‘అనురాగ్‌’లో జాబ్‌మేళా | Jobmela in Anurag college | Sakshi
Sakshi News home page

‘అనురాగ్‌’లో జాబ్‌మేళా

Published Thu, Sep 22 2016 6:46 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

‘అనురాగ్‌’లో జాబ్‌మేళా - Sakshi

‘అనురాగ్‌’లో జాబ్‌మేళా

ఘట్‌కేసర్‌: విద్యతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎంతగానో కృషి చేస్తున్నామని మండలంలోని వెంకటాపూర్‌ అనురాగ్‌ విద్యా సంస్థల ప్రిన్సిపాల్‌ ముత్తారెడ్డి అన్నారు. కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. పరిశ్రమలకు అవసరయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలన్నారు. ఆస్మోమిసిస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ వారు జాబ్‌మేళాకు హాజరయ్యారు. 430 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు. గ్రూప్‌ డిస్కషన్‌, ఆన్‌లైన్‌, టెట్నికల్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసుకున్నారు. కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి మమత, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌, సుబావుద్దీన్‌, అనురాగ్‌ విద్యాసంస్థల ఏఓ ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement