూ.10 వేల నుంచి రూ.13,280 వరకు చెల్లిస్తారని, వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, బళ్లారి ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇంటర్వూ్యకు హాజరయ్యేవారు బయోడేటా ఫారంతోపాటు రేష¯ŒSకార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్, 3 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు 77021 00237 నెంబరులో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement