Interest-free loans
-
చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. చదవండి: AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ అంతకుముందు.. ఈ పథకం ద్వారా రుణం పొంది, సకాలంలో అసలు మొత్తాన్ని చెల్లించిన వారితో పాటు కొత్త వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు తోడ్పాటునందించాలని కూడా రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది చిరు వ్యాపారులకు సీఎం జగన్ చేతుల మీదుగా వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
వడ్డీలేని రుణాలనడం సిగ్గుచేటు
► సర్కార్‌పై ‘స్త్రీనిధి’ మహిళల మండిపాటు ► ఎజెండాను చదవకుండానే ఆమోదించమంటే ఎలాగని ఎండీపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన స్త్రీనిధి బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో మహిళా సంఘాల సంక్షేమంపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పలువురు మహిళా సమాఖ్యల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు. ఎజెండా అంశాలను ముందుగా తెలపకుండానే, సమావేశంలోనే ఇచ్చి హడావుడిగా ఆమోదం తెలపాలని స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. వేదికపైన అధ్యక్షురాలు చదువుతున్న అంశాలకు, తమ చేతికి అందించిన ఎజెండా కాపీలోని అంశాలకు పొంతన లేదని మహిళలు దుయ్యబట్టారు. రూ.37.25 కోట్ల ఆదాయం వచ్చిందంటూ ప్రభుత్వానికి రూ.3.48 కోట్ల డివిడెంట్ ఇచ్చిన ఎం.డి. విద్యాసాగర్‌రెడ్డి, రూ.2.50 కోట్ల పెట్టుబడి పెట్టిన తమ జిల్లా సమాఖ్యకు ఏడాదిగా వడ్డీని ఎందుకు చెల్లించలేదని నిజామాబాద్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నిలదీశారు. రెండేళ్లుగా ప్రభుత్వం తన వాటాధనం ఇవ్వకుంటే కిక్కురుమనని అధికారులు, గ్రామ, మండల సమాఖ్యలపై వాటాధనం పేరిట అదనపు భారం మోపడాన్ని పలువురు మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలను చెల్లించేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం, గ్రామ సమాఖ్యల అనుమతి లేకుండానే సహాయకులకు వేతనం ఎలా పెంచిందని ప్రశ్నించారు. ఉపాధిహామీ పనులకు వెళ్లండి: జూపల్లి మరోమారు వాటాధనం చెల్లించడం తమకు అదనపు భారమంటున్న గ్రామ సమాఖ్యల ప్రతినిధులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఉపాధిహామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, కూలీ పనులకు పోతే కుటుంబానికి రూ.15 వేల నుంచి 19 వేల దాకా ఆదాయం వస్తుందని జూపల్లి అన్నారు. త్వరలోనే వడ్డీలను చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి చెప్పారు. సమావేశం ఆమోదించిన అంశాలివే l2017–18 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,585 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.225 కోట్ల రుణాలు lపాడి గేదెల కొనుగోలు కోసం రూ.100 కోట్లు రుణంగా అందించాలని నిర్ణయం lసభ్యుల పిల్లలకు సైకిళ్లు, సభ్యులకు