రూ.530 కోట్ల రుణాల అందజేత
Published Wed, Feb 5 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
నిడదవోలు, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా 68 వేల స్వయం సహాయక సంఘాలకు 2013-14లో రూ. 672 కోట్ల వడ్డీలేని రుణాలు అం దించాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు రూ. 530 కోట్లు అందజేశామని డీఆర్‌డీఏ పీడీ వై.రామకృష్ణ తెలిపారు. నిడదవోలు డీఆర్‌డీఏ కార్యాలయంలో నాలుగు మండలాల పరిధిలో నిరుద్యోగులకు మంగళవా రం నిర్వహించిన జాబ్‌మేళాను ఆ యన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మిగిలిన రుణాలను ఈనెలాఖరులోగా అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్త రేషన్‌కార్డులలో తప్పొప్పుల కారణంగా అమ్మహస్తం పథకంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
బంగారుతల్లిలో 5,320 మందికి లబ్ధి
జిల్లాలో 7,500 మందికి బంగారు తల్లి పథకాన్ని వర్తింపజేయాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు 5,320 మంది చి న్నారులకు నగదు అందించామని తె లిపారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు.
పింఛన్ల పంపిణీకి అదనపు సిబ్బంది
వృద్ధాప్య, వితంతు, వికలాంగ పిం ఛన్లు పోస్టల్ శాఖ ద్వారా అందించేందుకు ప్రక్రియ పూర్తయిందని చె ప్పారు. 500 మంది పింఛన్‌దారులు ఉన్న ప్రాంతాల్లో అదనంగా మరో సి బ్బందిని నియమిస్తామన్నారు. జిల్లా లో 3,41,560 మంది పింఛన్‌దారులున్నారని తెలిపారు.
2,964 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
జిల్లావ్యాప్తంగా 72 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా కేవలం 12 కేంద్రాల్లో 2,964 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని రామకృష్ణ తెలిపారు. ఈమేరకు రైతులకు రూ. 39 లక్షలు అందజేశామన్నారు. 6 మండలాల్లో ఏపీఎం పోస్టులు, నరసాపురం, ఏలూరులో ఏరియా కో-ఆర్డినేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాజీవ్ యువకిరణాల పథకంలో భాగంగా ఇప్పటి వరకు 5,900 మందికి వివిధ కేటగిరిలో శిక్షణ ఇవ్వగా 2,800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. జిల్లా జాబ్స్ మేనేజర్ కె.రవీంద్రబాబు, ఏరియా కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, ఏపీఎం మేరీరత్నం పాల్గొన్నారు.
Advertisement
Advertisement