స్మార్ట్ ఫోన్, ఆటో రిక్షా, ట్రాలీల కొనుగోలుకు రుణాలు lఎస్‌హెచ్‌జీ మహిళల కోసం కొత్త బీమా పథకానికి రూపకల్పన, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4 లక్షలు అందేలా పథకం lగతేడాది కన్నా ఒక శాతం అధికంగా 8 శాతం డివిడెండ్‌ను చెల్లించాలని తీర్మానం lరూ.1,000 రుణానికి రూ.4ల సురక్ష ప్రీమియంను 2.50 రూపాయలకు తగ్గించాలని నిర్ణయం వార్షిక రుణ లక్ష్యం రూ.1,810 కోట్లు 2017–18 వార్షిక ఏడాది బడ్జెట్‌ను రూ.2,623 కోట్లుగా ప్రతిపాదించామని, ఇందులో వార్షిక రుణ లక్ష్యాన్ని రూ.1,810 కోట్లుగా నిర్ణయించినట్లు విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. 2016–17 సంవత్సరంలో రుణలక్ష్యాన్ని ఇంతవరకు చేరుకోలేకపోయినా వార్షిక రుణలక్ష్యాన్ని 2 9 శాతం పెంచడం పట్ల మహిళా సమాఖ్యల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
జిల్లాకు వడ్డీలేని రుణాలు విడుదల
రూ. 21.23కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం పెట్టుబడి నిధి కింద మరో రూ. 35.98 కోట్లు కడప కార్పొరేషన్ : జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో ఉండే స్వయం సహాయ సంఘాలకు రూ. 21.23 కోట్లు వడ్డీలేని రుణాలు విడుదలయ్యాయి. అలాగే పెట్టుబడి నిధి (క్యాపిటల్ ఇన్‌క్లూజన్) కింద మరో రూ. 35. 98 కోట్లు విడుదలైంది. ఈ మొత్తం జూన్ 3న స్వయం సహాయ సంఘాల ఖాతాలలో జమ కానుంది. వడ్డీలేని రుణాలు అత్యధికంగా పొందిన జిల్లాలలో వైఎస్ఆర్ జిల్లా ద్వితీయ స్థానంలో ఉండటం విశేషం. ఆధార్నెంబర్లు సరిగా ఉన్నవారికి మాత్రమే పెట్టుబడి నిధి ఇవ్వడానికి రూ. 35.98 కోట్లు విడుదల చేశారు. ఊర్లో లేకుండా ఉండటం, తాత్కాలికంగా వలస వెళ్లడం, ఆధార్ సమర్పించక పోవడం, ఆధార్‌నెంబర్ మ్యాచ్ కాకపోవడం వంటి కారణాల వల్ల 909 మందికి పెట్టుబడి నిధి మంజూరు కాలేదు. వీరంతా అర్హులై ఉండి ఆధార్‌నెంబర్ సమర్పిస్తే వారికి కూడా పెట్టుబడి నిధితోపాటు, వడ్డీలేని రుణాలు మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల వారీగా వడ్డీలేని రుణాలు కడప నగరపాలక సంస్థకు రూ. 5.82 కోట్లు, బద్వేల్ మున్సిపాలిటీకి రూ. 2.25 కోట్లు, జమ్మలమడుగుకు రూ. 1.22 కోట్లు, మైదుకూరుకు రూ. 1.06 కోట్లు, ప్రొద్దుటూరుకు రూ. 4.26 కోట్లు, పులివెందులకు రూ. 3.25 కోట్లు, రాజంపేటకు రూ. 1.01 కోట్లు, రాయచోటికి రూ. 1.10 కోట్లు, యర్రగుంట్లకు రూ. 1.21 కోట్ల వడ్దీ లేని రుణాలు విడుద లయ్యాయి. పెట్టుబడి నిధి వివరాలు ఇలా.. కడప నగరపాలక సంస్థకు రూ. 12.81 కోట్లు, బద్వేల్ మున్సిపాలిటీకి రూ. 3.26 కోట్లు, జమ్మలమడుగుకు రూ. 1.88 కోట్లు, మైదుకూరుకు రూ. 2.11 కోట్లు, ప్రొద్దుటూరుకు రూ. 6.81 కోట్లు, పులివెందులకు రూ. 3.48 కోట్లు, రాజంపేటకు రూ. 1.63 కోట్లు, రాయచోటికి రూ. 2.48 కోట్లు, యర్రగుంట్లకు రూ. 1.47 కోట్ల వడ్దీ లేని రుణాలు విడుద లయ్యాయి. -
వసూలు సరే.. వడ్డింపులేవీ?
- మూడేళ్లుగా వడ్డీ రాయితీ విదల్చని సర్కారు - పేరుకుపోయిన రూ.49.74 కోట్ల బకాయిలు - ఆందోళనలో మహిళా సంఘాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్వయంసహాయక సంఘాలు సంకటంలో పడ్డాయి. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తలపెట్టిన వడ్డీ లేని రుణాల పథకం.. ఆర్థిక చిక్కుల్లోకి నెట్టేశాయి. దీంతో జిల్లాలోని మహిళలు గత మూడేళ్లుగా తీసుకున్న బ్యాంకు లింకు రుణాలకు వడ్డీ చెల్లిస్తుండడంతో ఆర్థిక బలోపేతం సంగతేమో గాని అసలుకే ఎసరు వచ్చింది. జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు పొందిన బ్యాంకులకు గత మూడేళ్లకాలంలో రూ. 106.36 కోట్ల మేర వడ్డీ చెల్లించాయి. కానీ ఈ వడ్డీ మొత్తాన్ని సర్కారు రద్దు చేసి నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ. 56.59 కోట్లు చెల్లించి మమ అనిపించింది. దీంతో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి వడ్డీ నిధులు రాకపోవడంతో మహిళలు సొంతంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. స్పందించని సర్కారు.. జిల్లాలో 31,719 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో దాదాపు 3.35లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళా సంఘానికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి లింకు రుణాలందిస్తోంది. ఈ రుణాన్ని పొందిన మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఈ రుణాలను ఏవిధమైన వడ్డీ లేకుండా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సంఘాలు సైతం మొగ్గుచూపాయి. దీంతో జిల్లాలో దాదాపు అన్ని సంఘాలు అర్హత ప్రకారం రుణాలు పొందాయి. అయితే రుణ చెల్లింపుల్లో భాగంగా సంఘాలు ముందుగా వడ్డీ డబ్బులు సైతం బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన తర్వాత సకాలంలో రీపేమెంట్ చేసిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బును తిరిగి ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మహిళా సంఘాలు వడ్డీ రూపంలో రూ.106.36 కోట్లు చెల్లించినట్లు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మూడేళ్లకు సంబంధించి కేవలం రూ. 56.59 కోట్లు మాత్రమే విడుదల చేసి మమ అనిపించింది. ఇంకా రూ. 49.74 కోట్లు రావాల్సి ఉండగా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. వడ్డీపై వడ్డీ.. లింకు రుణాలు పొందిన సంఘాల నుంచి బ్యాంకులు ముక్కుపిండి మరీ వసూళ్లకు ఉపక్రమిస్తున్నాయి. వాస్తవానికి వడ్డీ లేని రుణాలను ముందస్తుగా మంజూరు చేస్తే సంఘాల సభ్యులకు ఊరట లభించేంది. అదేవిధంగా తిరిగి చెల్లింపులు సైతం ఉత్సాహంతో చేసేవారు. కానీ రుణ మొత్తానికి సంబంధించి చెల్లింపులు వందశాతం పూర్తయిన తర్వాత వడ్డీ రాయితీ కల్పించడం సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం రాయితీ ప్రక్రియతో సంబంధం లేకుండా వడ్డీని కలిపి వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సరిగ్గా చెల్లింపులు చేయని సంఘాలపై వడ్డీ డబ్బులపైనా అదనంగా వడ్డీ వసూలు చేస్తున్నట్లు పలువురు మహిళలు పేర్కొంటున్నారు. -
నిలువు దోపిడీ
* బరితెగించిన మెప్మా ఉద్యోగులు * మహిళా సంఘాల నుంచి బలవంతపు వసూళ్లు * లేదంటే రుణ మంజూరులో అడ్డంకులు * ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలు టార్గెట్ ఆర్మూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మాటగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విధానంతో మహిళా సంఘాలకు వడ్డీ లేని రు ణాలు అందాలి. అయితే ఆర్మూర్‌లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం మహిళలకు బ్యాంకు రుణా ల వడ్డీ మాఫీ చేయడం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తోంటే. రుణాల వంకతో మహిళా సంఘాల నుంచి వేల రూపాయలను వసూలు చేయడానికి పట్టణ పేదరిక ని ర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు పూనుకున్నారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులందరికీ ముడుపులు చెల్లిం చాల్సి ఉంటుందంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ మహిళా సంఘానికి రుణం అందకుం డా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో గత్యం తరం లేని పరిస్థితులలో మెప్మా ఉద్యోగులకు మహిళా సంఘాలవా రు ముడుపులు ముట్ట జెప్పుకుంటున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీల పరిధిలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆర్మూర్‌లోనే మెప్మా ఉద్యోగులు ముడుపుల రూపంలో ఈ ఏడాది రూ. 20 లక్షలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంటే మహిళలు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థమవుతోంది. ఇలాంటి ఉద్యోగు ల కారణంగా ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందజేసినా రుణం మొత్తం చెల్లించే సమయానికి వందకు రెండు రూపాయల వడ్డీని చెల్లించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇదీ జరగాలి మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడ మే లక్ష్యంగా గత పాలకుల హయాంలో నుంచి ఇందిరా క్రాంతి పథం, మెప్మా ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో 742 మహిళా సంఘాలు ఉన్నా యి. పది నుంచి 20 మహిళా సంఘాలతో కలిపి 29 మహిళా సమాఖ్యలను (పెద్ద సం ఘాలు) ఏర్పాటు చేసారు. ప్రతీ మహిళా సమాఖ్యకు మినిట్ బుక్స్, బ్యాంకు రికార్డులు రాయడానికి ఒక రీసోర్స్ పర్సన్ (ఆర్పీ) ఉం టారు. ఈ ఆర్పీలకు మ హిళా సమాఖ్యలో జమ చేసుకున్న మొత్తం నుంచి వేతనాలు చెల్లిస్తారు. ఆర్పీలందరినీ మానిటరింగ్ చేస్తూ ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉం టారు. వీరు మెప్మా ఉద్యోగులుగా వేతనాలు అందుకుంటున్నారు. మహిళా సంఘాలు రుణాలు పొందే సమయంలో ఆర్పీలు సం బంధిత డాక్యుమెంట్లు సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి బ్యా ంకర్ల తో మాట్లాడి ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యత సీఓ, ఆర్పీలపై ఉంటుంది. వీరు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఆధీనంలో ఈ సేవలందించాల్సి ఉంటుంది. మరేం జరుగుతోంది ఆర్మూర్ పట్టణంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 190 సంఘాలకు రూ. 4.5 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్న తాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఆర్మూర్ పట్టణంలోని 138 సంఘాలకు రూ. 3.74 కోట్ల రుణం ఇప్పించినట్లు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉదయశ్రీ తెలిపారు. అయితే, ఈ రుణాలు ఇప్పించే సమయంలో నిరక్షరాస్యులు, పెద్దగా తెలియని పలు మహిళా సంఘాలవారు నేరుగా బ్యాంకుకు వెళ్లి మేనేజర్లతో రుణం గురించి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్పీలు, సీఓలు, టీఎంఓలు మహిళా సంఘాల తరపున బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి రుణం ఇప్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని మెప్మా ఉద్యోగులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా రుణం ఇప్పించినందుకు తమకు ప్రతి సంఘం నుంచి రూ. 10 వేలు చెల్లించాలని ఆర్మూర్ పట్టణంలోని ఒక సీఓ హుకుం జారీ చేసారు. ఈ డబ్బులు చెల్లించకపోయినా,తాము సూచించిన మొత్తానికి ఒక్క పైసా తగ్గినా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి లబ్ధికైనా అర్హత లభించకుండా చేస్తామంటూ బహిరంగంగానే బెది రింపులకు పాల్పడుతున్నారు. ఇలా చెల్లించాల్సిన రూ. పది వేలలో పెద్ద సంఘానికి రూ. 5 వేలు, తమ సొంత ఖర్చులకు రూ. 5 వేలు తీసుకుంటామని సెలవిస్తున్నారు. నిబంధన ల ప్రకారం మంజూరైన రుణంలో 0.25 శాతం మాత్రమే పెద్ద సంఘంలో జమ చేయాల్సి ఉంటుంది. కాని మెప్మా ఉద్యోగులు మహిళలను బెదిరింపులకు పాల్పడుతూ ముడుపుల రూపంలో దోపిడీకి పా ల్పడుతున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని తమ స్థాయికి తగ్గట్లు భాగాలు వేసుకొని పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ గణాంకాల ప్రకారం ఇప్పటికే రుణం మం జూరు చేయిం చిన 138 సంఘాల నుంచి సుమారు 13 లక్షలు వసూలు చేసి పంచుకున్నట్లు సమాచారం. మిగిలి పోయిన సంఘాలకు సైతం వెంటది వెంట రుణాలు ఇప్పించి మరో రూ. 7 లక్షలు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహిళా సంఘాల సభ్యులు తెలుపుతున్నారు. ఫిర్యాదు చేయడానికి సంబంధిత అధికారి దగ్గరికి వెళ్లినా పట్టించుకోవడం లేద ని మహిళలు వాపోతున్నారు. ఉన్నతాధికారులైన పట్టించుకోవాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ నగరంలో 2,445 మహిళా సంఘాలకు రూ. 45.82 కోట్ల బ్యాంకు రుణా లు చెల్లించాలని మెప్మా ఉన్నతాధికారులు టార్గెట్ విధించగా 691 సంఘాలకు రూ. 19.22 కోట్ల రుణాలు ఇప్పించారు. కామారెడ్డి పట్టణంలో 153 సంఘాలకు రూ. 3.90 కోట్ల టార్గెట్ విధించగా 95 సంఘాలకు రూ. 3.13 కోట్ల రుణాలిప్పించారు. బోధన్ పట్టణంలో 3012 సంఘాలకు రూ. 8.23 కోట్ల టార్గెట్ విధించగా 157 సంఘాలకు రూ. 4.94 కోట్ల రుణాలు ఇప్పించారు. ఈ పట్టణాల్లో సైతం పలువురు మెప్మా ఉద్యోగులపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మెప్మా ఉద్యోగులు ఎవరైనా ముడుపులు అడిగితే మాకు మౌఖికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము. నిబంధనల ప్రకారం చెల్లిం చాల్సిన మొత్తం మినహా యించి అదనంగా ఒక్క రూపా యి చెల్లించాల్సి న అవసరం లేదు. మెప్మా ఉద్యోగులకు సంస్థ నుంచి నేరుగా వేతనాలు అందుతాయి కాబట్టి వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. -ఉదయశ్రీ, టౌన్ మిషన్ కోఆర్డినేటర్, ఆర్మూర్ ‘‘తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారితకు పెద్దపీట వేసేందుకు వడ్డీ లేని రుణాలను అందజేస్తాం. ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాల కోసం రూ. 485 కోట్లు మంజూరు చేస్తాము. 30 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించే 70 శాతం మహిళా సంఘాలకు ఈ పథకాన్ని అమలు చేస్తాం’’ - కె . తారకరామారావు,పంచాయతీరాజ్ శాఖ మంత్రి -
5 నెలల్లో 550 కోట్ల బకాయి!
వడ్డీ లేని రుణ పథకంపై సర్కారు నిర్లక్ష్యం రూ. 1,600 కోట్లకు గాను బడ్జెట్లో ప్రతిపాదించిందే రూ. 700 కోట్లు 5 నెలలుగా మహిళల ఖాతాల్లో జమకాని వడ్డీ సాక్షి, హైదరాబాద్: ‘సంక్షేమ పథకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధుల సమస్య రానీయం. ఇతర పథకాలకు నిధులు ఆగినా, సంక్షేమ పథకాలకు మాత్రం గ్రీన్‌చానల్ నుంచి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే నిధులు ఠంఛనుగా సంబంధిత శాఖలకు వెళ్లిపోతాయి. అన్ని పథకాలూ అమలవుతాయి’ అంటూ అధికారంలో ఉన్నప్పుడు పాలకులు ఊదరగొడితే మహిళలు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వడ్డీలేని రుణ పథకం కింద తీసుకున్న రుణాలకు గత ఐదు నెలలుగా వడ్డీ విడుదల కాకపోవడంతో మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో బ్యాంకులు మహిళల నుంచే వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. మార్చితో కలిపి ఐదు నెలల వడ్డీ మొత్తం దాదాపు రూ.550 కోట్లను ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా వడ్డీని బ్యాంకుల ద్వారా మహిళా సంఘాల ఖాతాల్లోకి నేరుగా చెల్లిస్తామన్న ప్రభుత్వం నెలల తరబడి వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకులు మహిళల ముక్కుపిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నాయి. - 2012 జనవరి ఒకటో తేదీ నుంచి వడ్డీ లేని రుణాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. - రూ.5 లక్షల లోపు రుణం తీసుకున్న మహిళా సంఘాలకే ఈ పథకాన్ని పరిమితం చేశారు. - రాష్ట్రంలోని ఏడు లక్షల మహిళా సంఘాలు.. అంటే సుమారు 70 లక్షల మంది మహిళలు వడ్డీలేని రుణాలు పొందారు. - మహిళా సంఘాలు తీసుకున్న రుణ వాయిదాలను ప్రతి నెలా నిర్ణీత గడువులోగా చెల్లిస్తేనే వడ్డీ పొందేందుకు అర్హులని ప్రభుత్వం నిబంధన విధించింది. - మహిళా సంఘాలు సకాలంలో అసలు చెల్లిస్తున్నా, ప్రభుత్వం వడ్డీ చెల్లించడం లేదు. - ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 1,600 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంది. - కానీ ఈ ఏడాది బడ్జెట్లో వడ్డీ చెల్లింపులకు ప్రతిపాదించిన మొత్తమే రూ. 700 కోట్లు. - గత ఐదు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో బకారుుల మొత్తం రూ. 550 కోట్లకు చేరింది. - బకారుుల విడుదలకు పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) అధికారులు లేఖలు రాస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. - రాబడి తగ్గి రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో వడ్డీ బకాయిలు విడుదలయ్యే పరిస్థితీ కనిపించడం లేదు. - ఇక ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. మూడుసార్లు లేఖ రాశాం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిలపై ప్రభుత్వానికి మూడుసార్లు లేఖలు రాశాం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మొత్తమే కాకుండా బంగారు తల్లి కింద రూ.20 కోట్లు కూడా విడుదల చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులూ రావడం లేదు. -‘సెర్ప్’ ఉన్నతాధికారి వడ్డీలేని రుణాలు అంతా మోసం ప్రభుత్వం పేరుకే వడ్డీలేని రుణాలని చెప్పింది. మా సంఘ సభ్యులం యాచారం ఎస్‌బీెహ చ్లో రూ. 40 వేల రుణం తీసుకున్నాం. నెల నెలా సక్రమంగా చెల్లించాం. మరోసారి మూడు నెలల కిందే తీసుకున్న అప్పు కూడా పూర్తిగా చెల్లించాం. కానీ తీసుకున్న అప్పుకు రూ.2 వడ్డీ పడింది. అంతా మోసం - కొప్పు సుకన్య, అంబేద్కర్ మహిళా పొదుపు సంఘం, యాచారం (రంగారెడ్డి జిల్లా) రూ. 2 వరకు వడ్డీ పడుతోంది వూ సంఘ సభ్యులం నక్కర్త ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకుంటాం. మొదట్లో తీసుకున్న రూ. 2 లక్షల అప్పుకు పావలా వడ్డీ కూడా జమ కాలేదు. బ్యాంకులో, ఐకేపీ సిబ్బందిని అడిగితే జమ అవుతుందని అంటున్నారు. కానీ కాలేదు. వడ్డీలేని రుణాలంటున్నారు కానీ రూపాయి నుంచి రూ. 2 వరకు వడ్డీ పడుతోంది. - రామావత్ కౌసల్య, ఝాన్సీబాయి మహిళా పొదుపు సంఘం, తక్కళ్లపల్లి తండా (రంగారెడ్డి జిల్లా) -
రూ.530 కోట్ల రుణాల అందజేత
నిడదవోలు, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా 68 వేల స్వయం సహాయక సంఘాలకు 2013-14లో రూ. 672 కోట్ల వడ్డీలేని రుణాలు అం దించాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు రూ. 530 కోట్లు అందజేశామని డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ తెలిపారు. నిడదవోలు డీఆర్డీఏ కార్యాలయంలో నాలుగు మండలాల పరిధిలో నిరుద్యోగులకు మంగళవా రం నిర్వహించిన జాబ్‌మేళాను ఆ యన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మిగిలిన రుణాలను ఈనెలాఖరులోగా అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్త రేషన్‌కార్డులలో తప్పొప్పుల కారణంగా అమ్మహస్తం పథకంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బంగారుతల్లిలో 5,320 మందికి లబ్ధి జిల్లాలో 7,500 మందికి బంగారు తల్లి పథకాన్ని వర్తింపజేయాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు 5,320 మంది చి న్నారులకు నగదు అందించామని తె లిపారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. పింఛన్ల పంపిణీకి అదనపు సిబ్బంది వృద్ధాప్య, వితంతు, వికలాంగ పిం ఛన్లు పోస్టల్ శాఖ ద్వారా అందించేందుకు ప్రక్రియ పూర్తయిందని చె ప్పారు. 500 మంది పింఛన్‌దారులు ఉన్న ప్రాంతాల్లో అదనంగా మరో సి బ్బందిని నియమిస్తామన్నారు. జిల్లా లో 3,41,560 మంది పింఛన్‌దారులున్నారని తెలిపారు. 2,964 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జిల్లావ్యాప్తంగా 72 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా కేవలం 12 కేంద్రాల్లో 2,964 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని రామకృష్ణ తెలిపారు. ఈమేరకు రైతులకు రూ. 39 లక్షలు అందజేశామన్నారు. 6 మండలాల్లో ఏపీఎం పోస్టులు, నరసాపురం, ఏలూరులో ఏరియా కో-ఆర్డినేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాజీవ్ యువకిరణాల పథకంలో భాగంగా ఇప్పటి వరకు 5,900 మందికి వివిధ కేటగిరిలో శిక్షణ ఇవ్వగా 2,800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. జిల్లా జాబ్స్ మేనేజర్ కె.రవీంద్రబాబు, ఏరియా కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, ఏపీఎం మేరీరత్నం పాల్గొన్నారు. -
గ్రూపులుగా ఏర్పడితే వడ్డీలేని రుణాలు
నర్సాపూర్,న్యూస్‌లైన్: పద్ధెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడితే వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వి. సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గతంలో దరఖాస్తు చేయకపోవడంతో కొందరు స్కాలర్‌షిప్పుకు అర్హత పొందలేదని, అలాంటి వారికి ప్రత్యేకంగా కృషి చేసి స్కాలర్ షిప్‌లు మంజూరు చేయించినట్లు తెలిపారు. కాగా 18 సంవత్సరాలు నిండిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే వడ్డీలేని రుణాలు పొందవచ్చని చెప్పారు. అంతేకాకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంటు కార్యక్రమం కింద సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 4400మంది సభ్యులకు గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 365మందికి చెక్కులను పంపిణీ చేశారు. గెలుపుకోసం కృషి చేయాలి క్రీడల్లో ఓడిన వారు గెలుపు కోసం కృషి చేయాలని, ఓటమి చెందినంత మాత్రాన నిరుత్సాహ పడవద్దని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గత వారం రోజులుగా నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగిన హన్మంతు రామయ్య స్మారక నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నీ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్రీడలతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం, స్నేహభావం పెంపొందుతాయన్నారు. క్రీడల నిర్వహణ అభినందనీయమని ఆమె నిర్వాహకులను అభినందించారు. కాగా నర్సాపూర్‌కు చెందిన హనుమాన్ జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా మండలంలోని జక్కపల్లికి చెందిన బంజారా జట్టు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. అనంతరం క్రీడాకారులకు షీల్డులు, వ్యకిగత బహుమతులు, నగదు బహుమతులను మంత్రి అందచేశారు. అలాగే హన్మంతు సరస్వతి స్మారకార్థం నెల 24న నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మాజీ సర్పంచ్‌లు నర్సింగ్‌రావు, సంజీవరావు, కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్యంగౌడ్, అంజనేయులుగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అళ్వారయ్య, అనిల్‌గౌడ్, చందన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, భరత్‌గౌడ్, నర్సింగరావు పాల్గొన్నారు.